జో బైడెన్‌కు కోవిడ్ పాజిటివ్

 జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు, కోవిడ్ పాజిటివ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కోవిడ్
    • రచయిత, ఆనా ఫాగై
    • హోదా, బీబీసీ ప్రతినిధి, వాషింగ్టన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కోవిడ్ - 19 పాజిటివ్‌గా తేలిందని, ఆయన స్వల్ప లక్షణాలతో బాధ పడుతున్నారని వైట్ హౌస్ ప్రకటించింది.

ఆయన గతంలో వ్యాక్సీన్ వేయించుకున్నారని, బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారని అధ్యక్షుడి ప్రెస్ కార్యదర్శి కరీన్ జీన్ పియరీ చెప్పారు. బైడెన్‌కు గతంలోనూ రెండుసార్లు కోవిడ్ సోకింది.

81 ఏళ్ల జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం లాస్‌వెగాస్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు.

అనంతరం రాత్రి పూట నిర్వహించాల్సిన ప్రచార కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.

అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలని ఆయనపై కొన్ని రోజులుగా ఒత్తిడి పెరుగుతోంది.

జూన్ చివరిలో జరిగిన అధ్యక్ష అభ్యర్థుల డిబేట్‌లో ఆయన ప్రదర్శన బాగా లేదని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయనకు కరోనా సోకడం పార్టీ నేతల్లో చర్చనీయమైంది.

బీబీసీ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Biden

ఫొటో సోర్స్, Getty Images

‘ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటారు’

"అధ్యక్షుడు ఆయన సొంత ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటారు. అక్కడ నుంచే అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తారు" అని జీన్ పియరీ చెప్పారు.

"జో బైడెన్ శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడుుతున్నారు. ఆయనకు జలుబు, దగ్గు కూడా ఉంది. ఆయనకు పాక్స్‌లోవిడ్ ఫస్ట్ డోస్ ఇచ్చాం" అని అధ్యక్షుడి వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ కెవిన్ ఓ కానర్ చెప్పారు.

బుధవారం జరిగిన తొలి ప్రచారంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ తర్వాత పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్ అని తేలిందని డాక్టర్ చెప్పారు.

"నేను కోలుకోవాలని సందేశం పంపించిన అందరికీ ధన్యవాదాలు" అని బైడెన్ ట్విట్టర్ ( ఎక్స్) వేదికగా మెసేజ్ పంపించారు. కోలుకునే క్రమంలో అమెరికన్ ప్రజలు తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తానని అందులో తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఆయన మరో ట్విట్టర్(ఎక్స్) అకౌంట్‌‌లో "నేను అనారోగ్యం బారిన పడ్డాను" అని పోస్ట్ చేశారు.

అంతకు ముందు అదే అకౌంట్‌ నుంచి ఆయన.. "ఎలన్ మస్క్, అతని సంపన్న మిత్రులు ఈ ఎన్నికను కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. మీరు దీన్ని అంగీకరిస్తే, నాతో చేతులు కలపండి" అని పోస్ట్ చేశారు.

ఎన్నికల విరాళాలకు సంబంధించిన పోర్టల్‌లో ఈ ట్వీట్ చేశారు.

బైడెన్‌కు కోవిడ్ సోకిందని తెలియగానే లాస్‌వెగాస్ పర్యటన కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులు నగరంలోని ఎయిర్‌పోర్టుకు పరుగులు తీశారు.

ఎయిర్‌పోర్టులో ఉన్న ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం ఎక్కే సమయంలో బైడెన్ నిదానంగా మెట్లు ఎక్కినట్లు వీడియోలో కనిపించింది. ఆయన మాస్క్ కూడా పెట్టుకోలేదు.

విమానం ఎక్కిన తర్వాత ఆయన 'నాకిప్పుడు బాగానే ఉంది' అని చెప్పడం వినిపించింది.

లాటిన్ పౌర హక్కుల సంస్థ యునిడోస్ యూఎస్‌ను ఉద్దేశించి అధ్యక్షుడు బైడెన్ చేయాల్సిన ప్రసంగం మానుకోవాలని అధికారులు ఒత్తిడి చెయ్యడంతో ఆయన దాన్ని రద్దు చేసుకున్నారు.

దాదాపు పాతిక మంది డెమోక్రాట్ నేతలు ఆయనను అధ్యక్ష పదవి పోటీ నుంచి వైదొలగాలని కోరారు.

అందులో కాలిఫోర్నియాకు చెందిన ఆడమ్ షిఫ్ కూడా ఉన్నారు. జో బైడెన్ డోనల్డ్ ట్రంప్‌ను ఓడించగలరని తాను భావించడం లేదని ఆయన చెప్పారు.

"బైడెన్ తప్పుకొని ఆ అవకాశాన్ని మరెవరికైనా ఇవ్వాలి" అని ఆయన చెప్పారు.

దేశం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని తాను అనుకోవడం లేదని జో బైడెన్ తాజాగా బీఈటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఇంటర్వ్యూ ప్రసారం కావల్సి ఉంది.

మరోవైపు.. తనకు 'అనారోగ్య సమస్యలు' ఉన్నాయని తన వ్యక్తిగత డాక్టర్లు ఎవరైనా చెబితే తాను అధ్యక్ష పోటీ నుంచి తప్పుకునే విషయాన్ని ఆలోచిస్తానని అధ్యక్షుడు జో బైడెన్ తొలిసారి చెప్పారు.

వీడియో క్యాప్షన్, అధ్యక్ష పోటీ నుంచి తప్పుకోవాలని సొంత పార్టీ నుంచే పెరుగుతున్న ఒత్తిళ్లు...

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)