ఎలాన్ మస్క్ సంస్థ ప్రయోగం.. పంది మెదడులో కంప్యూటర్ చిప్ - BBC Newsreel

ఫొటో సోర్స్, Neuralink
ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్టప్ న్యూరాలింక్ ఒక పంది మెదడులో నాణెం పరిమాణంలో ఉన్న కంప్యూటర్ చిప్‌ను అమర్చింది.
జెర్‌ట్రూడ్ అనే ఆ పంది మెదడులో చిప్ అమర్చినట్లు ఎలాన్ మస్క్ వెల్లడించారు.
మిషన్ ఇంటర్‌ఫేస్‌తో మెదడును రూపొందించాలన్నది తమ ఆలోచన అని మస్క్ చెప్పారు.
ఇలాంటి ఇంటర్‌ఫేస్ సహాయంతో మెదడు నేరుగా ఫోన్లను, కంప్యూటర్లను నియంత్రించే వీలు కలుగుతుంది.
అంతేకాదు.. డిమెన్షియా, పార్కిన్షన్ వంటి వ్యాధులను నయం చేయడానికీ ఇలాంటి చిప్‌లు తోడ్పడతాయని ఎలాన్ మస్క్ అంటున్నారు.
పంది మెదడులో అమర్చిన చిప్ నాడీ చర్యలను సూచిస్తూ వైర్ లెస్ సంకేతాలను పంపిస్తుంది.
మరికొన్నాళ్ల పాటు ఈ ప్రయోగాలను చేయనున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'బ్లాక్ పాంథర్' హీరో చాద్విక్ బోస్‌మన్.. క్యాన్సర్‌తో మృతి
బ్లాక్ పాంథర్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన హాలీవుడ్ నటుడు చాద్విక్ బోస్‌మన్ క్యాన్సర్ కారణంగా చనిపోయినట్లు ఆయన కుటుంబం చెప్పింది.
ఆయన వయసు 43 సంవత్సరాలు. లాస్ ఏంజెలెస్ నగరంలోని తన ఇంట్లోనే చనిపోయారు. ఆ సమయంలో భార్య, కుటుంబ సభ్యులు ఆయన వద్దే ఉన్నారు.
బోస్‌మన్‌కు స్టేజ్-3 కొలన్ క్యాన్సర్ ఉన్నట్లు 2016లో గుర్తించినట్లు ఆయన కుటుంబం తెలిపింది. నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతూనే పలు సినిమాల్లో పాత్రలకు జీవం పోశారని పేర్కొంది.
బేస్‌బాల్ దిగ్గజం జాకీ రాబిన్సన్, ప్రముఖ సంగీతకారుడు జేమ్స్ బ్రౌన్ జీవిత కథలతో రూపొందించిన చిత్రాల్లో వారి పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నారు బోస్‌మన్.
అయితే.. 2018లో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిన 'బ్లాక్ పాంథర్'లో కింగ్ టిచల్లా పాత్రలో ఆయన గుర్తిండిపోతారు. ఆస్కార్ అవార్డుల బరిలో ఉత్తమ చిత్రం కేటగిరీలో నామినేట్ అయిన తొలి సూపర్ హీరో సినిమా బ్లాక్ పాంథర్ కావటం విశేషం.
ఇవి కూడా చదవండి:
- ట్రంపా, బైడెనా? అమెరికాకు అధ్యక్షుడు ఎవరైతే చైనాకు మేలు?
- ఇందర్జీత్ కౌర్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కు తొలి మహిళా అధ్యక్షురాలు
- గిడుగు వెంకట రామమూర్తి తెలుగు భాషకు చేసిన కృషి ఏంటి?
- భవిష్యత్తులో ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయి?
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- పార్టీ సమావేశంలో ప్రత్యక్షమైన కిమ్ జోంగ్ ఉన్... ఇంతకీ ఆయనకేమైంది?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- చైనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








