సోషల్ మీడియాలో స్విమ్ సూట్‌‌లో ఉన్న ఫోటోలను షేర్ చేస్తే ఉద్యోగం ఇవ్వరా?

ఎమ్లీ క్లోవ్

ఫొటో సోర్స్, Emily Clow

టెక్సస్‌లోని ఒక సంస్థ ఉద్యోగం కోసం ఎలా దరఖాస్తు చేయకూడదో చెబుతూ ఉదాహరణగా స్విమ్ సూట్ ధరించిన అభ్యర్థి చిత్రాన్ని పోస్ట్ చేసింది.

కికాస్ మాస్టర్ మైండ్స్ అనే మార్కెటింగ్ కంపెనీ అభ్యర్థి ఎమ్లీ క్లోవ్ ఇన్‌స్టాగ్రామ్‌ స్లయిడ్‌ను చూపెడుతూ.... ప్రొఫెషనలిజం లేనందున ఈ దరఖాస్తును తిరస్కరించామని తెలిపింది.

''మీరు ఒక ఉద్యోగి కావాలనుకుంటే ఇలాంటి ఫొటోలను మీ సోషల్ మీడియాలో షేర్ చేసుకోకండి'' అని సూచించింది.

అయితే, దీనిపై బెదిరింపు సందేశాలు రావడంతో ఆ కంపెనీ తన అకౌంట్‌ను ప్రైవేట్ చేసింది.

''ఆ కంపెనీని ఒక మహిళ స్థాపించారు. వ్యాపారంలో మహిళలకు మద్దతిస్తుందనిపించి అందులోని మార్కెటింగ్ ఉద్యోగానికి దరఖాస్తు చేశాను'' అని క్లోవ్ చెప్పారు.

అయితే, ఫొటోను బహిరంగపర్చడంపై ఆమె దిగ్భ్రాంతికి గురయ్యారు.

కంపెనీ పోస్టు ఇలా కొనసాగింది: నేను ఒక ప్రొఫెషనల్ మార్కెటర్ కోసం ఎదురు చూస్తున్నాను. బికినీ మోడల్ కోసం కాదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

దీనిపై క్లోవ్ తీవ్రంగా స్పందించారు. ''ప్రైవేట్‌గా మీరు ఎన్ని అసభ్యకర పనులైనా చేసుకోండి. కానీ, నైపుణ్యమున్న ఉద్యోగిని గుర్తించడంలో ఇది మీకు ఏవిధంగానూ సహాయపడదు'' అని అన్నారు.

''దరఖాస్తు నింపుతున్నప్పుడు నా ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్ ఐడీ గురించి కంపెనీ అడిగింది. తర్వాత తమ కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో కావాలని సూచించింది. అప్పుడే నా ఫొటో ఆ అకౌంట్‌లో ఉండటం చూశాను'' అని క్లోవ్ చెప్పారు.

''నా గురించి అందులో ఏం రాశారని చూశాను. వారు నా ఫొటోను పోస్టు చేశారు. నిజాయితీగా చెప్పాలంటే నేను వెనక్కి తగ్గాను. దీనిపై ఎలా ప్రతిస్పందిచాలో నాకు తెలియలేదు. అసలేమైందో తెలుసుకునేందుకు కొంత సమయం పట్టింది'' అని చెప్పారు.

ఆమె బీబీసీతో మాట్లాడుతూ ''నేను మొదట ఆ కంపెనీ దగ్గరకు వెళ్లాలనుకున్నాను. నా ఫొటోను ఎలా గుర్తించానో వారికి చెప్పాలనుకున్నాను. దీనికంటే ముందు నా రెజ్యూమ్‌తో పాటు ఫొటో విషయంపై వారికి మెయిల్ చేశాను. చివర్లో నా ఫొటోకు సంబంధించిన పోస్టును వెనక్కితీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పాను. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపాను'' అని పేర్కొన్నారు.

క్లోవ్‌ నుంచి మెయిల్ వచ్చిన వెంటనే ఆమె అభ్యర్థన మేరకు ఫొటోను తొలగించామని కిక్కాస్ మాస్టర్ మైండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సారా క్రిస్టెన్సేన్ తెలిపారు.

అయితే, క్లోవ్ మాత్రం తాను పదే పదే అభ్యర్థించడం వల్లే వారు పోస్టును తొలగించారని, తన అకౌంట్‌ను కూడా బ్లాక్ చేశారని చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

తన పరిస్థితిని ట్విటర్‌లో షేర్ చేశాకే వారు ఫొటోను తొలగించారని క్లోవ్ తెలిపారు.

చంపేస్తామని బెదిరింపులు

క్లోవ్ తన పరిస్థితిని ట్వీట్ చేసిన తరువాత దానిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

ఆమె ధరించిన దుస్తులతో ఎటువంటి తప్పు లేదని, అక్కడి వాతావరణానికి ఇవి తగిన దుస్తులని ఒక యూజర్ పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి వ్యక్తిత్వాన్ని పరిశీలించడానికి సంస్థ అతని సోషల్ మీడియా ప్రొఫైల్‌లను చూడటం సర్వసాధారణం అని మరో యూజర్ అభిప్రాయపడ్డారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

మరో ట్విటర్ యూజర్ రెండు వైపులా తప్పు ఉందని పేర్కొన్నారు.

''సోషల్ మీడియా ప్రొఫైల్ కారణంగా ఆమె అనర్హురాలు కాలేరు'' అని ఓ నెటిజన్ చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

ఈ చర్యతో ఆ కంపెనీ, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురైంది.

అదే సంస్థలో పనిచేసే ఉద్యోగులు స్విమ్ సూట్లతో సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలను కొంతమంది నెటిజన్లు వేలెత్తిచూపారు.

''బెదిరింపులు, వేధింపు సందేశాల కారణంగా మేము మా సోషల్ మీడియా అకౌంట్‌ను తీసివేశాం'' అని క్రిస్టెన్సేన్ ప్రకటించారు.

ఇప్పుడు తనకు వివిధ ప్రాంతాల నుంచి అనేక ఉద్యోగ అవకాశాలు వచ్చాయని క్లోవ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)