ఉత్తర కొరియా: కొత్త సంవత్సరంలో ప్రజల ఆహార, దుస్తుల కొరత పరిష్కారానికి ప్రాధాన్యం - కిమ్ జోంగ్ ఉన్

వీడియో క్యాప్షన్, 2022కి ఉత్తర కొరియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎలా స్వాగతం పలికారంటే..

ఉత్తర కొరియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు 2022వ సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికాయి.

మిరుమిట్లు గొలిపే విద్యుత్ వెలుగులతో పాటు బాణసంచా పేలుళ్లు జరిపాయి.

అధికార వర్కర్స్ పార్టీ సెంట్రల్ కమిటీ సదస్సులో ప్రసంగిస్తున్న ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్. ఈ ఫొటోను ఉత్తర కొరియా అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ 2021 డిసెంబర్ 28వ తేదీన విడుదల చేసింది

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అధికార వర్కర్స్ పార్టీ సెంట్రల్ కమిటీ సదస్సులో ప్రసంగిస్తున్న ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్. ఈ ఫొటోను ఉత్తర కొరియా అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ 2021 డిసెంబర్ 28వ తేదీన విడుదల చేసింది

‘అభివృద్ధిని పెంచాలి.. ప్రజల ఆహార, దుస్తుల కొరతను పరిష్కరించాలి’ - కిమ్ జోంగ్ ఉన్

ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్-ఉన్ మాట్లాడుతూ దేశం "గొప్ప జీవన్మరణ పోరాటాన్ని" ఎదుర్కొంటున్నందున కొత్త సంవత్సరంలో మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

అధికారంలో పదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జరిగిన అధికార పార్టీ సమావేశం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు.

కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో ఉత్తర కొరియా ఆహార కొరతతో పోరాడుతోంది.

పార్టీ సమావేశంలో ప్రసంగిస్తున్నప్పుడు సాధారణంగా అమెరికా, దక్షిణ కొరియా గురించి మాట్లాడే కిమ్ ఈ సారి మాత్రం వాటిని నేరుగా ప్రస్తావించలేదు.

అభివృద్ధిని పెంచడం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం తమ ప్రధాన కర్తవ్యమని కిమ్ అన్నారు.

2021లో దేశం ఎదుర్కొన్న "కఠినమైన పరిస్థితి"ని అంగీకరిస్తూ.. "ప్రజలకు ఆహారం, దుస్తులు, నివాస సమస్యను పరిష్కరించడంలో సమగ్ర పురోగతి సాధించడమే ముఖ్యమైన పని" అని కిమ్ చెప్పినట్లు అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) పేర్కొంది.

కొత్త సంవత్సరంలో మహమ్మారితో పోరాడటం తమ ప్రధాన లక్ష్యాలలో ఒకటి అని ఆయన అన్నారు.

"అత్యవసర అంటువ్యాధి నివారణకు మొదటి ప్రాధాన్యతనివ్వాలి" అని కిమ్ సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)