వైఎస్ షర్మిల వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం?
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, మఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం అక్కడి రాజకీయాలను ఎంత వరకు ప్రభావితం చేయగలదు?
పూర్తిగా నిస్తేజంగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్‌లో ఆమె తిరిగి పునరుత్తేజం నింపగలరా?
ఇంతకూ షర్మిల వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అధికార వైసీపీకా, ప్రతిపక్ష టీడీపీకా? ఆమె చీల్చగలిగే ఓట్లు ఎవరివి? ఇవీ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం వినిపించే ప్రశ్నలు.

మరికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందు ఏపీలో పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఆంధ్ర రాజకీయాల్లోకి షర్మిల ప్రవేశించడంతో, రాజకీయ సమీకరణాల మార్పు గురించి ఇప్పటికే పెద్ద చర్చ మొదలైంది.
పూర్తిగా నిస్తేజంగా మారిపోయిన కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడం అనేంత పెద్ద పని ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చు. కానీ, పూర్తిగా అయిపోయిందన్న కాంగ్రెస్‌లో ఆమె కొంతైనా కదలిక తీసుకురాగలరు.
ఈ అంశాల గురించి బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- ఐకాన్ ఆఫ్ ద సీస్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ నౌక తొలి ప్రయాణం షురూ.. దీనిపై విమర్శలు ఎందుకు?
- గురక ఎందుకు వస్తుంది? రాత్రిపూట పదేపదే నిద్ర చెడిపోతే మెదడు పనితీరు దెబ్బతింటుందా?
- పీతలకు ‘రక్షణ కవచం’గా బాటిల్ మూతలు.. హృదయం ముక్కలైందన్న శాస్త్రవేత్తలు
- అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను ఇజ్రాయెల్ పాటిస్తుందా?
- ఐఎన్ఎస్ విశాఖపట్నం: 22 మంది భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై హుతీల క్షిపణి దాడి, స్పందించిన భారత నౌకాదళం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









