హోటల్ యజమాని జయా శెట్టి హత్య కేసులో చోటా రాజన్‌కు బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్టు

ఫొటో సోర్స్, AFP
హోటల్ యజమాని జయా శెట్టి హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2001లో ముంబయిలో హోటల్ యజమాని జయా శెట్టి హత్యకు గురయ్యారు.
ఈ కేసులో 2024 మే 30న చోటా రాజన్‌కు ముంబయిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది.
జస్టిస్ రేవతి మోహితే డేరే, జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్‌లతో కూడిన డివిజనల్ బెంచ్ బుధవారం (అక్టోబర్ 23న) బెయిల్ మంజూరు చేసిందని వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
లక్ష రూపాయల పూచీకత్తుతో ఆయనకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ చోటా రాజన్ జైలు నుంచి ఇప్పట్లో విడుదల కాకపోవచ్చని, ఆయన మరికొన్ని కేసుల్లోనూ శిక్షలు ఎదుర్కొంటున్నారని ఏఎన్‌ఐ పేర్కొంది.
చోటా రాజన్ అసలు పేరు రాజేంద్ర సదాశివ్ నికల్జే.
పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న చోటా రాజన్ 2015 అక్టోబర్‌లో ఇండోనేసియాలోని బాలిలో అరెస్టయ్యారు.
(బ్లాక్ టికెట్‌ల అమ్మకం, చిన్నచిన్న దొంగతనాలతో మొదలైన చోటా రాజన్ నేర చరిత్ర అండర్ వరల్డ్ డాన్‌గా వేళ్లూనుకునే వరకు ఎలా సాగింది?.. పూర్తి కథనం ఇక్కడ చదవండి )

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














