కమలా హారిస్: 'మా అమ్మ ఇండియా నుంచి అమెరికా వచ్చినప్పుడు ఈరోజు వస్తుందని ఊహించి ఉండరు'

వీడియో క్యాప్షన్, కమలా హారిస్: 'మా అమ్మ ఇండియా నుంచి అమెరికా వచ్చినప్పుడు ఈరోజు వస్తుందని ఊహించి ఉండరు'

అమెరికా ప్రెసిడెంట్‌గా జో బైడెన్ ఎన్నిక కాగా, దేశ తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్‌గా భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్ ఎన్నికయ్యారు. కమలా హ్యారిస్ తల్లిది తమిళనాడు. తండ్రిది జమైకా.

"నేను ఇప్పుడు ఈ స్థానంలో ఉండటానికి మూలకారణమైన మహిళ నా తల్లి శ్యామలా గోపాలన్ హ్యారిస్. ఆమె ఎప్పుడూ నా గుండెల్లో ఉంటుంది. ఆమె తన 19 ఏళ్ల వయసులో ఇండియా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు, ఇలాంటి క్షణం వస్తుందని ఎప్పుడూ ఊహించి ఉండకపోవచ్చు. కానీ తను మాత్రం ఇలాంటి క్షణం అమెరికాలోనే సాధ్యమవుతుందనే ప్రగాఢ విశ్వాసం కలిగి ఉండేవారు" అని కమలా హ్యారిస్ తన విజయోత్సవ ప్రసంగంలో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)