ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

1. ఆస్కార్-ఆర్‌ఆర్‌ఆర్: ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల 'నాటు నాటు' పాట ఎలా పుట్టింది?

పిల్లాపాపల నుంచి వృద్ధుల వరకు అందరినీ ఉర్రూతలూగిస్తున్న సినీ గీతాల్లో 'నాటు నాటు' పాట ఒకటి.

ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని ఈ పాట విడుద‌లైన‌ప్పటి నుంచే ప్రేక్ష‌కుల మ‌దిలో నాటుకుపోయింది.

వెండి తెర‌పై ఎన్టీఆర్ - రామ్ చ‌ర‌ణ్‌ల డాన్స్ తోడ‌య్యాక‌... ఆ పాట‌ను దర్శకుడు ఎస్‌ఎస్ రాజ‌మౌళి త‌న‌దైన శైలిలో ఆవిష్క‌రించాక‌ ఇది మ‌రింత ఆద‌ర‌ణ చూరగొంది.

ప్ర‌తిష్ఠాత్మ‌క ఆస్కార్ అవార్డు కోసం ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ పాట పోటీ పడి విజయం సాధించింది.

ఈ నేపథ్యంలో, నాటు నాటు పాట ఎలా పురుడు పోసుకుందో తెలుసుకుందాం.

నాడు దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ మదిలో మెదిలిన ఆలోచనలు ఏమిటో చూద్దాం. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

2. భాంగఢ్ కోట: "చీకటి పడ్డాక అక్కడికి వెళ్లినవారు ప్రాణాలతో తిరిగి రారు" - ఇది నిజమేనా?

"సూర్యుడు అస్తమించిన తరువాత ఇక్కడికి వచ్చేవారు తిరిగి వెళ్లరు. చీకటి పడిన తరువాత వెళ్లినవారు చనిపోతారు లేదా మాయమైపోతారని చెబుతారు."

ఈ మాటలు చెబుతూ టూరిస్ట్ గైడ్ సంతోష్ ప్రజాపతి భాంగఢ్ కోట కథ చెప్పడం మొదలుపెట్టారు.

'సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ప్రవేశం నిషిద్ధం' అని స్పష్టంగా రాసి ఉన్న బోర్డు ఇక్కడ ఉంది.

ఇది దెయ్యాల కోట అని, భారతదేశంలో అత్యంత భయంకరమైన ప్రదేశం ఇదేనని స్థానికులు నమ్ముతారు.

భాంగఢ్ కోటను 16వ శతాబ్దంలో నిర్మించారు. రాజా మాధవ్ సింగ్ రాజ్యానికి ఇది కేంద్రంగా ఉండేది. అయితే, కొన్ని సంవత్సరాల తరువాత ప్రజలు ఈ ప్రాంతాన్ని విడిచి వేరే చోటికి వెళ్లిపోవడం ప్రారంభించారు. పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

3. జోషీమఠ్: కుంగిపోతున్న ఈ నగరానికి మహాభారతానికి ఏంటి సంబంధం?

ఇంగ్లిష్ ఐసీఎస్ అధికారి హెచ్‌జీ వాల్టన్ 1910లో రాసిన ''ద గజెటీర్ ఆఫ్ గఢ్‌వాల్ హిమాలయాస్'' పుస్తకంలో జోషీమఠ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

''అప్పట్లో ఇక్కడ కొన్ని రాళ్లతో నిర్మించిన ఇళ్లు, రాత్రిపూట పడుకునేందుకు సత్రాలు, దేవాలయాలు ఉండేవి. వ్యాపారులతో ఇక్కడి వీధులు కళకళలాడేవి. జడలబర్రెల మెడలోని గంటలు, గుర్రాల పరుగుల శబ్దాలు ఇక్కడ వినిపించేవి. ఇక్కడి ప్రజలకు టిబెట్‌తోనూ వాణిజ్య సంబంధాలు ఉండేవి''అని పుస్తకంలో ఆయన రాసుకొచ్చారు.

అప్పట్లో వ్యాపారుల లావాదేవీలతో జోషీమఠ్ ఒక వ్యాపార కేంద్రంగా కొనసాగేది. అయితే, వాల్టన్ కాలంలోనే కొందరు వ్యాపారులు తమ మండీలను దక్షిణానికి అంటే నందప్రయాగ్‌కు తరలించేవారు.

ఇక్కడి భోటియా విపణిని టిబెట్‌లోని జ్ఞానిమా మండీతో వాల్టన్ పోల్చారు. జ్ఞానిమా మండీలో ఏడాది పొడవునా వాణిజ్య కార్యకలాపాలు జరుగుతుండేవి. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

4. కిసాన్ మాన్‌ధన్ యోజన: ఉద్యోగుల్లాగే రైతులు నెలనెలా పెన్షన్ పొందడం ఎలా?

ప్రభుత్వ ఉద్యోగికి లాగే రైతు కూడా త‌న‌కు 60 సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌చ్చిన త‌రువాత తాను మ‌ర‌ణించేంత వ‌ర‌కు రూ.3000ల నుంచి రూ.5000ల వ‌ర‌కు పింఛ‌ను పొందే స‌దుపాయం క‌ల్పించే ప‌థ‌క‌మే ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ మాన్‌ధ‌న్ యోజ‌న (Pradhan Mantri Kisan Maan-Dhan Yojana -PM-KMY)

ఎన్నో ప్ర‌త్యేక‌త‌లున్న ఈ ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ మాన్‌ధ‌న్ యోజ‌న (Pradhan Mantri Kisan Maan-Dhan Yojana -PM-KMY) అంటే ఏమిటి? దానికి అర్హులు ఎవ‌రు?

ఈ ప‌థ‌కంలో చేర‌ద‌ల‌చుకున్న రైతు ఏమేమీ పత్రాలు పొందుప‌ర‌చాలి? ఎక్క‌డ ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి త‌దిత‌ర వివ‌రాల‌ను తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

5. కామారెడ్డి: మాస్టర్ ప్లాన్‌ను రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ప్రభుత్వం ఏం చెబుతోంది?

కామారెడ్డి మున్సిపల్ 'మాస్టర్ ప్లాన్' వివాదంగా మారింది. దీన్ని వ్యతిరేకిస్తూ స్థానిక రైతులు నెలరోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు.

మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించిన ఇండస్ట్రియల్ జోన్‌ వల్ల తన భూమి విలువ పడిపోయిందని పయ్యావుల రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం, ఆ తర్వాత రైతు కుంటుంబాలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన నేపథ్యంతో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ చర్చల్లోకి వచ్చింది.

రెండు పంటలు పండే తమ భూములు పోతాయని , మాస్టర్ ప్లాన్ ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని ఇక్కడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)