వర్జిన్ ఆర్బిట్: విమానం లాంచ్ పాడ్‌గా రాకెట్ ప్రయోగం

వీడియో క్యాప్షన్, వర్జిన్ ఆర్బిట్: విమానం లాంచ్ పాడ్‌గా రాకెట్ ప్రయోగం

ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లి రావడం, చంద్రున్ని చుట్టేయడం మనకు చాలా సులభంగా మారిపోయాయి. కొన్ని సంవత్సరాల కృషి ఫలితమే ఇదంతా.

శాటిలైట్లు కావొచ్చు... స్పేస్ షిప్స్ కావొచ్చు... వేటినైనా రాకెట్ల సాయంతోనే నింగిలోకి పంపగలం. కానీ ఈ రాకెట్లకు ఇంధనం భారీగా కావాలి. ఒక లాంచ్ ప్యాడ్ కూడా కావాలి.

మరి లాంచ్ ప్యాడ్ లేకుండా రాకెట్లను ప్రయోగించగలమా?

గత కొద్ది సంవత్సరాల్లో అంతరిక్షయానంలో ప్రపంచం ఎంతో పురోగతిని సాధించింది. ఇటీవలే తొలిసారి ఒక ప్రైవేట్ కంపెనీ స్పేస్‌ఎక్స్, వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లడాన్ని మనం చూశాం.

ఇప్పుడు బోయింగ్ విమానాన్ని లాంచ్ పాడ్‌గా ఉపయోగించుకుని రాకెట్లు ప్రయోగించటం చూడబోతున్నాం.

‘‘మా రాకెట్‌ను చూసినట్లయితే 70 అడగుల పొడవుంటుంది. బరువు సుమారు 28 టన్నులు. బోయింగ్ -747 విమానానికి అడుగున ఈ రాకెట్‌ను అమరుస్తాం. విమానం 30 నుంచి 35 వేల అడుగుల ఎత్తుకు వెళ్లిన తరువాత, సరైన దిశలో రాకెట్‌ను పైలెట్లు వదిలేస్తారు’’ అని వర్జిన్ ఆర్బిట్ సీఈఓ డ్యాన్ హర్ట్ వివరించారు.

రాకెట్‌ను జారవిడిచిన వెంటనే అందులోని ఇంజిన్లు ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవుతాయి. రాకెట్ సురక్షితంగా విమానానికి దూరంగా వెళ్లిపోతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)