‘పిలిచారని పార్టీకి వెళ్తే మత్తు మందిచ్చి రేప్ చేశారు’

అలెక్స్

ఫొటో సోర్స్, ALEX FEIS-BRYCE

ఫొటో క్యాప్షన్, అలెక్స్
    • రచయిత, ఎలినోర్ లోరీ
    • హోదా, బీబీసీ న్యూస్

అలెక్స్ ఫెయిస్ బ్రైస్ ఒక పురుషుడు.

ఆయన 18 సంవత్సరాల వయసులో ఒక విందుకు వెళ్లారు.

అక్కడ గుర్తు తెలియని ఒక వ్యక్తి ఆయనపై అత్యాచారం చేశాడు.

"నేను గే బార్ లేదా పబ్‌కు వెళ్లడం అది రెండోసారనుకుంటా. పార్టీకి పిలిస్తే నేను, నా ఫ్రెండ్ కలిసి వెళ్దామని అనుకున్నాం. అప్పుడు నేను అమాయకుడిని. అందరితో స్నేహం చేద్దామని కలుపుగోలుగా ఉండేవాడిని. కానీ నా ఫ్రెండ్ చివరి క్షణంలో తను రాలేనని చెప్పడంతో నేను ఒక్కడినే పార్టీకి వెళ్లాను" అని చెప్పారు అలెక్స్.

పార్టీ నుంచి తనను ఒక భవనంలోకి తీసుకెళ్లి మత్తు ఇచ్చి ఉంటారని అలెక్స్ భావిస్తున్నారు.

"ఆ ఇంటి యజమాని నాకు మద్యం ఇచ్చారు. అది తాగి నేను నిద్రపోయాను. అతడు నన్ను బెడ్రూంలోకి తీసుకెళ్లి నాపై అత్యాచారం చేశాడు. నన్ను మంచానికి గుచ్చేస్తున్నట్టు అనిపించింది. నాకు ఆ తర్వాత రోజు మెలకువ వచ్చింది" అని చెప్పారు.

ఆయన కాలేజీ దగ్గర దింపుతానని చెప్పగానే అలెక్స్ సరే అన్నారు. తనకు జరిగిన సంఘటన గురించి మర్చిపోవడానికి ప్రయత్నించారు.

అలెక్స్

ఫొటో సోర్స్, ALEX FEIS-BRYCE

మగాళ్లపై అత్యాచారం చేయరని అనుకున్నా

"నిజానికి అత్యాచారం అనేది పురుషులకు జరిగేది కాదని నేను అనుకున్నా. అందుకే నాపై అత్యాచారం జరగలేదనే భావించా" అన్నారు.

"అప్పుడే నేను మహిళల పట్ల ఏం జరుగుతుందో ఆలోచించడం ప్రారంభించాను. పోలీసులకు ఫిర్యాదు, దర్యాప్తు చేయడం అనేవి చాలా కష్టమైన అంశాలుగా అనిపించాయి. ఎందుకంటే పోలీసులు నేను చెప్పింది నమ్ముతారని నాకు అనిపించలేదు' అని అలెక్స్ తెలిపారు.

అలెక్స్ ఇప్పుడు బ్రిటన్‌లో అత్యాచారం, లైంగిక వేధింపులు, లైంగిక హింస బారిన పడిన పురుషులు, మగ పిల్లలను కాపాడే 'సర్వైవర్స్ యూకే' అనే స్వచ్ఛంద సంస్థకు సీఈవోగా ఉన్నారు.

సాధారణంగా లైంగిక హింసకు ఎక్కువగా గురయ్యేది మహిళలే. కానీ ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రైమ్ సర్వే 2020 మార్చి నాటికి ప్రతి 100 మంది పురుషుల్లో ఒకరు లైంగిక వేధింపుల బారిన పడుతున్నట్లు అంచనా వేశారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 1
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 1

గత ఏడాది 48 మంది పురుషులను మాంచెస్టర్‌లోని క్లబ్‌ల నుంచి తీసుకెళ్లి తన అపార్ట్‌మెంట్‌లో అత్యాచారం చేసిన కేసులో బ్రిటన్ చరిత్రలోనే కరడుగట్టిన రేపిస్టు అయిన రేనార్డ్ సినాగా దోషిగా తేలాడు.

సినాగా, బాధితులకు మత్తు ఇచ్చి దారుణాలకు పాల్పడేవాడు. వాటిని వీడియో తీసేవాడు.

సర్వైవర్స్ యూకే పరిశోధన ప్రకారం, బ్రిటన్‌లో మామూలు పురుషుల జనాభా కంటే, స్వలింగ సంపర్కులు, ద్విలింగ సంపర్కులే ఎక్కువ లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు తెలిసింది.

505 మంది స్వలింగ సంపర్కులపై వారు చేసిన సర్వేలో 47 శాతం మంది తాము లైంగిక వేధింపుల బారిన పడినట్లు చెప్పారు. వారిలో మూడొంతుల మంది తమకు జరిగిన దాని గురించి ఎవరితో చెప్పకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

"ఇక్కడ గుర్తించాల్సిన ముఖ్యమైన అంశమేంటంటే, ఎక్కువ లైంగిక వేధింపులు మనకున్న లైంగిక జీవితాల్లోపలే ఎదురవుతాయి" అని అన్నారు అలెక్స్.

'స్వలింగ సంపర్కులే ఎక్కువగా లైంగిక వేధింపుల బారిన పడతారనే భయాన్ని నాటడం మా ఉద్దేశం కాదు. కానీ, అందుకు అవకాశం కల్పించే గే బార్స్, స్పా సెంటర్లు లాంటి ప్రాంతాల గురించి అవగాహన కల్పించాలని మేం అనుకున్నాం. ఇది సవాలుతో కూడినదే. కానీ మా పరిశోధనకు చాలా అవసరం" అని అలెక్స్ చెప్పారు.

పురుషులపై అత్యాచారం

ఫొటో సోర్స్, Getty Images

బయటికి చెప్పేవారు తక్కువే

గత ఏడాది ఆగస్టులో నిర్వహించిన సర్వేలో ప్రతి ఏడుగురిలో ఒక్కరు మాత్రమే తమపై జరిగిన లైంగిక హింస గురించి పోలీసులకు రిపోర్టు చేసినట్లు తెలిసింది. తమ ఫిర్యాదులను పోలీసులు సీరియస్‌గా తీసుకోలేదని భావిస్తున్నట్లు ఇందులో 25 శాతం మంది చెప్పారు.

"ఇది పరస్పర అంగీకారంతో జరగాల్సిన అంశం. మత్తు ఇచ్చి లేదా బలవంతంగా లైంగిక చర్యలో పాల్గొనడం సరి కాదు. ఒక భాగస్వామి కంటే, ఎక్కువ మందితో సెక్స్‌లో పాల్గొనడం ప్రమాదకరం. అలాంటి అసహజ పరిస్థితుల్లో ఎవరైనా లైంగిక హింసకు గురవుతుంటే, వారు పోలీసులకు తమ సమస్య చెప్పుకోడానికి వెనకాడుతారు" అని అలెక్స్ చెప్పారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 2
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 2

ఎల్‌జీబీటీ ప్లస్ యాంటీ అబ్యూస్ చారిటీ కూడా లైంగిక వేధింపుల బారిన పడేవారికి మద్దతుగా నిలుస్తోంది.

"స్వలింగ సంపర్కులతో పాటు ద్విలింగ సంపర్కులైన పురుషులు తమ భయానక అనుభవాలను పట్టించుకోవడం లేదని భావిస్తున్నారు. వారికి సాయం అందించే సర్వీసులు చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయి" అని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లెనీ మోరిస్ అన్నారు.

"బాధితుల్లో చాలామంది తమ సమస్యలను పోలీసులకు చెప్పడం లేదని మా దర్యాప్తులో తేలింది. ప్రొఫెషనల్స్ మద్దతు లేకపోవడంతో వారి సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి" అని మోరిస్ చెప్పారు.

లీ (పేరు మార్చాం) 15 ఏళ్ల వయస్సులో తన లైంగిక గుర్తింపునకు సంబంధించిన సమస్యల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రిలో చేరారు.

లీ అక్కడ ఏడాదికి పైగా ఒక పురుష కౌన్సిలర్ దగ్గర లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ ఘటనతో ఆయన చాలా ఏళ్ల పాటు మానసిక క్షోభకు గురయ్యారు.

"పదేళ్ల ఆ అనుభవం నాపై చాలా ప్రభావం చూపింది. లైంగిక వేధింపులు, హింస సాధారణమయ్యాయి. దాంతో నా గురించి నేను తగిన జాగ్రత్త తీసుకోలేకపోయాను" అని లీ చెప్పుకొచ్చారు.

"నా మనసులో ఆలోచనలను తరిమి కొట్టాలనుకున్నా. కానీ నేను కోరిన వైద్య సహాయం నా కష్టాలను మరింత పెంచింది. దాన్నుంచి బయటపడ్డానికి డ్రగ్స్, సెక్స్‌కు అలవాటుపడడంతో నేను మరో సమస్య కొనితెచ్చుకున్నా" అని లీ అన్నారు.

వైద్య సహాయం కోరినప్పుడు తనకు అసలు ఏమైంది, లైంగికంగా తనకు ఎలాంటి అసౌకర్యం ఎదురవుతోందో కూడా ఆయనకు అర్థం కాలేదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)