కోవిడ్ నకిలీ వ్యాక్సీన్లు: కరోనా టీకాలకూ తప్పని నకిలీల బెడద.. సోషల్ మీడియాలో అమ్మకం..

ఫొటో సోర్స్, Getty Images
కరోనా వ్యాక్సీన్లకు కూడా నకిలీల బెడద తప్పడం లేదు.
అమెరికా ఫార్మా కంపెనీ ఫైజర్ తయారు చేస్తున్న టీకాలకు నకిలీలు మార్కెట్‌లోకి వచ్చాయి.
ఈ విషయాన్ని ఫైజర్ ధ్రువీకరించింది.
రెండు దేశాల్లో తమ టీకా నకిలీ వెర్షన్‌ను గుర్తించామని ఫైజర్ చెప్పింది. నకిలీ టీకాలను అధికారులు సీజ్ చేశారు. అవి నకిలీవేనని పరీక్షల్లో తేలింది.
"మెక్సికోలో ఫైజర్ టీకాకు తప్పుడు లేబుళ్లు అంటించారు. పోలండ్‌లో బయటపడిన నకిలీ వ్యాక్సీన్‌లో ముడతల నివారణ చికిత్సలో వాడే మెడిసిన్ ఉన్నట్లు నమ్ముతున్నాం" అని ఫైజర్ పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యానికి నకిలీ వ్యాక్సీన్లు పెద్ద సమస్యగా మారాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
నకిలీ టీకాలను గుర్తించి వెంటనే వాటిని వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
నకిలీ వ్యాక్సీన్ల గురించి మనకేం తెలుసు
రెండు దేశాల్లో చేపట్టిన వేర్వేరు దర్యాప్తుల్లో ఈ నకిలీ వ్యాక్సీన్ల బాగోతం బయటపడింది.
మెక్సికోలో సుమారు 80 మందికి ఈ నకిలీ టీకాలు వేశారు. అయితే, వారిలో సైడ్ ఎఫెక్టులు వచ్చినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు అని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
అయితే, ఈ ఫేక్ టీకా తీసుకోవడం వల్ల వారికి కోవిడ్ నుంచి ఎలాంటి రక్షణ లభించదు.

ఫొటో సోర్స్, Reuters
నకిలీ వ్యాక్సీన్ల విషయం ఎలా బయటపడింది?
సోషల్ మీడియాలో ఈ నకిలీ టీకాలను ఒక్కోటి సుమారు లక్షా 80 వేల రూపాయలకు విక్రయించడానికి కొందరు ప్రయత్నించారని, సైబర్ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా ఈ స్కామ్‌ను ఛేదించి, పలువురిని అరెస్ట్ చేశారని మెక్సికో ప్రభుత్వ ప్రతినిధి లోపెజ్ చెప్పారు.
ఒక వ్యక్తి అపార్ట్‌మెంట్‌లో నకిలీ వ్యాక్సీన్లు లభించాయని పోలండ్ అధికారులు చెప్పారు. ఈ ఫేక్ టీకాలు ఎవరికీ వేయలేదని వారు వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సీన్లకు డిమాండ్ పెరగడం.. దానికి తగ్గట్టుగా సప్లయి లేకపోవడంతో నకిలీ టీకాలను తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారని ఫైజర్ గ్లోబల్ సెక్యూరిటీ హెడ్ లెవ్ కుబియక్ చెప్పారు.
టీకాలు చాలా తక్కువగా సప్లయి చేస్తున్నాం. ఇతర కంపెనీలు కూడా వ్యాక్సీన్ తయారీలోకి దిగితే డోసుల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం ప్రజల్లో ఉన్న డిమాండ్‌ను నేరస్థులు సొమ్ము చేసుకుంటున్నారు అని ఆయన వాల్ స్ట్రీట్ జర్నల్‌కు చెప్పారు.
మెక్సికో, పోలండ్‌లో నకిలీ వ్యాక్సీన్లు దొరికిన విషయం తమ దృష్టికి వచ్చిందని అమెరికా న్యాయశాఖ ఏబీసీ న్యూస్‌కు చెప్పింది. ఫైజర్‌కు,స్థానిక అధికారులకు అవసరమైన సాయం అందిస్తామని వివరించింది.
భారతదేశంలో ఫైజర్ కోవిడ్ టీకాలను వేయడం లేదు. కాబట్టి ఇక్కడి వాళ్లు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఇవి కూడా చదవండి:
- విశ్వ రహస్యాలు శోధించే ప్రయోగశాలలో పరిశోధనలు ఏం చెబుతున్నాయి
- కరోనావైరస్: మిగతా దేశాలు వ్యాక్సీన్ తయారు చేసుకోకుండా ధనిక దేశాలు అడ్డుపడుతున్నాయా?
- ఇస్రో గూఢచర్యం కేసు: కేరళ పోలీసుల పాత్రపై దర్యాప్తునకు సుప్రీం ఆదేశం
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- నోబెల్‌కు 5 సార్లు నామినేట్ అయిన ‘భారత అణు కార్యక్రమ పితామహుడు’ మరణానికి కారణమేంటి
- విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్ల మధ్య కూడా ఓ వివాదం
- చైనా, తైవాన్: రెండు దేశాల మధ్య పైనాపిల్ యుద్ధం
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- 173 మందితో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగితే ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.. తరువాత ఏమైందంటే
- తెలంగాణ బడ్జెట్ 2021: రూ.2,30,826 కోట్లతో బడ్జెట్.. వెయ్యి కోట్లతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం
- నరేంద్ర మోదీ: ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










