చైనాలో డెల్టా వేరియంట్: ఏడాది తర్వాత వూహాన్‌లో మళ్లీ కేసులు

చైనా

ఫొటో సోర్స్, Getty Images

దాదాపు ఏడాది తర్వాత చైనాలోని వూహాన్‌లో మళ్లీ కరోనా కేసులు బయటపడుతున్నాయి.

వూహాన్‌లో ఏడుగురు స్థానికులకు కరోనా వైరస్‌ సోకిందని గుర్తించారు.

గతకొన్ని నెలలతో పోలిస్తే ప్రస్తుతం చైనాలో కేసులు పెరుగుతున్నాయి.

10 రోజుల్లో 15 ప్రావిన్సుల్లో 300లకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.

చైనాలో కొత్తగా 90 కరోనా కేసులు నమోదయినట్లు మంగళవారం ప్రకటన విడుదలైంది.వీటిలో 61 మందికి వైరస్‌ సంక్రమణ స్థానికంగానే జరిగినట్టు నేషనల్ హెల్త్ కమిషన్ పేర్కొంది.

ఈ కేసుల సంఖ్య ఒక రోజు ముందు 55గా ఉంది.

వీడియో క్యాప్షన్, కరోనావైరస్ లీకైనట్లు చెబుతున్న వుహాన్ ల్యాబొరేటరీ ఇదే..

భయపెడుతున్న డెల్టా వేరియంట్

చైనాను డెల్టా వేరియంట్‌ భయపెడుతోంది.

దేశీయంగా పర్యాటకులను ప్రోత్సహించడంతో డెల్టా వేరియంట్ వ్యాప్తి మొదలైందని అనుమానిస్తున్నారు.

కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

లాక్‌డౌన్‌ విధించడం, భారీగా కరోనా పరీక్షలు చేయించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.వూహాన్‌లోని ప్రజలందరికీ కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించారు.

వూహాన్‌లో దాదాపు కోటి 10లక్షల మంది ఉంటారు. వారందరికీ టెస్టులు చేయబోతున్నారు.

గతంలోనూ వూహాన్‌లోని వారందరికీ కరోనా టెస్టులు చేయించారు.

వీడియో క్యాప్షన్, కోవిడ్-19 ఎక్కడ పుట్టిందో దర్యాప్తు చేయాలని ఆదేశించిన అమెరికా అధ్యక్షుడు

చైనా తన సరిహద్దుల్లో వైరస్‌ను నియంత్రించడంలో చాలా వరకు విజయం సాధించింది.అయితే, నాన్జింగ్‌లోని రద్దీగా ఉండే విమానాశ్రయంలోని కార్మికుల నుంచి ఇప్పుడు వైరస్ వ్యాపించడం మొదలైంది.

దీంతో నాన్జింగ్‌లో నివసిస్తున్న 92 లక్షల మంది ప్రజలకు అధికారులు మూడుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి లాక్‌డౌన్ ఆంక్షలను విధించారు.

కానీ వారాంతంలో హునాన్ ప్రావిన్స్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం జాంగ్జియాజీ వైరస్ హాట్‌స్పాట్‌గా మారింది.

ఇక్కడ పెద్ద సంఖ్యలో కేసులు బయటపడ్డాయి. నాన్జింగ్ నుంచి ప్రయాణికులు ఇటీవల జాంగ్జియాజీ నగరాన్ని సందర్శించినట్లు భావిస్తున్నారు.

'చైనాలో కరోనా వైరస్‌ వ్యాప్తికి కేంద్ర బిందువుగా జాంగ్జియాజీ మారింది' అని చైనాలోని ప్రముఖ శ్వాసకోశ వ్యాధి నిపుణుడు జాంగ్ నాన్షాన్ విలేఖరులతో అన్నారు.కొత్త వ్యాప్తి రాజధాని బీజింగ్‌ను కూడా చేరుకుంది. స్థానికంగా సంక్రమించిన అనేక అంటువ్యాధుల ఇన్‌ఫెక్షన్‌లను ఇక్కడ గుర్తించారు.

ఇవి కూడా చదవండి:

వీడియో క్యాప్షన్, కరోనావైరస్ పుట్టిల్లు వూహాన్‌ నగరంలో అంబరాన్నంటుతున్న సంబరాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)