విశాఖలో మంత్రి రోజా బాక్సింగ్
జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రోజా విశాఖ నగరంలో బాక్సింగ్ చేశారు.
విశాఖపట్నం వైఎంసీఏ బీచ్ రోడ్‌లో ఆంధ్ర బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఎం బాక్సింగ్ నేషనల్ ఛాంపియన్‌షిప్ క్రీడల ప్రారంభం సందర్భంగా ఆమె సరదాగా ఇలా బాక్సింగ్ గ్లోవ్స్ ధరించి మరో వైసీపీ నేత, జీసీసీ చైర్‌పర్సన్ శోభ స్వాతిరాణితో బాక్సింగ్ చేశారు.
బాక్సింగ్ రింగ్‌లో మంత్రి రోజా, స్వాతిరాణిలు అటుఇటూ కదులుతూ పంచ్‌లు విసురుకుంటుంటే వైసీపీ నాయకులు, కార్యకర్తలు చప్పట్లతో వారిని ప్రోత్సహించారు.
స్వాతిరాణి శృంగవరపుకోట మాజీ ఎమ్మెల్యే శోభ హైమావతి కుమార్తె. స్వాతి రాణి ఇంతకుముందు విజయనగరం జిల్లా చైర్‌పర్సన్‌గా పనిచేశారు.
కాగా సీఎం బాక్సింగ్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో 14 రాష్ట్రాల నుంచి 400 మంది బాక్సర్లు పాల్గొంటున్నారు.

- మెస్సీ వరల్డ్ కప్ సాధిస్తే, భారత అభిమానులు సచిన్‌ను ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు
- ఫిఫా ప్రపంచ కప్ వేదికగా ఖతార్ మత ప్రచారం చేసిందా
- అవతార్ 2: ‘కథలో పస లేదు, కథనంలో వేగం లేదు, పాత్రల్లో దమ్ము లేదు.. టెర్మినేటర్ బెటర్’ - బీబీసీ రివ్యూ
- ఎలాన్ మస్క్: ట్విటర్ బాస్‌గా దిగిపోవాల్సిందేనంటూ యూజర్ల ఓటు - ఇప్పుడు పరిస్థితేంటో?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









