టోక్యో ఒలింపిక్స్: అమెరికాలో ఒలింపిక్ పతకాల పట్టికలో చైనా టాప్‌లో ఎందుకు కనిపించడం లేదు?

ఫొటో సోర్స్, Getty Images
టోక్యో ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు గెలుచుకున్న దేశాల్లో ప్రస్తుతం చైనా ముందంజలో ఉంది.
ఇదే సరళితో ఒలింపిక్స్ ముగించాలని చైనా ఆశిస్తోంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో చైనాకు అత్యధిక పతకాలు లభించాయి.
కానీ, అమెరికాలో ఒలింపిక్స్ కవరేజీలో ఫలితాలు దీనికి భిన్నంగా కనిపిస్తోంది.
జాతీయ ఒలింపిక్ కమిటీతో సహా, దేశంలోని ప్రధాన మీడియా సంస్థలు పతకాలు గెలుచుకోవడంలో చైనా కంటే అమెరికా ముందంజలో ఉన్నట్లు చూపిస్తున్నారు.
దీనికి సాధారణంగా అనుసరించే లెక్కింపు విధానం కాకుండా వివాదాస్పద రీతిలో ప్రత్యామ్నాయ పట్టికను అనుసరిస్తున్నారు.
ఇందులో బంగారు పతకాలను మాత్రమే కాకుండా మొత్తం గెలుచుకున్న పతకాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీంతో, పట్టికలో చైనా కంటే అమెరికా ముందున్నట్లు కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
గోల్డ్ స్టాండర్డ్
పతకాల లెక్కింపు కోసం ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అవలంబించే గోల్డ్ స్టాండర్డ్ విధానం ప్రకారం చూస్తే, ఆగస్టు 3 నాటికి చైనా 32 స్వర్ణ పతకాలతో పట్టికలో ముందంజలో ఉంది. ఆగస్టు 3 నాటికి అమెరికా గెలుచుకున్న పతకాల సంఖ్య 24.
కానీ, అమెరికాలో ప్రధాన వార్తా సంస్థలైన 'ది న్యూ యార్క్ టైమ్స్', 'ది వాషింగ్టన్ పోస్ట్', 'ఎన్‌బీసీ, ఒలింపిక్స్ ప్రసారం చేసే 'ది టీవీ' నెట్ వర్క్ కూడా అమెరికా గెలుచుకున్న మొత్తం పతకాల సంఖ్యనే పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
ఈ విధానాన్ని అనుసరించడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అభిమానులు కూడా దీనిని విమర్శిస్తున్నారు.
పతకాల లెక్కను అమెరికా "తారుమారు" చేస్తోందని ఆస్ట్రేలియాకు చెందిన న్యూస్ డాట్ కామ్ కూడా ఆరోపించింది.
" ప్రపంచంలో వివిధ దేశాలకు ర్యాంకింగ్ ఇచ్చేందుకు అమెరికాలోని ప్రచురణ సంస్థలు వేటికవే సొంత పద్దతులను అవలంబిస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇలా చేయడం వల్ల ఒక నిర్ణీత దేశం పట్టికలో అగ్రస్థానంలో నిలుస్తుంది" అని ఆ కథనంలో రాశారు.
న్యూ యార్క్ టైమ్స్ మాత్రం మనసు మార్చుకున్నట్లు కనిపించింది.
ఆగస్టు 3న పోటీలు ప్రారంభమయ్యే సమయానికి అది ప్రత్యామ్నాయ విధానాన్ని అవలంబించింది.
కానీ, కొన్ని గంటలకే, స్వర్ణ పతకాలను మాత్రమే వర్గీకరిస్తూ ట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కానీ, ఆ పత్రిక వెబ్ సైట్‌లో మాత్రం రెండు పట్టికలూ కనిపించడం అయోమయానికి గురి చేసింది.
దానికి కొన్నిరోజుల ముందే "గెలుచుకున్న పతకాలను లెక్కించడానికి చాలా విధానాలున్నాయి" అని చెప్పిన న్యూ యార్క్ టైమ్స్ పత్రిక గ్రాఫిక్స్ ఎడిటర్ జోష్ కట్జ్ తాము ప్రత్యామ్నాయ విధానాన్ని అవలంబించడాన్ని సమర్ధించుకున్నారు.
"పతకాలను ఏ విధంగా లెక్కించడం ఉత్తమం? ఏదీ సరైనది కాకపోయే అవకాశం ఉంది. రెండు విధానాలకు మధ్యే మార్గంలో ఉన్న విధానం మంచిది కావచ్చు" అని కట్జ్ జులై 27న రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనీస్ కథలో మెలిక
ఆసక్తికరంగా, 2016లో అమెరికా అత్యధిక సంఖ్యలో బంగారు పతకాలు, ఇతర పతకాలను గెలుచుకున్నప్పుడు కూడా ఈ ప్రత్యామ్నాయ విధానంలో పతకాల లెక్కింపుని ప్రతిపాదించలేదు.
ఇక్కడ కథలో ఏదో మెలిక ఉండవచ్చు. టోక్యో ఒలింపిక్స్ ప్రారంభంలో కష్టంగా పతకాలు గెలుచుకోవడం మొదలుపెట్టిన చైనా ఆగస్టు 03 నాటికి 68 పతకాలతో అమెరికాతో సమానంగా నిలిచింది.
ఆ తర్వాత అమెరికా పతకాల విజయంలో కాస్త ముందుకు వెళ్ళింది. కానీ, టోక్యోలో మరి కొన్ని పతకాలను గెలవాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- కోవిడ్-19ను మనం నోరోవైరస్లా ఎందుకు చూడాలి? అసలు నోరోవైరస్ అంటే ఏమిటి
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








