ఈ స్పోర్ట్స్ బ్రా వేసుకుంటే కరోనా దరిచేరదా.. ‘లోర్నా జేన్’కు రూ. 30 లక్షల జరిమానా ఎందుకు విధించారు?

ఫొటో సోర్స్, lorna jane
తమ కంపెనీ దుస్తులు కోవిడ్-19 వ్యాప్తిని అరికడతాయని ప్రచారం చేసుకుంటున్న యాక్టివ్ వేర్ దుస్తుల బ్రాండ్ 'లోర్నా జేన్'పై కోర్టులో దావా పడింది.
ఎల్‌జే షీల్డ్ అనే ఒక యాంటీ వైరస్ పదార్థం తమ సంస్థ తయారుచేసే దుస్తులపై చల్లడం వల్ల అది కరోనా వ్యాప్తిని అడ్డుకుంటుందని ఆ సంస్థ జులైలో చెప్పింది.
''కోవిడ్-19 వ్యాప్తి నిరోధించాలనుకుంటున్నారా? లోర్నా జేన్ గురించి ఆలోచించండి'' అంటూ ఆ కంపెనీ స్టోర్లు, ఇతర చోట్ల వాణిజ్య ప్రకటనలూ కనిపించాయి.
రెండు రోజుల కిందట ఆస్ట్రేలియాకు చెందిన ఓ సంస్థ ఈ రకంగా లోర్నా జేన్ ప్రచారం చేసుకోవడం తగదని, తప్పుదారి పట్టించేలా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ ఫెడరల్ కోర్టును ఆశ్రయించింది.
'ది ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కంజ్యూమర్ కమిషన్'(ఏసీసీసీ) దీనిపై స్పందిస్తూ ఆస్ట్రేలియాలో కరోనా సెకండ్ వేవ్ వస్తుందన్న భయాలు ఉన్న సమయంలో ఇలాంటి తప్పుడు ప్రచారం ఆందోళనకరమని పేర్కొంది.
కాగా జులైలో లోర్నా జేన్ కంపెనీకి థెరపటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్(టీజేఏ) సుమారు రూ. 30 లక్షల (40 వేల డాలర్ల) జరిమానా విధించింది. ముందస్తు అనుమతి లేకుండా ఇలా తప్పుదారి పట్టించే ప్రకటనలు ఇచ్చినందుకే జరిమానా విధించారు.

ఫొటో సోర్స్, lorna jane
''నమ్మకమైన బ్రాండ్లు తమ వ్యాపార ప్రకటనలో ఏమైనా చెబితే అందుకు గట్టి ఆధారం ఉంటుందని ప్రజలు నమ్ముతారు. అందుకే ఈ తప్పుడు ప్రకటనపై ఆందోళన చెందుతున్నాం'' అని కోర్టు వ్యాఖ్యానించింది.
ఇలా చెబుతున్న ప్రకటనలు జులై చివరి నాటికే తొలగించారని.. కానీ, దుస్తులకు వేసిన ట్యాగులపై ఈ క్లెయిమ్ మాత్రం నవంబరు వరకు కొనసాగిందని ఏసీసీసీ చెప్పింది.
లోర్నా జేన్ కంపెనీకి ఆస్ట్రేలియాలో 108 స్టోర్‌లు ఉన్నాయి. అమెరికా, న్యూజిలాండ్‌లోనూ ఈ సంస్థ స్టోర్‌లు ఉన్నాయి.
చట్టపరమైన చర్యలపై అసంతృప్తి చెందామని, ఈ వ్యవహారంపై దర్యాప్తులో ఏసీసీసీకి అన్ని రకాలుగా సహకరించామని లోర్నా జేన్ సంస్థ బీబీసీకి చెప్పింది.
''ఏసీసీసీ మాపై చేస్తున్న ఆరోపణలకు ఫెడరల్ కోర్టులో మేం డిఫెన్స్ చేసుకుంటాం'' అని ఆ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు.
ఎల్‌జే షీల్డ్ వల్ల కరోనావైరస్ రాకుండా ఆపగలమని చెప్పడం తాము లేదని.. అది హ్యాండ్ శానిటైజర్ మాదిరిగా అదనపు రక్షణ కల్పిస్తుందని మాత్రమే చెబుతున్నాని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఇక్కడ తయారయ్యే మందులు వాడి ప్రజలు బతుకుతున్నారు.. మేం మాత్రం చస్తున్నాం’
- ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ యంత్రాంగం పని చేయడం లేదనే వివాదంలో హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు
- ఏపీ రాజధాని చుట్టూ ఏడాదిగా ఏం జరిగింది? అమరావతి భవితవ్యం ఏంటి?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: మెరుగైన మహిళా సాధికారత... కలవరపెడుతున్న పోషకాహార లోపం -జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే
- భారత్: ఒకపక్క ఊబకాయం.. మరోపక్క పోషకాహార లోపం.. ఎందుకిలా?
- భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ రెండు, మూడు దశలకు డీసీజీఐ అనుమతి
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








