ఫిలిప్పీన్స్‌లో కూలిన మిలటరీ విమానం, 45 మంది మృతి

ఫిలిప్పీన్స్ విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, REUTERS/BOGS MUHAJIRAN

ఫొటో క్యాప్షన్, ఫిలిప్పీన్స్ విమాన ప్రమాదం

ఫిలిప్పీన్స్‌లో సైనిక విమానం ఒకటి నేల కూలింది. విమానంలో 90 కన్నా ఎక్కు మంది ఉన్నారని ఫిలిప్పీన్స్ ఆర్మీ చీఫ్ జనరల్ సిరిలిటో సోబెజనా ప్రకటించారు. ఈ ప్రమాదంలో 45 మంది చనిపోయారు.

"చనిపోయిన వారిలో అధిక శాతం మిలటరీ ఉద్యోగులే. అయితే, విమానం కూలినప్పుడు కింద ఉన్న ముగ్గురు సాధారణ పౌరులు కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు" అని సైనిక అధికారులు తెలిపారు.

బలగాలను తరలిస్తున్న ఆ విమానం ఆదివారం ఉదయం కూలిపోయినట్లు ఫిలిప్పీన్స్ ఆర్మీ చీఫ్ తెలిపారు.

ఫిలిప్పీన్స్ విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, Reuters

విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, Phil news agency

జొలో ద్వీపంలో ల్యాండ్ చేసే ప్రయత్నంలో సి-131 విమానం కూలిపోయినట్లు ఆయన వెల్లడించారు.

కూలిపోయి మంటల్లో చిక్కుకున్న విమానం నుంచి దాదాపు 40 మందిని రక్షించారు.

మృతదేహాలను పదుల సంఖ్యలో మంటల్లోంచి బయటకు లాగారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

విమానంలో ఉన్నవారిలో అత్యధికులు ఇటీవలే మిలటరీ శిక్షణ పూర్తి చేసుకున్నారని ఏఎఫ్‌పీ వార్తాసంస్థ తెలిపింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఉగ్రవాదులతో పోరాడే టాస్క్‌ఫోర్స్‌లో వారిని నియమించారు.

పెద్ద ఎత్తున సహాయ బృందాలు ప్రమాద స్థలికి చేరుకుని, సహాయక చర్యలు ప్రారంభించాయి.

గతంలో యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఈ విమానాన్ని జనవరి నెలలో ఫిలిప్పీన్స్‌కు ఇచ్చారు. రక్షణ సహాయ కార్యక్రమంలో భాగంగా అమెరికా ఇచ్చిన రొండు హెర్క్యులస్ విమానాల్లో ఇదొకటి.

ఈ విమానం మొదటిసారిగా 1988లో ఎగిరిందని ఏవియేషన్ సేఫ్టీ నెట్‌వర్క్ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)