కరోనావైరస్: ఈ పది దేశాల్లో ఒక్క కోవిడ్-19 కేసు కూడా నమోదుకాలేదు

ద పలావు హోటల్

ఫొటో సోర్స్, Palau Hotel

ఫొటో క్యాప్షన్, ద పలావు హోటల్

కోవిడ్-19 ప్రభావం ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలపై పడింది. అయితే, పది దేశాల్లో మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అసలు ఆ దేశాల్లో ఏం జరుగుతోంది?

1982లో పలావు దేశంలో ఒక్కటే హోటల్‌కు పలావ్ అని పేరుండేది. అందుకే దీన్ని ద పలావు హోటల్ అని పిలుస్తుంటారు.

పసిఫిక్ సముద్రంలోని ఈ చిన్న దేశం ఆకర్షణీయమైన పర్యటక ప్రదేశం.

2019లో ఇక్కడకు 90,000 మంది పర్యటకులు వచ్చారు. ఇది ఇక్కడి జనాభా కంటే ఐదు రెట్లు ఎక్కువ. 2017లో దేశ జీడీపీలో పర్యటకం వాటా 40 శాతం వరకూ ఉన్నట్లు ఐఎంఎఫ్ గణాంకాలు చెబుతున్నాయి.

ఇదంతా కోవిడ్-19కు ముందుమాట.

మార్చిలో పలావు సరిహద్దులను మూసివేశారు. కరోనావైరస్ కేసులు నమోదుకాని పది దేశాల్లో ఇది కూడా ఒకటి.

ఒక్కరికి కూడా వైరస్ సోకకుండా.. కోవిడ్-19 ఈ దేశాన్ని కుదేలుచేసింది.

గత మార్చి నుంచి ద పలావు హోటల్‌తోపాట మిగతా హోటళ్లు కూడా మూతపడ్డాయి. రెస్టారెంట్లు ఖాళీ అయ్యాయి. క్వారంటైన్‌లో ఉండేవారు మాత్రమే హోటల్‌కు వస్తున్నారు.

పసిఫిక్ దేశాలు

ఆ పది దేశాలు ఇవే

  • పలావు
  • మైక్రోనేసియా
  • మార్షల్ ఐలండ్స్
  • నౌరు
  • కిరిబాటి
  • సొలొమన్ దీవులు
  • తువాలు
  • సమోవా
  • వనువాతు
  • టొంగా

ఇక్కడ సముద్రం మిగతా ప్రాంతాల కంటే చాలా అందంగా కనిపిస్తుంది అని ద పలావు హోటల్ మేనేజర్, కో-ఓనర్ బ్రయన్ లీ చెప్పారు.

కోవిడ్-19కు ముందు హోటల్‌లోని 54 గదులు ఎప్పుడూ 70 నుంచి 80 శాతం వరకూ నిండుగా ఉండేవి. కానీ సరిహద్దులు మూసేసిన తర్వాత అన్ని గదులూ ఖాళీ అయ్యాయి.

సెప్టెంబరు 1 నుంచి అత్యవసర విమాన సేవలు ప్రారంభిస్తామని దేశ అధ్యక్షుడు ఇటీవల ప్రకటించారు. అయితే పర్యటకుల కోసం తైవాన్‌తో ఎయిర్ కారిడార్‌ను తెరుస్తారని వదంతులు వినిపిస్తున్నాయి.

ఇక్కడి నుంచి తూర్పు దిశలో 2,500 మైళ్ల దూరంలో మార్షల్ ఐలండ్స్ దీవులున్నాయి. ఇక్కడ కూడా ఎలాంటి కేసులు నమోదు కాలేదు. అయితే కోవిడ్-19 ప్రభావం మాత్రం ఉంది.

వైరస్ వ్యాప్తికి ముందు 37 రూమ్‌లు ఉండే ద హోటల్ రాబెర్ట్‌ 75 నుంచి 88 శాతం వరకూ నిండేది. ఎక్కువ మంది పర్యటకులు ఆసియా దేశాలు, అమెరికా నుంచి వచ్చేవారు.

కానీ మార్చిలో సరిహద్దులు మూసివేసిన తర్వాత ఇక్కడి హోటళ్లు మూడు నుంచి 5 శాతం వరకు మాత్రమే నిండుతున్నాయి.

కోవిడ్-19 ప్రభావంతో 700 ఉద్యోగాలు కోల్పోయినట్లు అంచనాలు చెబుతుననాయి. 1997 ఆర్థిక మాంద్యం కంటే ఇది ఎక్కువ.

వనవాతు

ఫొటో సోర్స్, Mario Tama/Getty Images

‘‘సరిహద్దులు తెరవొద్దు‘‘

కోవిడ్-19తో దేశాలు పేదరికంలోకి జారుకుంటున్నప్పటికీ.. కొందరు సరిహద్దులను తెరవొద్దని సూచిస్తున్నారు.

మూడు లక్షల జనాభా ఉండే వనువాతులో డాక్టర్ లెన్ టరివొండ ప్రజారోగ్య డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

''ఇక్కడ చాలా మంది సరిహద్దులను వీలైనన్ని రోజులు మూసి ఉంచాలని కోరుతున్నారు. కోవిడ్-19 సోకాలని ఇక్కడ ఎవరూ కోరుకోవట్లేదు''.

''వనవాతులోని 80 శాతం జనాభా పట్టణాలకు వెలుపల జీవిస్తున్నారు. వారు అసంఘటిత ఆర్థిక వ్యవస్థలో భాగం''.

''ఇక్కడ రైతులు ఎక్కువ. వారి ఆహారం వారే పండించుకుంటారు. స్థానిక వనరులపై ఎక్కువగా వారు ఆధారపడతారు''

అయితే లాక్‌డౌన్‌తో దాదాపు 10 శాతం వరకు జీడీపీ వనవాతు నష్టపోతోందని ద ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అంచనావేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)