బ్రెగ్జిట్: ఇక ఏం జరగబోతోంది?

ఫొటో సోర్స్, REUTERS
- రచయిత, పీటర్ బార్న్స్
- హోదా, సీనియర్ ఎలక్షన్స్, పొలిటికల్ అనలిస్ట్ - బీబీసీ న్యూస్
బ్రిటన్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. మరి, ఈ ఫలితం బ్రెగ్జిట్‌పై ఎలాంటి ప్రభావం చూపబోతోంది?
యూరోపియన్ యూనియన్(ఈయూ)తో బ్రిటన్ ఒప్పందానికి ప్రధాని బోరిస్ జాన్సన్ అంగీకరించిన మేరకు ఆ దేశం ఈయూ నుంచి 2020 జనవరి 31న వైదొలగాల్సి ఉంది.
అయితే, ఈ ఒప్పందానికి పార్లమెంటు ఆమోద ముద్ర ఇంకా పడలేదు.

ప్రతినిధుల సభలో కన్జర్వేటివ్‌లకు భారీ ఆధిక్యం ఉండడంతో బోరిస్ జాన్సన్ ఒప్పందానికి ఇక్కడ ఆమోదం దొరకడం సమస్యేమీ కాకపోవచ్చు.
బ్రెగ్జిట్‌లో భాగంగా అనుసరించాల్సిన ప్రక్రియకు సంబంధించిన 'విత్‌డ్రాయల్ అగ్రిమెంట్ బిల్'ను ప్రభుత్వం మరోసారి ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టనుంది.
బ్రెగ్జిట్ గడువైన 2020 జనవరి 31 నాటికి బిల్లుకు ఆమోద ముద్ర వేయించుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
బ్రెగ్జిట్ తరువాత ఏమవుతుంది?
జనవరి 31న బ్రిటన్ ఈయూ నుంచి వైదొలగితే అది సంక్లిష్టమైన బ్రెగ్జిట్ ప్రక్రియలో మొదటి మెట్టవుతుంది.
ఆ తరువాత ఈయూతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడమే ప్రథమ ప్రాధాన్యమవుతుంది. బ్రిటన్ తన వస్తుసేవలకు ఈయూ దేశాలంతటా అవకాశం ఉండాలని కోరుకుంటుంది.
అయితే, కస్టమ్స్ యూనియన్, యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ పరిధి నుంచి బ్రిటన్ వైదొలగి తీరాలని కన్జర్వేటివ్ నాయకులు అంటున్నారు.
ఈయూలోని మిగతా 27 సభ్య దేశాలు, యూరోపియన్ పార్లమెంట్ ఈ ఒప్పందంలో ఉంటాయి.. చర్చలకు సమయం పడుతుంది. 2020 మార్చిలో చర్చలు మొదలయ్యే అవకాశాలుంటాయి.
చర్చల తరువాత జూన్ చివరి నాటికి తుది ఒప్పందం రూపొందించాల్సి ఉంటుంది. అప్పుడు ట్రాన్సిషన్ పీరియడ్‌ను మరో ఒకటిరెండేళ్లు పెంచుకోవాలో వద్దో బ్రిటన్ నిర్ణయించుకోవచ్చు.
కానీ, ప్రధాని బోరిస్ జాన్సన్ మాత్రం ఎలాంటి పొడిగింపు ఉండబోదంటున్నారు.
ఒకవేళ జూన్ చివరి నాటికి ఎలాంటి వాణిజ్య ఒప్పందం కుదరకపోతే 2020 డిసెంబరు చివరి నాటికి ఒప్పందమేమీ లేకుండా బ్రిటన్ ఈయూ నుంచి బయటకొస్తుంది.
ఒకవేళ వాణిజ్య ఒప్పందం కుదిరితే దాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఆమోద ముద్ర పడాలి. ఇందుకు కూడా కొన్ని నెలల సమయం పడుతుంది.
బ్రిటన్ ఈయూ నిబంధనలను అనుసరిస్తున్నందున చర్చలు ముక్కుసూటిగానే సాగుతాయని బోరిస్ జాన్సన్ చెబుతున్నారు.
అయితే బ్రిటన్ ఈయూ నిబంధనలతో విభేధించే స్వేచ్ఛను కోరుకుంటున్నందున చర్చలు అనుకున్నంత సాఫీగా సాగకపోవచ్చని విమర్శకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ట్రంప్ అభిశంసన అభియోగాలకు కీలక కమిటీ ఆమోదం.. ‘దేశానికి విచారకరం.. నాకు మాత్రం చాలా ప్రయోజనకరం’
- భారత్‌లో అత్యాచారాలను రాజకీయ అంశంగా మార్చిన రాహుల్, మోదీ
- స్పీడ్ రీడింగ్ కోర్సు: 5 నిమిషాల్లో లక్ష పదాలు చదవడం సాధ్యమేనా?
- కమలం జాతీయ పుష్పమా? పాస్‌పోర్టులపై కమలం ఎందుకు ముద్రిస్తున్నారు?
- ఓ గుహలో దొరికిన 44 వేల ఏళ్ళ నాటి అతి పురాతన పెయింటింగ్ ఏం చెబుతోంది...
- భూప్రళయం: డైనోసార్లు అంతమైన ప్రాంతం ఇదే
- తెలంగాణ: బొంగులో కల్లు.. ఆరోగ్యానికి మంచిదా? కాదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








