పీవీ సింధు ‘ఐ రిటైర్’ ట్వీట్ కలకలం.. ఇంతకీ ఆమె ఏం చెప్పారు?

ఫొటో సోర్స్, Gajendra Singh Shekhawat/Twitter
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు "ఐ రిటైర్" అంటూ సోషల్ మీడియా వేదికలైన ఇంస్టాగ్రామ్, ట్విటర్ లో చేసిన పోస్టు సంచలనంగా మారింది.
"డెన్మార్క్ ఓపెన్ నాకు తగిలిన చివరి దెబ్బ. నేను రిటైర్ అవుతున్నాను" అంటూ పివి సింధు ట్వీట్ చేశారు.
ఇది క్రీడాభిమానులు తొలుత.. బ్యాడ్మింటన్ నుంచి ఆమె రిటైర్ అవుతున్నట్లు ప్రకటిస్తున్నారనే భావనలో పడేసింది.
కొన్ని మీడియా సంస్థలు సింధు రిటైర్మెంట్ ప్రకటించారంటూ బ్రేకింగ్ న్యూస్ కూడా ఇచ్చాయి.
అయితే, ఆమె రాసిన పోస్టులో వివరాలు మరోలా ఉన్నాయి.
పి వి సింధు ట్వీట్లో ఏముంది?
"నేనెప్పటి నుంచో నా భావాలను నిజాయితీతో చెప్పాలని ఆలోచిస్తున్నాను. అవి ఎలా చెప్పాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్న మాట నిజం. మీకు తెలుసా, ఎందుకో అన్నీ తప్పుగా జరుగుతున్నాయని అనిపిస్తోంది. అందుకే ఇక విసిగిపోయాను అని చెప్పాలనిపించి నా భావాలు రాతలో పెడుతున్నాను".
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"నేనేమి మాట్లాడుతున్నానో మీకు ఏమీ అర్ధం అవుతుండకపోవచ్చు. లేదా అయోమయంగా అనిపిస్తూ ఉండవచ్చు. అది చాలా సహజం. కానీ, నేను రాసిందంతా పూర్తిగా చదివాక నా అభిప్రాయం మీకు అర్ధం అవుతుంది. అప్పుడు మీరు నన్ను సమర్ధిస్తారని కూడా అనుకుంటున్నాను".
"ఈ మహమ్మారి నా కళ్ళు తెరిపించింది. ఆట ముగిసేవరకూ బలమైన ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి నేను చాలా కఠినమైన శిక్షణ తీసుకోగలను. అలా గతంలో చేసాను. భవిష్యత్తులో కూడా చేయగలను. ప్రపంచాన్ని అంతటినీ స్తబ్దతలో ముంచేసిన ఈ కంటికి కనిపించని వైరస్ ని ఓడించటం ఎలాగో అర్ధం కావటం లేదు.
‘‘కొన్ని నెలలుగా ఇంటి పట్టునే ఉన్న మనం బయటకు వెళుతున్న ప్రతి సారి ప్రశ్నించుకుంటూనే ఉన్నాం. ఈ పరిస్థితిని అంతా స్వయంగా అనుభవిస్తూ ఆన్ లైన్ లో హృదయ విదారకమైన కథలు చదువుతూ ఉంటే నాతో పాటు, మనమంతా నివసిస్తున్న ఈ ప్రపంచం గురించి ప్రశ్నించుకునేలా చేసింది. డెన్మార్క్ ఓపెన్ లో దేశం తరుపున ఆడలేకపోవడం నాకు తగిలిన చివరి దెబ్బ".
"ఇప్పుడున్న ఈ అనిశ్చిత పరిస్థితి నుంచి నాకు నేనుగా విరమణ పలుకుతున్నాను. నేను ఈ ప్రతికూలత, భయం, అనిశ్చితి నుంచి విరమణ తీసుకుంటున్నాను. ఏ మాత్రమూ నియంత్రణ లేని ఈ అపరిచిత విషయం నుంచి విరమణ తీసుకుంటున్నాను".
"అపరిశుభ్ర విధానాల నుంచి, వైరస్ పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణి నుంచి వైదొలగాలనే నిర్ణయాన్ని తీసుకున్నాను. దీని నుంచి పక్కకు తప్పుకోవడానికి లేదు. దీనిని ఎదుర్కోవడానికి మనం ఇంకా బాగా సంసిద్ధమవ్వాలి. ఈ వైరస్ ని మనమంతా కలిసి ఓడించాలి. ఈ రోజు మనం తీసుకున్న నిర్ణయాలే రేపటి మన భవితను, మన తరువాతి వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఇది ఇలా వదిలేసే విషయం కాదు".

ఫొటో సోర్స్, Getty Images
"నేను మీకు చిన్నపాటి గుండె దడను తెప్పించి ఉంటాను. ఈ ఊహించని పరిస్థితుల్లో ఊహించని చర్యలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. మీరందరూ దీని గురించి ఒక్క సారి దృష్టి పెడతారని భావిస్తున్నాను. అలాగే, సొరంగం చివర వెలుగు ఉంటుందనే విషయాన్ని కూడా మనం విస్మరించకూడదు".
"అవును? డెన్మార్క్ ఓపెన్ చోటు చేసుకోవటం లేదు కాబట్టి నేనేమి శిక్షణ తీసుకోవడం ఆపటం లేదు. జీవితం మీకు ఎదురు తిరిగితే మీరు దానిని రెట్టింపు ధైర్యంతో ఎదుర్కోవాలి. నేను ఆసియా ఓపెన్ కోసం ఇప్పుడు అలాగే శ్రమిస్తాను".
"నేను గట్టిగా పోరాడకుండా ఓడిపోయానని చెప్పడానికి అంగీకరించను. ఈ భయాన్ని ఎదుర్కోకుండా నేను ఓడిపోయాను అని చెప్పడానికి ఒప్పుకోను. మనమంతా సురక్షిత ప్రపంచాన్ని చూసే వరకు నేను పోరాడుతూనే ఉంటాను".
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
పి వి సింధు పోస్టును చూసి చాలా మంది క్రీడాభిమానులు ఆమె క్రీడల నుంచి రిటైర్ అయ్యారనే భ్రమలో పడి ట్వీట్ల ద్వారా తమ అభిప్రాయాలను, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం మొదలు పెట్టారు.
కొంత మంది ఈ పోస్టు చూసి గుండె పోటు వచ్చినట్లయింది అని రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఇలాంటి పోస్టు పెట్టి సింధు సంచలనం సృష్టించారని కొంత మంది వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
మరి కొంత మంది నెటిజన్లు ట్వీట్ పూర్తి సారాంశం చదవకుండా పదవీ విరమణ శుభాకాంక్షలు కూడా చెప్పేసారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
ఈ వార్త రాసే సమయానికి సింధు చేసిన ట్వీట్ 1900 సార్లు రీట్వీట్ అయింది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్కు మందు కనిపెట్టడంలో దారి చూపుతున్న 14 ఏళ్ల తెలుగమ్మాయి
- అంబేడ్కర్, శివాజీ విగ్రహాల ఏర్పాటుపై వివాదం.. దళితులు, ముదిరాజ్ల మధ్య ఘర్షణ
- హాథ్రస్ నిజాలు సమాధి అవుతున్నాయా... బాధితురాలి గ్రామంలో ఏం జరుగుతోంది?
- "మేం దళితులం కాబట్టి.. మా శవాలకు కూడా దిక్కులేదు.. ఇతరులెవరికీ ఇలాంటి పరిస్థితి ఉండదేమో"
- బొబ్బిలి అంటే వీరత్వమే కాదు వీణ కూడా.. తంజావూరు తరువాత ఈ తెలుగు వీణకే పట్టం
- ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులేమిటి? ఏయే చార్జ్షీట్లలో ఏముంది?
- అంబేడ్కర్, శివాజీ విగ్రహాల ఏర్పాటుపై వివాదం.. దళితులు, ముదిరాజ్ల మధ్య ఘర్షణ
- దక్షిణాది ప్రజల ఇష్టమైన టిఫిన్ దోశకు పుట్టినిల్లు ఏది కర్ణాటకా.. తమిళనాడా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)