ప్రపంచంలోనే అతి పెద్ద చెరువు చేప... దీని బరువు 300 కిలోలు

ఫొటో సోర్స్, Wonders of the Mekong
- రచయిత, గ్రేస్ సోయ్
- హోదా, బీబీసీ న్యూస్
ప్రపంచంలోనే ఇది భారీ మంచి నీటి చేప. దీని బరువు 300 కిలోలు ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్టింగ్ రే అని పిలిచే ఈ రకం చేప మంచినీటి చెరువుల్లో పెరుగుతుంది. ఇప్పటివరకు లభించిన మంచి నీటి చెరువు చేపల్లో ఇదే పెద్దదని చెబుతున్నారు.
ఈ భారీ చేప కంబోడియాలో మెకాంగ్ నదిలో లభించింది. 2005లో థాయ్‌లాండ్‌లో 293 కేజీల బరువున్న భారీ క్యాట్ ఫిష్ మెకాంగ్‌లో లభించింది. ఈ రికార్డును స్టింగ్ రే బద్దలుకొట్టింది.
అయితే, ప్రపంచంలో అత్యంత పెద్ద మంచి నీటి చేప గురించి చెప్పేందుకు ప్రత్యేకంగా డేటా బేస్ లేదా రికార్డులు లేవు.
మెకాంగ్ సంపన్నమైన జీవ వైవిధ్యం కలిగిన ప్రదేశం. కానీ, అవసరానికి మించి చేస్తున్న చేపల వేట, ఆనకట్టలు, కాలుష్యం ఈ ప్రాంతపు పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్నాయి.
ఈ నది టిబెట్ పీఠ భూమి నుంచి మొదలై చైనా, మియన్మార్, థాయ్ ల్యాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం మీదుగా ప్రవహిస్తుంది.
ఆరు ఖండాల్లో నదుల్లో ఉన్న పెద్ద చేపల గురించి 20 ఏళ్ల పాటు పరిశోధన చేసిన తర్వాత ఇప్పటి వరకు చూసిన చేపల్లో స్టింగ్ రే అత్యంత పెద్దది అని జెబ్ హోగన్ అనే జీవ శాస్త్రవేత్త చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా ఇంత కంటే పెద్ద చేప ఉన్నట్లు నమోదు కాలేదని అన్నారు. ఈయన మెకాంగ్‌లో అద్భుతాల పై జరుగుతున్న అధ్యయనానికి నేతృత్వం వహిస్తున్నారు.
"ఈ చేపను కనిపెట్టి దాని వివరాలను పొందుపరచడం గణనీయమైన విషయం. ఇది మెకాంగ్ నది చాలా సవాళ్ళను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ చేప ఈ జలాల్లో లభ్యం కావటం సానుకూల సంకేతంగా నిలుస్తోంది" అని డాక్టర్ హోగన్ అన్నారు. ఆయన నెవాడాలో ప్రొఫెసర్‌గా కూడా పని చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Wonders of the Mekong

ఫొటో సోర్స్, Wonders of the Mekong
ఈయన పని చేస్తున్న కన్సర్వేషన్ ప్రాజెక్ట్ కంబోడియా ఫిషరీస్ అడ్మినిస్ట్రేషన్‌తో కలిసి పని చేస్తోంది. వీరు మత్స్యకారుల నెట్ వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మత్స్యకారులు అంతరించిపోతున్న లేదా భారీ చేపలను వేటాడినప్పుడు అధ్యయనకారులకు ఆ సమాచారాన్ని వెంటనే ఇచ్చేందుకు ఈ నెట్ వర్క్ ఉపయోగపడుతుంది.
జూన్ 13 రాత్రి కోహ్ ప్రియహ్ దీవి పై ఒక స్థానిక మత్స్యకారుడు అధ్యయన కారులకు కాల్ చేసి భారీ స్టింగ్ రే చేపను పట్టుకున్నట్లు చెప్పారు. ఇది 3. 98 మీటర్ల పొడవుండి 2.2 మీటర్ల వెడల్పు ఉంది.
భవిష్యత్తులో దాని కదలికలు గుర్తించేందుకు ఆ చేపకు ఒక అకౌస్టిక్ ట్యాగ్‌ను అమర్చారు. దీనిని తిరిగి నీటిలోకి వదిలిపెట్టారు.
"ఆ రోజు రాత్రి ఆకాశంలో చంద్రుడు కనిపిస్తుండగా, మెకాంగ్ జలాల్లోకి ఈ స్టింగ్ రే కలిసిపోయింది" అని డాక్టర్ హోగన్ చెప్పారు.
స్థానిక ఖేమర్ భాషలో ఈ చేపను బోరామి అంటారు. దీనికి నిండు చంద్రుడని అర్ధం.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ప్రకృతిలో మరిన్ని అద్భుతమైన విషయాలు బయటపడతాయనడానికి స్టింగ్ రే చేప దొరకడం ఒక నిదర్శనంగా నిలుస్తోందని డాక్టర్ హోగన్ అన్నారు. భారీ జలచరాలు గురించి చాలా తక్కువ స్థాయిలో అధ్యయనాలు జరిగాయని అన్నారు.
ఈ భారీ స్టింగ్ రే చేప అంతరించిపోతున్న చేపల జాబితాలో ఉంది. మే నెల నుంచి మొదలుకొని ఈ బృందం అధ్యయనం చేసిన స్టింగ్ రే చేపల్లో ఇది రెండవది. గతంలో లభించిన చేప 181 కేజీల బరువుతో ఉంది.
"ఇలాంటి చేపలు దొరికినప్పుడు, ఆ జలాల చుట్టూ పర్యావరణం మెరుగ్గా ఉందని చెప్పవచ్చు. యాంగ్ సీ నదిలో చైనీస్ పాడిల్ చేపలు పూర్తిగా అంతరించిపోయినట్లు శాస్త్రవేత్తలు చెప్పినట్లు డాక్టర్ హోగన్ చెప్పారు. అయితే, మెకాంగ్ జలాల్లో పరిస్థితి ఇక్కడి పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉందని అన్నారు.
"మెకాంగ్‌లో ఉన్న లోతైన కాలువల్లో కూడా ఈ భారీ చేపలను మించిన జీవులు ఉంటాయి. ఈ ఆవాసాల్లో ప్రతీ ఏడాది కొన్ని కోట్ల చేపలు పుడుతూ ఉంటాయి. దీని వల్ల కంబోడియా, వియత్నాంలో లక్షలాది మందికి ఆహార భద్రత చేకూరుతుంది.
ఇవి కూడా చదవండి:
- మనుషులు సెక్స్ ఎందుకు కోరుకుంటారు... లైంగిక సంబంధాల్లో విప్లవం రాబోతోందా?
- యోగా ఎవరెవరు చేయొచ్చు.. ఎవరు చేయకూడదు.. అసలు దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి
- అగ్నిపథ్: ఇలాంటి సైనిక నియామకాల పథకం ఏఏ దేశాల్లో ఉంది? అక్కడి నియమ నిబంధనలు ఏమిటి
- విజయవాడలో బిల్డర్లకు అక్రమంగా లైసెన్సులు ఇస్తున్నారా... ఫ్లాట్స్ కొనుక్కున్న వారి పరిస్థితి ఏంటి?
- ఇళ్లలోనే పుట్టగొడుగుల పెంపకంతో మహిళల జీవితాలు ఎలా మారుతున్నాయంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












