కాప్ 30 సదస్సులో భారీ అగ్నికీలలు, ప్రమాద దృశ్యాలు ఇవే..
ఫొటో సోర్స్, Getty Images
బ్రెజిల్‌లోని బెలెమ్ నగరంలో నిర్వహిస్తోన్న కాప్ 30 సదస్సులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో వాతావరణ చర్చలు జరుగుతుండగా వేదికలోని ఒక పెవిలియన్‌లో గురువారం అగ్ని ప్రమాదం జరగడంతో వివిధ దేశాల ప్రతినిధి బృందాలు, ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
అత్యవసర సహాయక బృందాలు వెంటనే మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించాయి.
ఫొటో క్యాప్షన్, మంటలను ఆరు నిమిషాల్లో అదుపులోకి తెచ్చామని, పొగ పీల్చి అనారోగ్యానికి గురైన 13 మందికి చికిత్స అందించామని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, అగ్ని ప్రమాదానికి కారణాలేంటో తెలియరాలేదు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ఒప్పందం కుదుర్చుకోవడానికి చర్చలు జరుగుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, విద్యుత్తు ప్రమాదమే దీనికి కారణమని అనుకుంటున్నట్లు బీబీసీకి ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, అగ్ని ప్రమాదంతో చర్చలు నిలిచిపోయాయని, అనేక దేశాల ప్రతినిధులు ఒక పెట్రోల్ బంకులో ఆశ్రయం పొందాల్సి వచ్చిందని బీబీసీతో యూకే ప్రతినిధి బృందంలోని ఒక సభ్యుడు చెప్పారు
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, ఐక్యరాజ్యసమితి నిర్వహించే ఈ వాతావరణ చర్చల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ప్రతినిధులతోపాటు వేలమంది ప్రజలు కూడా పాల్గొంటున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఎలా పురోగతి సాధించాలనే అంశంపై ఏకాభిప్రాయం కోసం దాదాపు 200 దేశాలు ఈ సదస్సులో ప్రయత్నిస్తున్నాయి.