అమృత్‌సర్: స్వర్ణ దేవాలయం ముందు కాపలాదారుగా మత శిక్ష అనుభవిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు

పంజాబ్, స్వర్ణ దేవాలయం, అమృత్‌సర్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు ఘటన దృశ్యం

అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం దగ్గర బుధవారం ఉదయం బుల్లెట్ పేలింది.

అకాలీదళ్ నాయకుడు, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ అకాల్ తఖ్త్ శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఆయనపై కాల్పులు జరిగాయి.

ఆ సమయంలో రికార్డయిన వీడియోలో, ఒక వృద్ధుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ వైపు వెళుతున్నట్లు కనిపించింది. అదే వ్యక్తి పిస్టల్ తీసి ఆయనపై కాల్పులు జరిపారు. బాదల్‌ పక్కనే ఉన్న వ్యక్తులు అతన్ని పట్టుకున్నారు.

ఘటన జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది సుఖ్‌బీర్ బాదల్‌కు రక్షణగా నిలబడ్డారని, దాడి చేసిన వ్యక్తి నుంచి పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారని మీడియా రిపోర్టు చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పంజాబ్, స్వర్ణ దేవాలయం, అమృత్‌సర్ , సుఖ్‌బీర్ సింగ్ బాదల్

ఫొటో సోర్స్, Akali Dal

ఫొటో క్యాప్షన్, ఈటెను పట్టుకుని స్వర్ణ దేవాలయం ముందు కాపలాదారుగా కూర్చున్న సుఖ్‌బీర్ సింగ్ బాదల్

దాడి చేసింది ఎవరు?

స్వర్ణ దేవాలయం దగ్గర సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆయనపై దాడి యత్నం జరిగినట్లు అమృత్‌సర్‌ పోలీసు కమిషనర్‌ గుర్‌ప్రీత్‌ సింగ్‌ భుల్లర్‌ ధృవీకరించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కాల్పులు జరిపిన వ్యక్తి పేరు రూప్ నారాయణ్ సింగ్.

ఖలిస్తాన్ ఉద్యమంలో యాక్టివ్‌గా ఉండే నారాయణ్ సింగ్‌కు ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్‌, అకాల్ ఫెడరేషన్‌తో సంబంధాలున్నాయి.

సోమవారంనాడు బాదల్‌తోపాటు, అప్పటి క్యాబినెట్‌లో పని చేసిన పలువురికి అకాల్ తఖ్త్ మతపరమైన శిక్ష విధించింది.

ఇందులో భాగంగా స్వర్ణ దేవాలయం గేటు దగ్గర బాదల్ కాపలాదారుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలోనే ఆయనపై కాల్పులు జరిగాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)