రొమేనియా తీరంలో 14 వేల గొర్రెలతో ప్రయాణిస్తున్న భారీ నౌక మునక

ఫొటో సోర్స్, ISU Constanta
రొమేనియా తీరం నుంచి 14 వేలకు పైగా గొర్రెలను తీసుకువెళ్తున్న భారీ సరకు రవాణా నౌక సముద్ర జలాల్లో తిరగబడింది. మునిగిపోతున్న నౌక నుంచి గొర్రెలను కాపాడేందుకు రక్షణ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.
ఆ నౌక పేరు క్వీన్ హింద్. అది నల్ల సముద్రం తీరంలోని కాన్‌స్టాంటా నగరానికి ాగ్నేయంగా ఉన్న మిడియా ఓడరేవు నుంచి బయలు దేరింది. అందులో 22 మంది సిరియా జాతీయులైన సిబ్బంది ఉన్నారు.
భారీ సంఖ్యలో నౌకలో ఉన్న గొర్రెలను కాపాడేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రొమేనియా తీర ప్రాంత రక్షణ దళాలు రంగంలోకి దిగాయి.
పలావు జెండా కలిగిన నౌక సమీపంలో ఈదుతూ కనిపించిన దాదాపు 32 గొర్రెలను సురక్షితంగా తీరానికి చేర్చారు. కానీ, చాలా గొర్రెలు నీట మునిగిపోయాయని భావిస్తున్నారు.
"సముద్రంలో ఈదుతూ కనిపించిన కొన్ని గొర్రెలను కాపాడాం" అని కాన్‌స్టాంటా అత్యవసర సేవల విభాగం అధికార ప్రతినిధి స్టోయికా అనామారియా చెప్పారు.
ఆదివారం రాత్రి నిలిపివేసిన రక్షణ చర్యలు సోమవారం ఉదయం మళ్ళీ మొదలవుతాయి.

ఫొటో సోర్స్, isu constanta
నౌకలోని సిబ్బందిలో హైపోథెర్మియాతో బాధపడుతున్న ఒక వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.
"ఆయన సముద్రంలో పడిపోయారు. కానీ, వెంటనే రక్షించాం" అని చెప్పిన అనామారియా మిగతా సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు.
అయితే, నౌక మునిగిపోవడానికి కారణం ఏమిటన్నది ఇంకా తెలియలేదు. నౌకలోని గొర్రెలను సురక్షితంగా బయటకు తెచ్చే కార్యక్రమం ముగిసిన తరువాత నౌక మునకపై విచారణ ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు.

ఫొటో సోర్స్, isu constanta

ఫొటో సోర్స్, isu constanta
ఈ నౌక మిడియా నుంచి స్థానిక కాలమానం ప్రకారం మధ్నాహ్నం 12 గంటలకు సౌదీ అరేబియాలోని జెడ్డా నగరానికి బయలుదేరింది.
1980లో నిర్మించిన ఈ నౌక పొడవు 85 మీటర్లు. మెరీన్ ట్రాఫిక్ వెబ్ సైట్ వివరాల ప్రకారం దీని సామర్థ్యం 3,785 టన్నులు.
జంతువులను భారీ సంఖ్యలో తీసుకువెళ్ళే నౌక మునిగిపోయిన ఘటన 2017లో కూడా ఒకసారి జరిగింది. టర్కీ తీరంలో నల్ల సముద్రంలో మునిగిపోయిన ఆ టోగో నౌక రష్యా నౌకాదళానికి చెందిన నిఘా నౌకను డీకొని మునిగింది.
ఇవి కూడా చదవండి:
- హిందూ, ముస్లిం, క్రైస్తవుల తీర్థయాత్రలకు ప్రభుత్వం ఎలా ఆర్థిక సహాయం అందిస్తోంది...
- మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ సంసిద్ధతపై 5 ప్రశ్నలు
- రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి తమిళ రాజకీయాల్లో మార్పు తీసుకురాగలరా
- పాకిస్తాన్ సోషల్ మీడియాలో మహిళల ఆందోళన... స్త్రీవాద సదస్సుపై ఆగ్రహం
- 'స్మోకింగ్ నుంచి ఈ-సిగరెట్లకు మారితే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది '
- మా అమ్మకు వరుడు కావలెను
- టీఎన్ శేషన్ (1932-2019): ఎవరికీ భయపడని భారత ఎన్నికల కమిషనర్
- రేప్, డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు ఈమెకు యోగా ఎలా ఉపయోగపడింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









