తాలిబాన్ గుప్పిట్లో అఫ్గానిస్తాన్: తొలి రోజు కాబుల్ ఎలా ఉందంటే..

ఫొటో సోర్స్, EPA
అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌ని తాలిబాన్‌లు ఆదివారం తమ అధీనంలోకి తీసుకున్నారు.
ఆ తరువాత అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ పారిపోయారు. ఆయన ఉజ్బెకిస్తాన్ వెళ్లినట్లు వార్తాకథనాలు వస్తున్నాయి.
తాలిబాన్‌ల అదుపులో ఉన్న కాబుల్ నగరంలో సోమవారం (ఆగస్ట్ 16) తీసిన చిత్రాలివి.

ఫొటో సోర్స్, EPA
కాబుల్ నగరంలో జన జీవనం సాధారణంగానే అనిపిస్తోందని బీబీసీకి చెందిన మాలిక్ ముదాసిర్ చెప్పారు.
అయితే, ట్రాఫిక్ బాగా తక్కువగా ఉందని, దుకాణాలు చాలావరకు మూసేసి ఉన్నాయని, అంతా నిశ్శబ్దంగా ఉందని చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మాత్రం పరిస్థితి గందరగోళంగా ఉందని ముదాసిర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images


ఫొటో సోర్స్, EPA



ఫొటో సోర్స్, AFP
ప్రస్తుతం విమానాశ్రయం వద్ద 2500 మంది అమెరికా సైనికులు ఉన్నారు. మరో 500 మంది అక్కడికి చేరుకుంటారని పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు.
విమానాల రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు అమెరికా చెప్పింది.

ఫొటో సోర్స్, AFP
టేకాఫ్ కోసం బయలుదేరిన విమానానికి వేలాడుతున్న వారి చిత్రాలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి.

ఫొటో సోర్స్, Unknown
అఫ్గానిస్తాన్ విషాదం మరింత తీవ్రం కాకుండా అంతర్జాతీయ సమాజం స్పందించాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కోరింది.

ఫొటో సోర్స్, AFP
ఇవి కూడా చదవండి:
- అష్రఫ్ ఘనీ: దేశం విడిచి వెళ్లిపోయిన అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు
- తాలిబాన్‌లు ఎవరు?
- అఫ్గానిస్తాన్: తాలిబన్లు ఇంత వేగంగా ఎలా పట్టు సాధించారు
- అఫ్గానిస్తాన్ యుద్ధ బాధితులకు మానవతా సాయం ఎందుకు అందడం లేదు?
- ‘వాళ్లు పాశ్చాత్య సంస్కృతిని వీడటం లేదు, మేం వారిని చంపాల్సిందే’ - తాలిబన్లు
- ప్రయాణికులు దిగిన తర్వాత ఈ విమానాన్ని ఇలా రన్‌వేపైనే ఎందుకు ముక్కలు చేశారు
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








