ఆంధ్రప్రదేశ్: 20 రూపాయలకే ‘మన భోజనం’ - ఎక్కడంటే...

వీడియో క్యాప్షన్, ఆ కుటుంబం 50 రూపాయల భోజనాన్ని 20 రూపాయలకే అందిస్తోంది
ఆంధ్రప్రదేశ్: 20 రూపాయలకే ‘మన భోజనం’ - ఎక్కడంటే...

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఓ మామూలు హోటల్‌లో భోజనం చేయాలన్నా సుమారు 100 రూపాయలు ఖర్చవుతుంది.

కానీ ఒక కుటుంబం ‘మన భోజనం’ పేరుతో తక్కువ ధరకే ఆహారం అందిస్తున్నారు.

ఈ భోజనంలో అన్నం, కూర, చట్నీ, సాంబారు, మజ్జిగ కూడా అందిస్తున్నారు.

భోజనం

ఒక్కో భోజనానికి దాదాపు 50 రూపాయలు ఖర్చవుతుందని వారు చెప్పారు. తమకు చేతనైన సేవ చేయాలన్న ఉద్దేశంతో ధర తగ్గించి అందిస్తున్నామని తెలిపారు.

విద్యార్థులతో పాటు వివిధ తరగతుల వారు ఇక్కడ భోజనం చేయటానికి వస్తున్నారు.

ఈ భోజనం ధర చాలా అందుబాటులో ఉండటమే కాకుండా, ఇంటి భోజనం లాగా రుచిగా ఉంటుందని ఇక్కడ భోజనం చేసిన పలువురు విద్యార్థులు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)