సురక్షితంగా భూమిపైకి సునీతా, బుచ్ విల్‌మోర్

నాసా, స్పేస్, సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్, డ్రాగన్ , ఎలాన్ మస్క్, అమెరికా, ఫ్లోరిడా

ఫొటో సోర్స్, Reuters

సునీతా విలియమ్స్, విల్‌మోర్‌ల తొమ్మిదినెలల అంతరిక్షవాసం ముగిసింది. స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్‌లో సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లతోపాటు, నాసా వ్యోమగామి, మిషన్ కమాండర్ నిక్ ‌హేగ్, రోస్‌కాస్మస్ వ్యోమగామి అలెగ్జాండర్ గుర్బునోవ్‌లు భూమి మీదకు సురక్షితంగా వచ్చారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్‌ విడిపోయాక 17 గంటలు ప్రయాణించి, వీరు భూమి మీదకు చేరారు. దీంతో ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఓ మిషన్ విజయవంతంగా పూర్తయింది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నాసా, స్పేస్, సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్, డ్రాగన్ , ఎలాన్ మస్క్, అమెరికా, ఫ్లోరిడా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, క్యాప్సూల్ నుంచి బయటకు వస్తున్న సునీతా విలియమ్స్

డ్రాగన్ క్యాప్సూల్‌ బుధవారం తెల్లవారుజామున సరిగ్గా 3గంటల 27 నిమిషాలకు భూమిపైకి చేరుకుంది. ఫ్లోరిడాలోని తల్హసీ తీరంలోని గల్ఫ్ ఆఫ్ అమెరికా జలాల్లో సురక్షితంగా దిగింది.

సునీతా, బుచ్ విల్‌మోర్ క్యాప్సూల్‌ నుంచి బయటకు వచ్చే క్షణం కోసం ఎదురు చూస్తుండగా, అక్కడి జలాల్లో డాల్ఫిన్ల గుంపు క్యాప్సూల్‌ చుట్టూ తిరుగుతూ కనిపించింది. రక్షణ బృందంలో అవి కూడా భాగమేనని నాసా వ్యాఖ్యాతలు సరదాగా కామెంట్ చేశారు.

నాసా, స్పేస్, సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్, డ్రాగన్ , ఎలాన్ మస్క్, అమెరికా, ఫ్లోరిడ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, చిరునవ్వులు చిందిస్తూ బయటకు వచ్చిన బుచ్ విల్‌మోర్

పారాచూట్లు తెరుచుకుని, క్యాప్సూల్‌ సముద్ర జలాల్లోకి ల్యాండ్ అయ్యాక, క్యాప్సూల్‌ను రక్షణ సిబ్బంది నౌకలోకి తెచ్చి, మంచి నీటితో శుభ్రం చేశారు.

ముందుగా డ్రాగన్ క్యాప్సూల్‌ నుంచి వ్యోమగామి నిక్ హేగ్ బయటకు వచ్చారు. ఆయన చిరునవ్వులు చిందిస్తూ, విజయచిహ్నంగా బొటనవేలను చూపారు.

286 రోజుల సుదీర్ఘ అంతరిక్షవాసాన్ని గడిపిన సునీతా, బుచ్‌లు ఆ తర్వాత బయటకు వచ్చారు. తొలుత సునీతా బయటకు రాగా, తరువాత బుచ్ వంతు.

నాసా, స్పేస్, సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్, డ్రాగన్ , ఎలాన్ మస్క్, అమెరికా, ఫ్లోరిడా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, సముద్రాన్ని తాకే ముందు పారాచూట్లు విచ్చుకున్నాయి.
నాసా, స్పేస్, సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్, డ్రాగన్ , ఎలాన్ మస్క్, అమెరికా, ఫ్లోరిడా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, సముద్రాన్ని తాకిన క్యాప్సూల్‌

వీరిని స్పేస్ ఎక్స్ రక్షణ నౌకలు, బయటకు తీసుకువచ్చాయి. ఓ చిన్న వ్యోమనౌకలో సుమారు 17గంటలు అంతరిక్షంలో గడిపాకా గట్టి ఉపరితలాన్ని (పడవ డెక్)ను తాకారు. స్వచ్ఛమైన గాలిని పీల్చుకున్నారు.

నాసా, స్పేస్, సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్, డ్రాగన్ , ఎలాన్ మస్క్, అమెరికా, ఫ్లోరిడా

ఫొటో సోర్స్, Reuters

ఒడ్డుకు చేరిన తరువాత వీరు హ్యూస్టన్‌లోని నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్‌కు వెళతారు. తరువాత కుటుంబసభ్యులను కలుసుకుంటారు.

నాసా, స్పేస్, సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్, డ్రాగన్ , ఎలాన్ మస్క్, అమెరికా, ఫ్లోరిడా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, క్యాప్సూల్ సముద్రంలో పడగానే దాని చుట్టూ డాల్ఫిన్లు తిరుగుతూ కనిపించాయి.
నాసా, స్పేస్, సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్, డ్రాగన్ , ఎలాన్ మస్క్, అమెరికా, ఫ్లోరిడా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, క్యాప్సూల్‌ను తర్వాత నౌకపైకి తెచ్చారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కీలకమైన శాస్త్ర, సాంకేతిక కార్యక్రమాలు నిర్వహించిన సునీతా, బుచ్, నిక్, అలెగ్జాండర్లను భూమి మీదకు తీసుకురావడం ఆనందంగా ఉందని నాసా తాత్కాలిక అడ్మినిస్ట్రేటర్ జానెట్ పెట్రో అన్నారు.

నాసా, స్పేస్, సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్, డ్రాగన్ , ఎలాన్ మస్క్, అమెరికా, ఫ్లోరిడా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, నౌకపైకి తెచ్చిన క్యాప్సూల్‌ను మంచి నీటితో కడిగారు.

సునీతా, బుచ్ ఇద్దరూ అంతరిక్షంలో 900 గంటల పరిశోధన చేశారని, 150 ప్రయోగాలు చేశారని నాసా స్పేస్ ఆపరేషన్స్‌కు చెందిన అడ్మినిస్ట్రేటర్ జోయెల్ మోంటాల్బానో వెల్లడించారు.

నాసా, స్పేస్, సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్, డ్రాగన్ , ఎలాన్ మస్క్, అమెరికా, ఫ్లోరిడా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, భూమి మీదకు ప్రయాణించే ముందు క్యాప్సూల్‌లో నలుగురు సిబ్బంది

''క్రూ'' అంతా బావున్నారు

' క్రూ మొత్తం బావున్నారు' అని నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ చెప్పారు. హ్యూస్టన్‌కు తిరిగి వెళ్లేముందు రికవరీ నౌకలో కొంతసేపు గడుపుతామని ఆయన చెప్పారు.

వైద్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవనే విషయం స్పష్టమైన తరువాత వారు తమ కుటుంబాలను కలుసుకుంటారని, ఇందుకు ఒకరోజు సమయం పట్టొచ్చని ఆయన తెలిపారు.

త్వరలోనే వారు తమ అంతరిక్ష అనుభవాలను వెల్లడిస్తారని కూడా చెప్పారు.

నాసా అవసరాలకు తగినట్టు స్పేస్ ఎక్స్ చక్కగా స్పందించిందని, స్పేస్ ఎక్స్‌కు కృతజ్ఞతలు చెప్పారు స్టీవ్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,డి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)