సిరియా: ఈ పట్టణంలో మనుషుల కంటే పిల్లుల సంఖ్యే ఎక్కువ

సిరియాలోని కఫ్రన్‌బెల్ పట్టణంలో మనుషుల కంటే పిల్లులే ఎక్కువగా ఉన్నాయి.
ఒకప్పుడు ఈ నగరంలో 40 వేల మంది వరకు ఉండేవారు. కానీ ఇప్పుడక్కడ వంద మంది కంటే తక్కువే ఉన్నారు.
కానీ ప్రతి ఇంట్లో కనీసం 15 పిల్లులు మాత్రం కనిపిస్తాయి. రోడ్ల మీద ఎక్కడ చూసినా పిల్లులే ఉంటాయి.
కఫ్రన్‌బెల్ ఒకప్పుడు సిరియా తిరుగుబాటుదారులకు గట్టి పట్టుకున్న ప్రాంతం. కానీ సిరియా, రష్యా దళాల సుదీర్ఘ బాంబు దాడుల తర్వాత ఈ నగరం ధ్వంసమైంది. ఇక్కడున్న వాళ్లు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
వలస వెళ్లగా మిగిలిన వాళ్లు- పిల్లులు కలిసి ఇప్పుడిక్కడ ఉంటున్నాయని బీబీసీ ప్రతినిధి మైక్ థామస్ చెప్తున్నారు.
పైన ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు సలా జార్. కఫ్రన్‌బెల్‌లో శిథిలమైన తన ఇంటి బేస్‌మెంట్‌లో ఒక మూలన కూర్చొని పైనుంచి పడే బాంబులు నుంచి తనను తాను కాపాడుకుంటున్నారు. కానీ ఈ బేస్‌మెంట్‌లో ఉన్నది ఇతనొక్కరే కాదు. ఇతనితో పాటు మరో 12 పిల్లులు కూడా ఉన్నాయి. ఎప్పుడు ఎటువైపు నుంచి బాంబులు దూసుకొస్తాయోనన్న భయం ఇతనితో పాటు ఆ పిల్లుల్లో కూడా కనిపిస్తోంది.
"పిల్లులు దగ్గరగా ఉన్నప్పుడు కాస్త ఓదార్పుగా ఉంటుందని, బాంబు పేలుళ్లు, విధ్వంసం, బాధ, ఆందోళనను కాస్త తగ్గిస్తుందని" ఇతను నాతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సలా జార్ సొంతూరు కఫ్రన్‌బెల్‌లో ఒకప్పుడు 40వేల మంది వరకు ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు వంద మంది కంటే తక్కువే ఉన్నారు. ఇక్కడ ఎన్ని పిల్లులు ఉన్నాయో లెక్కించడం కష్టం. కానీ వందలు, వేలల్లో ఉండే అవకాశం ఉంది.
"కఫ్రన్‌బెల్ నుంచి ప్రజలు వెళ్లిపోయిన తర్వాత ఇక్కడ జనాభా చాలా తగ్గిపోయింది. కానీ పిల్లులకు ఆహారం, నీళ్లు పెట్టడానికి ఎవరో ఒకరు ఉండాలి. అందుకే ఇక్కడున్న వారి ఇళ్లలోనే అవి ఆశ్రయం పొందుతున్నాయి. ప్రతి ఇంట్లో కనీసం 15 పిల్లులు ఉంటాయి. ఒక్కోసారి అంతకంటే ఎక్కువే ఉంటాయని" సలా జార్ చెప్పారు.
ఫ్రెష్ ఎఫ్‌ఎం అనే స్థానిక రేడియో స్టేషన్‌లో సలా రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. తాజా బాంబు దాడుల్లో ఈ రేడియో స్టేషన్ స్టూడియో పూర్తిగా ధ్వంసమైంది. కానీ దాడి జరగడానికి కొన్ని రోజుల ముందే ఈ రేడియో స్టేషన్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
బాంబు దాడుల సమాచారం, కామెడీ, ఫోన్-ఇన్ కార్యక్రమాలను ఈ రేడియో స్టేషన్ ప్రసారం చేస్తుంది. ప్రజలతో పాటు పిల్లులకు కూడా ఇదెంతో ప్రజాదరణ పొందింది. కొన్ని డజన్ల పిల్లులు ఇక్కడున్నాయి. పిల్లుల కోసం పాలు, చీజ్ కొనేందుకు ఈ రేడియో స్టేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ ఉద్యమకారుడు రీయిడ్ ఫారెస్ ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించారు. ఇస్లామిక్ సాయుధుల దాడిలో ఆయన మరణించారు.
"ఈ భవనంలో ఎన్నో పిల్లులు జన్మించాయి. తెల్లని, గోధుమ రంగు మచ్చలున్న పిల్లి వాటిలో ఒకటి. అది రీయిడ్ ఫారెస్‌తో చాలా చనువుగా ఉండేది. ఆయన ఎక్కడికి వెళ్తే అది అక్కడికి వెళ్లేది. చివరికి ఆయన పక్కనే పడుకునేది కూడా" అని సలా జార్ చెప్పారు.
"తన శిథిలమైన ఇంటి నుంచి ఆయన బయటకు వెళ్లినప్పుడు అన్నివైపుల నుంచి పిల్లుల అరుపులు వినిపిస్తాయి. వాటిలో కొన్ని శ్రావ్యంగా.. మరికొన్ని గట్టిగా అరుస్తూ నిరాశగా ఉండేవి. ఇలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరికీ ఎదురవుతుంది" అని ఆయన అన్నారు.

ఒక్కోసారి మేము వీధుల్లో నడుస్తుంటే సుమారు 20, 30 పిల్లులు కూడా మాతో పాటు వీధి చివరి వరకూ నడుస్తూ వస్తాయి. కొన్ని అయితే, మాతో పాటు ఇంటికి కూడా వస్తాయి అని సలా తెలిపారు.
చీకటి పడిన తర్వాత పిల్లుల అరుపులకు వీధి కుక్కల అరుపులు కూడా తోడవుతాయి. అవి కూడా ఆకలితో అలమటిస్తూ ఉంటాయి. వాటికి కూడా ఎలాంటి ఆశ్రయం లేదు. రాత్రి ఆహారం కోసం, పడుకునే చోటు కోసం అవి పిల్లులతో పోటీ పడతాయి. ప్రతిరోజు జరిగే ఈ పోరాటంలో చివరికి బలవంతులే గెలుస్తారు అని సలా చెప్పారు.
మిగతా చోట్ల కుక్కలు బలవంతమైనవి కావొచ్చు. కానీ ఇక్కడ మాత్రం కచ్చితంగా పిల్లులదే ఆధిపత్యం అని సలా అన్నారు. ఎందుకంటే ఇక్కడ వీటి సంఖ్యే ఎక్కువ అని సలా అన్నారు.
వీటిలో చాలావరకు పెంపుడు పిల్లులే. ఇక్కడున్న వాళ్లు వీటిని పెంచుకునేవారు. కానీ ఇడ్లిబ్‌ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పాలక అనుకూల దళాలు గత ఏప్రిల్‌లో దాడులు మొదలుపెట్టడంతో వారంతా పట్టణాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడివి ఆహారం, ఆశ్రయం కోసం పట్టణ శిథిల్లాల్లో అన్వేషించాల్సి వస్తోంది.
సలా లాంటి వారు ఇంకా ఎంత కాలం ఇక్కడ ప్రాణాలతో ఉంటారో తెలియదు. వీటికి ఎవరు ఆహారం పెడతారో తెలియదు. కానీ ఎవరు ఉన్నా లేకున్నా.. తన బేస్‌మెంట్‌లోని టేబుల్ కింద పిల్లులకు ఆశ్రయం ఎల్లప్పుడూ ఉంటుందని సలా అంటున్నారు.
"కూరగాయలు కావొచ్చు. నూడుల్స్ కావొచ్చు లేదా ఎండిపోయిన బ్రెడ్ కావొచ్చు. నేనెప్పుడు ఏది తింటే ఇవి కూడా అదే తింటాయి. ఇలాంటి పరిస్థితిలో అవి, నేను చాలా బలహీనమైన జీవులమని నాకు అనిపిస్తోంది" అంటారు సలా

నిరంతరం బాంబుల వర్షం కురుస్తుంటే మిగతావాళ్లతో పాటు పిల్లులు గాయపడటంలో ఆశ్చర్యం లేదు. కానీ ఈ విషయంలోనూ మిగతా మనుషుల్లాగే మెడిసిన్ కొరత వీటిని తీవ్రంగా వేధిస్తోంది. వీటిని కాపాడేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తున్నామని సలా చెప్తున్నారు.
నా స్నేహితుడి ఇంట్లో పిల్లులు ఉండేవి. ఒకసారి రాకెట్ తగిలి ఒక పిల్లి కాలు దాదాపు విరిగిపోయింది. కానీ అతను దాన్ని ఇడ్లిబ్ నగరానికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఇప్పుడది మిగతావాటిలాగే చక్కగా నడుస్తోందన్నారు..సలా.
ప్రస్తుతం అధ్యక్షుడు బసర్ అల్ అసద్ దళాలు ఈ పట్టణానికి దూరంగా ఉన్నాయి. దాంతో తిరుగుబాటుదారులు ఎప్పుడైనా దీన్ని చేజిక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనతో పాటు పిల్లులు ఇక్కడ ఉండటం ఆందోళనకరమేనని సలా అంగీకరించారు.

ఫొటో సోర్స్, Getty Images
మేము ఎన్నో మంచి అనుభవాలను వాటితో నేను పంచుకున్నాము. ఆనందం, బాధ, భయం ఇలా ప్రతి ఒక్కటి పిల్లులతో షేర్ చేసుకుంటాము అని చెప్పారు.
ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగి, ఈ పట్టణం వదిలి వెళ్లాల్సి వస్తే తమతో పాటు సాధ్యమైనన్ని ఎక్కువ పిల్లులను తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తామని ఇక్కడి వాళ్లు చెప్తున్నారు.
యుద్ధ భయాలు, ఆందోళనలు ఉన్నా.. ఇక్కడి మనుషులు-పిల్లుల మధ్య మంచి బంధం ఏర్పడింది. అది అంత సులువుగా తెగిపోయేది కాదు.
ఇవి కూడా చదవండి:
- CAA నిరసనలు: "పశువులకు గడ్డికోసం వెళ్లిన మా అబ్బాయిని పోలీసులు చంపేశారు" - గ్రౌండ్ రిపోర్ట్
- పౌరసత్వ చట్టం: ‘వాస్తవాలకు అతీతంగా వ్యతిరేకతలు.. ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్న మేధావులు’ - అభిప్రాయం
- నర మానవుల్లేని ‘దెయ్యాల’ టౌన్: ఈ పట్టణంలోకి అడుగుపెట్టొద్దు - అధికారుల హెచ్చరిక
- సొంత ఇంటర్నెట్ను సృష్టించుకుంటున్న రష్యా.. దేశీయ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది?
- జపాన్‌లో డబ్బులిచ్చి ఉద్యోగాలు మానేస్తున్నారు.. ఎందుకు
- బిల్లా, రంగా ఎవరు.. వాళ్లను ఉరి తీయాలని దేశమంతా ఎందుకు కోరుకుంది...
- సెక్స్ వర్కర్లకు విముక్తి: బలవంతంగా ‘చాకిరీ’ చేయించే విధానం రద్దు
- ఫేస్‌బుక్‌కు ఒక కోడ్ పంపించారు.. భారీ మొత్తంలో నగదు బహుమతి కొట్టేశారు..
- మహిళల్లో 'సున్తీ': పలు దేశాల్లో నిషేధించినా భారత్‌లో ఎందుకు కొనసాగుతోంది
- ఐయూడీ: ఈ పరికరంతో గర్భం రాదు... ఎక్కువ మంది మహిళలు వాడట్లేదు
- ప్రియాంకా గాంధీ: 'ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు నా గొంతు పట్టుకున్నారు.. నాతో గొడవపడ్డారు'
- మీతో అధికంగా ఖర్చు చేయించే బిజినెస్ ట్రిక్... దాదాపు అందరూ ఈ 'వల'లో పడే ఉంటారు
- CAA-NRC: ‘మేము 'బై చాన్స్' ఇండియన్స్ కాదు, 'బై చాయిస్’ ఇండియన్స్’ - మౌలానా మహమూద్ మదనీ
- సెక్స్ విప్లవానికి తెర లేచిందా...
- ఆ 19 లక్షల మందిని దేశం నుంచి ఎలా తరలిస్తారు.. రైళ్లలోనా, విమానాల్లోనా?: చిదంబరం - #బీబీసీ ఇంటర్వ్యూ
- శాండా బల్లి: మనుషుల 'మగతనం' కోసం ప్రాణాలు అర్పిస్తున్న ఎడారి జీవి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








