రెడ్ కార్పెట్ మీద చిలీ గాయని అర్ధనగ్న నిరసన.. ‘హింసిస్తున్నారు, రేప్ చేస్తున్నారు, చంపేస్తున్నారు'

ఫొటో సోర్స్, Getty Images
చిలీకి చెందిన గాయని మోన్ లాఫెర్ట్.. అమెరికాలో జరుగుతున్న లాటిన్ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం దగ్గర.. రెడ్ కార్పెట్ మీద అర్ధనగ్నంగా నిరసన తెలిపారు.
ఆమె తన నగ్న ఛాతీ మీద ''చిలీలో వాళ్లు హింసిస్తున్నారు, రేప్ చేస్తున్నారు, చంపేస్తున్నారు'' అని రాసి ప్రదర్శించారు.
చిలీలో నెల రోజుల పాటు తీవ్ర నిరసనలు చెలరేగాయి. మెట్రో రైలు చార్జీల పెంపుతో మొదలైన ఈ నిరసనలు.. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలుగా మారాయి.
ఈ నేపథ్యంలో రాజ్యాంగం మీద ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామని చిలీ శుక్రవారం నాడు ప్రకటించింది.
మోన్ లాఫేర్ట్ ఏం చేశారు?
అమెరికాలోని లాస్ వేగాస్‌లో గురువారం జరిగిన లాటిన్ గ్రామీ అవార్డుల కార్యక్రమానికి మోన్ లాఫేర్ట్ హాజరయ్యారు. అక్కడ రెడ్ కార్పెట్ మీద నడిచారు.
ఆమె ఈ అవార్డుల్లో ఉత్తమ ప్రత్యామ్నాయ ఆల్బమ్ పురస్కారం కూడా అందుకున్నారు. అవార్డును స్వీకరించేటపుడు.. ''చిలీ.. నీ బాధ నన్ను గాయపరుస్తోంది'' అంటూ చిలీ రచయిత లా చింగానేరా రాసిన కవితను మోన్ లాఫేర్ట్ చదివారు.
ఈ కార్యక్రమంలో.. లాటిన్ అమెరికా దేశాల్లో నెలకొన్న ప్రస్తుత రాజకీయ వాతావరణం గురించి మాట్లాడిన పలువురు కళాకారుల్లో ఈమె ఒకరు.

ఫొటో సోర్స్, AFP/Getty
చిలీలో ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు జరుగుతోంది?
చిలీలో సామాజిక సంస్కరణలు, దేశ రాజ్యాంగంలో మార్పులు జరగాలని డిమాండ్ చేస్తూ దాదాపు నెల రోజులుగా ఆందోళనకారులు రోడ్లపై ఉద్యమిస్తున్నారు.
ప్రస్తుత రాజ్యాంగం.. సైనిక పాలకుడు అగస్టో పినోచెట్ కన్నా ముందటి ప్రజాస్వామ్య పూర్వ శకానికి చెందిన రాజ్యాంగం.
ఈ రాజ్యాంగం ప్రకారం.. దేశ ప్రజలకు ఆరోగ్య రక్షణ, విద్య అందించే బాధ్యత ప్రభుత్వం మీద లేదు. అవి తమకు అందించాలనేది నిరసనకారుల రెండు డిమాండ్లు.
రాజ్యాంగం మీద వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామని ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.

ఫొటో సోర్స్, EPA
'ఈ రాజ్యాంగాన్ని మార్చాలని మీరు భావిస్తున్నారా?' అని రిఫరెండంలో ప్రజలను అడుగుతామని సెనేట్ అధ్యక్షుడు జైమా క్వింటానా పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని మార్చాలని భావిస్తున్నవారిని.. కొత్త రాజ్యాంగాన్ని రచించటానికి మూడు సంస్థల్లో దేనినైనా ఎంచుకోవాలని కూడా రిఫరెండంలో కోరటం జరుగుతుందని చెప్పారు.
పూర్తిగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల సంస్థ ఒకటి, రాజకీయంగా నియమితులైన వారితో కూడిన సంస్థ ఒకటి, వీరిద్దరూ సమానంగా ఉన్న సంస్థ ఒకటి - ఆ మూడు ప్రత్యామ్నాయాలు.
నెల రోజులుగా జరుగుతున్న ఆందోళనల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1,000 మందికి పైగా గాయపడ్డారు.
సైనిక పోలీసులు పాల్పడిన హత్యలు, లైంగిక హింస, హింస ఆరోపణలు సహా 195 కేసుల మీద చట్టపరంగా చర్యలు చేపట్టినట్లు చిలీకి చెందిన స్వతంత్ర జాతీయ హానవ హక్కుల సంస్థ చెప్తోంది.
ఇవి కూడా చదవండి:
- భాయిచంద్ పటేల్: 'ఆ అమ్మాయిలకు తిరగడానికి తెల్లవాళ్ళు, పెళ్లికి మాత్రం మనలాంటి వాళ్లు కావాలి'
- 'దెయ్యాలను 12 ట్రక్కుల్లో మూడు రోజుల పాటు మరో చోటుకు తరలించాం'
- నీటిపై తేలియాడే వెనిస్ను ముంచెత్తిన వరదలు
- హైదరాబాద్: బడి దగ్గర అన్నం గిన్నెతో చిన్నారి ఫొటో వెనుక నిజాలేమిటి?
- కశ్మీర్, అయోధ్యల తరువాత... మోదీ ప్రభుత్వం ముందున్న లక్ష్యం ఏమిటి?
- కరసేవకుడి నుంచి ప్రధానమంత్రి వరకు… నరేంద్ర మోదీకి అయోధ్య ఉద్యమం ఎలా ఉపయోగపడింది?
- ‘అయోధ్య తీర్పులో స్పష్టంగా చెప్పారు, రామ జన్మస్థలం మసీదు కిందే ఉంది’ - సి.ఎస్.వైద్యనాథన్
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
- చాలా మతాలు అంతరించినా క్రైస్తవం ఎలా విస్తరించింది...
- అబద్ధాలు చెప్పే వారిని ఎలా గుర్తించాలి?
- ఈ అక్కాచెల్లెళ్లు కన్నతండ్రినే హత్యచేశారు.. కారణమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








