జీఎస్టీలో ఇకపై రెండే శ్లాబులు: తగ్గిన ధరలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి, ఏయే రేట్లు తగ్గుతాయి?

నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, Getty Images

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం రాత్రి జీఎస్టీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రెండు రేట్ల జీఎస్టీ వ్యవస్థపై ఏకాభిప్రాయం కుదిరిందని ఆమె వెల్లడించారు.

జీఎస్టీలో ఇప్పటి వరకు ఉన్న 12 శాతం, 28 శాతం రేట్ల శ్లాబులను రద్దు చేసినట్లు ఆమె ప్రకటించారు.

ఇక నుంచి 5 శాతం, 18 శాతం శ్లాబులు మాత్రమే అమల్లో ఉంటాయని చెప్పారు.

శ్లాబులు ప్రధానంగా రెండే అయినప్పటికీ, పొగాకు ఉత్పత్తులు, లగ్జరీకార్లు, ఇంజిన్ సామర్థ్యం 350 సీసీ దాటిన మోటారు సైకిళ్ల పై 40 శాతం దాకా జీఎస్టీ ఉంది. దీనిని సిన్ టాక్స్ అని పిలుస్తారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జీఎస్టీ, నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, Getty Images

నిత్యావసరాలు

18 శాతం నుంచి 5 శాతం పరిధిలోకి...

  • హెయిర్ ఆయిల్
  • షాంపూ
  • టూత్‌పేస్ట్
  • టాయిలెట్ సోప్ బార్,
  • టూత్‌బ్రష్,
  • షేవింగ్ క్రీమ్ వంటివి.

12 శాతం నుంచి 5 శాతం పరిధిలోకి

  • బటర్
  • నెయ్యి
  • చీజ్
  • డెయిరీ స్ప్రెడ్స్
  • ప్యాకేజ్డ్ నమ్కిన్
  • భుజియా మిక్చర్,
  • వంట పాత్రలు
  • పిల్లల పాల బాటిళ్లు
  • నాప్కిన్లు
  • డైపర్లు,
  • కుట్టు మిషన్లు, వాటి విడిభాగాలు
జీఎస్టీ, నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, Getty Images

ఆరోగ్య రంగం
  • ఇక నుంచి హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లకు జీఎస్టీ లేదు. ఇంతకుముందు వీటిపై 18 శాతం జీఎస్టీ ఉండేది.
  • ఇక 18, 12 శాతాలలో ఉన్న పరికరాలు 5 శాతం పరిధిలోకి వచ్చాయి. అవేంటంటే..
  • థర్మామీటర్
  • మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్
  • డయాగ్నోస్టిక్ కిట్
  • గ్లూకోమీటర్
  • టెస్ట్ స్ట్రిప్స్
  • కళ్ల జోడు
జీఎస్టీ, నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, Getty Images

విద్యారంగం

వీటికి నో జీఎస్టీ (గతంలో 12 శాతం ఉండేది)

  • మ్యాప్
  • చార్ట్
  • గ్లోబ్
  • పెన్సిల్
  • షార్ప్‌నర్
  • క్రేయాన్స్
  • పేస్టల్స్,
  • నోట్‌బుక్‌లకు..
  • జీఎస్టీ లేదు.
  • ఎరేజర్‌పై సున్నా శాతం (గతంలో 5శాతం)
వ్యవసాయ రంగం
ట్రాక్టర్

ఫొటో సోర్స్, Getty Images

18 శాతం నుంచి 5 శాతానికి తగ్గినవి

  • ట్రాక్టర్ టైర్లు
  • దాని విడిభాగాలపై

12 శాతం నుంచి 5 శాతానికి తగ్గినవి

  • ట్రాక్టర్లు
  • బయో పెస్టిసైడ్స్,
  • మైక్రో న్యూట్రియంట్స్
  • డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్
  • స్ప్రింక్లర్లు
ఆటోొ మొబైల్ రం

ఫొటో సోర్స్, Getty Images

ఆటోమొబైల్

ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్‌పై 28 శాతం ఉన్న జీఎస్టీని 18 శాతానికి తీసుకొచ్చారు.

  • పెట్రోల్
  • ఎల్పీజీ
  • సీఎన్జీ కార్లు
  • డీజిల్ హైబ్రిడ్ కార్లు
  • త్రిచక్ర వాహనాలు
  • మోటార్ సైకిళ్లు
  • ఏసీలు, టీవీలు
  • మానిటర్లు
  • ప్రొజెక్టర్లు,
  • డిష్ వాష్ మెషీన్లు కూడా చౌకగా మారనున్నాయి.

తగ్గిన ధరలు ఎప్పటి నుంచి..

  • సెప్టెంబర్ 22 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి.
  • ధరల తగ్గింపు వల్ల సర్కారు ఖజానాకు 93వేల కోట్ల రూపాయల రెవెన్యూ నష్టం.
  • జీఎస్టీ కౌన్సిల్ 5, 18 శాతం శ్లాబులు ఆమోదించింది.
  • రాష్ట్రాల రెవెన్యూ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారనేది ఇంకా నిర్ణయించలేదు.
మోదీ

ఫొటో సోర్స్, Kiyoshi Ota/Bloomberg via Getty

సామాన్యులకు మేలు: ప్రధాని

సామాన్యుల జీవితాన్ని సులభతరం చేయడం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే జీఎస్టీ సంస్కరణల లక్ష్యమని ప్రధాని మోదీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. సామాన్యులు, రైతులు, ఎంఎస్ఎంఈలు, మధ్యతరగతి, మహిళలు, యువతకు ప్రయోజనం చేకూర్చే జీఎస్టీ రేట్ల తగ్గింపు, సంస్కరణలకు సంబంధించిన ప్రతిపాదనలకు జీఎస్టీ కౌన్సిల్ అంగీకరించింది.

"ఈ విస్తృత సంస్కరణలు మన పౌరుల జీవితాలను మెరుగుపరుస్తాయి. అందరికీ, ముఖ్యంగా చిన్న వ్యాపారులకు తమవ్యాపారాలను చేయడం సులభతరం చేస్తుంది" అని ప్రధాన మంత్రి అన్నారు.

చిదంబరం

ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty

ఇప్పటికే చాలా ఆలస్యమైంది : చిదంబరం

జీఎస్టీ సంస్కరణల విషయంలో కేంద్రం ఎక్కువ సమయం తీసుకుందని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం విమర్శించారు.

జిఎస్ టి సంస్కరణ, వస్తుసేవలపై రేట్ల తగ్గింపు స్వాగతించదగినదేనని, కానీ అది 8 సంవత్సరాల తర్వాత జరిగిందని, ఇది చాలా ఆలస్యమైందని చిదంబరం ఎక్స్‌లో రాసుకొచ్చారు.

ప్రస్తుత జీఎస్టీ స్వరూపం, ఇప్పటి వరకు అమలు చేస్తున్న రేట్లను తొలి నుంచే అమలు చేసి ఉండాల్సింది కాదన్నారు. గత ఎనిమిదేళ్లుగా జీఎస్టీ నిర్మాణం, రేట్లకు వ్యతిరేకంగా నిరంతరం గళం వినిపిస్తున్నామని, కానీ తమ విజ్ఞప్తులను పట్టించుకోలేదన్నారు.

జీఎస్టీ స్వరూపాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు మార్చిందని చిదంబరం ప్రశ్నించారు.

ప్రభుత్వం మార్పులు చేయడానికి కారణమేమిటి? మందగించిన ఆర్థిక వృద్ధా? పెరుగుతున్న గృహ రుణాలా? తగ్గుతున్న గృహ పొదుపా? బీహార్ ఎన్నికలా..? ట్రంప్, ఆయన సుంకాలా? లేక వీటన్నింటి కలయికనా?" అని ప్రశ్నించారు.

జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రెండు రేట్ల జీఎస్టీ విధానానికి అంగీకారం కుదిరిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 12 శాతం, 28 శాతం రేట్లను రద్దు చేశామని, 5 శాతం, 18 శాతం కొత్త రేట్లపై ఏకాభిప్రాయం కుదిరిందన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)