ఐఎన్ఎస్ అర్ణాలా: ఆరు అంతస్తుల భారత యుద్ధ నౌక 6 చిత్రాలు

INS Arnala

ఇండియన్ నేవీలో ఇటీవలే చేరి మొట్టమొదటి స్వదేశీ యాంటీ సబ్‌ మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ అర్ణాలాలోకి ‘బీబీసీ బృందం’ వెళ్లింది.

ఈ యుద్ధ నౌక పొడవు 77 మీటర్లు. ఆరు అంతస్తుల్లో ఉండే ఈ యుద్ధ నౌక సుమారు 26 అంతస్తుల భవనం ఎత్తుకు సమానంగా ఉంటుంది.

సాధారణ యుద్ధ నౌకలకు ఉండే అన్ని సామర్థ్యాలతో పాటు శత్రు జలాంతర్గాములపై దాడి చేయగలిగే శక్తి దీనికి ప్రత్యేకం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
INS Arnala

అర్ణాలా శ్రేణి నౌకలను భారతదేశంలోని రెండు ప్రధాన షిప్‌యార్డ్‌లకు చెందిన సంస్థలు నిర్మిస్తున్నాయి.

ఇలాంటివి మొత్తం 16 నౌకలను నిర్మిస్తుండగా.. అందులో కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఎనిమిది, కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ సంస్థ మరో ఎనిమిది నిర్మిస్తున్నాయి.

INS Arnala
ఫొటో క్యాప్షన్, ఐఎన్ఎస్ అర్ణాలా

యుద్ధనౌకలో అనేక రకాల సెన్సర్లు, ఆయుధాలు, ఇంజిన్లు, కమ్యూనికేషన్ సాధనాలు మొదలైనవి ఉంటాయి.

దీంతో దాని లోపలంతా తిరగడానికి ఎక్కువ స్థలం ఉండదు. ఐఎన్ఎస్ అర్ణాలా కూడా ఇలాగే ఉంది.

అర్ణాలాకు ఆరు అంతస్తులు(డెక్) ఉన్నాయి. మెట్ల సాయంతో వెళ్లొచ్చు.

INS Arnala

ఐఎన్ఎస్ అర్ణాలాకు ఉన్న మరో ప్రత్యేకత దాని ఇంజిన్.

డీజిల్ ఇంజిన్ , వాటర్‌జెట్ టెక్నాలజీతో నడిచే అతిపెద్ద యుద్ధనౌక ఇదని నేవీ తెలిపింది.

ఇంజిన్ గదుల్లో ఒకదానిలోకి బీబీసీ బృందం వెళ్లింది. ఐఎన్ఎస్ అర్ణాలా సిబ్బందిలో ఒకరైన ములాయం సింగ్‌ను మేమిక్కడ కలిశాం. ఆయన ఇంజిన్ ఆపరేషన్స్ చూసుకుంటారు.

INS Arnala

ఈ యుద్ధనౌకలో 100 మందికి పైగా అధికారులు, నావికులు ఉన్నారు.

వారికి వసతి, ఆహారం, వినోద సౌకర్యాలు యుద్ధనౌకలో ఉన్నట్టు బీబీసీ గమనించింది.

రజనీశ్ శర్మ దీనికి నావల్ ఆఫీసర్ ఇన్‌చార్జ్(ఎన్‌ఓఐసీ).

INS Arnala

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)