కాస్: వినేశ్ ఫొగాట్ అప్పీల్ తిరస్కరణ

రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌

ఫొటో సోర్స్, Getty Images

రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌ అప్పీల్‌ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (కాస్‌) తిరస్కరించింది.

ఈ మేరకు న్యూస్ ఏజెన్సీలు ఏఎన్ఐ, పీటీఐలు ‘ఎక్స్’లో పోస్ట్ చేశాయి.

ఒలింపిక్స్‌లో 50 కేజీల మహిళల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్‌ విభాగంలో ఫైనల్‌కు చేరిన తరువాత తనను అనర్హురాలిగా ప్రకటించడంపై వినేశ్ ఫొగాట్ కాస్‌‌లో అప్పీల్ చేశారు.

తనకు ఉమ్మడిగా రజతం ఇవ్వాలని ఆమె తన అప్పీల్‌లో కోరారు. గత శుక్రవారం దీనిపై విచారణ ముగియగా తీర్పు రిజర్వ్ చేశారు.

కోర్ట్‌ ఆఫ్ ఆర్బిట్రేషన్‌ ఫర్ స్టోర్ట్స్‌లో వినేశ్ తరఫున సీనియర్ అడ్వొకేట్ హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
వినేశ్ ఫొగాట్

ఫొటో సోర్స్, Getty Images

అసలేమైంది?

పారిస్ ఒలింపిక్స్ మహిళల ఫ్రీస్టయిల్ 50 కేజీల కుస్తీ పోటీలో వినేశ్ ఫొగాట్ ఫైనల్‌కు అర్హత సాధించారు.

ఆమె ఫైనల్‌లో ఆడి గెలిస్తే స్వర్ణం, ఓడితే రజతం వచ్చేది. కానీ, ఫైనల్ పోటీకి ముందు బరువు చూసినప్పుడు ఆమె 100 గ్రాములు అధికంగా ఉండడంతో అనర్హురాలిగా ప్రకటించారు.

దీంతో ఫైనల్ ఆడే అవకాశం కోల్పోవడంతో పాటు పతకాన్నీ దక్కించుకోలేకపోయారు.

‘‘సెమీఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆమె బరువు 52.7 కేజీలకు చేరింది. రాత్రంతా ఆమె నిద్రపోలేదు, ఆహారం తీసుకోలేదు, గుక్కెడు నీళ్లు కూడా తాగలేదు. పరుగెత్తడం, వ్యాయామం చేస్తూనే ఉంది. బాగా శ్రమించి 50.1 కేజీలకు తగ్గింది. కానీ, మిగతా 100 గ్రాముల బరువు తగ్గేందుకు కావాల్సినంత సమయం లేదు. అందుకోసం అదనపు సమయాన్ని ఇవ్వలేదు’’ అని ఆమె బృందంలోని ఒక సభ్యున్ని ఉటంకిస్తూ స్పోర్ట్స్ స్టార్ వెబ్‌సైట్ పేర్కొంది.

తనపై అనర్హత వేటు వేయడాన్ని వినేశ్ కాస్‌లో సవాల్ చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

వినేశ్ ఫొగాట్

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)