ఆర్టికల్ 370: దౌత్య, వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకున్న పాకిస్తాన్... పునరాలోచించాలని కోరిన భారత్

జయశంకర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్

భారతదేశంతో దౌత్య, వాణిజ్యపరమైన నిర్ణయాలకు సంబంధించి పాకిస్తాన్ పునరాలోచించాలని భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పాకిస్తాన్ తాను తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి చెబుతున్న కారణాలు సహేతుకమైనవి కావని భారత్ అభిప్రాయపడింది.

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు భారత్ రద్దు చేసిన తరువాత పాకిస్తాన్ బుధవారం నాడు జాతీయ భద్రతా కమిటీ సమావేశం ఏర్పాటు చేసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్‌తో దౌత్య సంబంధాలను రద్దు చేసుకోవడంతో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది.

పాక్ విదేశాంగ మంత్రి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ

భారత విదేశాంగ శాఖ దీనిపై గురువారం స్పందించింది. "పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయాల పట్ల భారత ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తోంది. ఈ నిర్ణయాలపై పాకిస్తాన్ పునరాలోచించాలని మేం కోరుతున్నాం" అని ఒక ప్రకటన విడుదల చేసింది.

సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రద్దు

ఇదిలా ఉంటే, ఈ ప్రకటన విడుదలైన కొన్ని గంటల తరువాత పాకిస్తాన్ మరో నిర్ణయాన్ని ప్రకటించింది. లాహోర్, అటారీల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ ఈ మేరకు ప్రకటన చేశారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే, దీనిపై భారత్ నుంచి ఇంకా స్పందన రాలేదు.

ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన జరిగిన అత్యున్నత సమావేశం

ఫొటో సోర్స్, PAKISTAN PM OFFICE

ఫొటో క్యాప్షన్, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన జరిగిన అత్యున్నత సమావేశం

పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ నిర్ణయాలు

బుధవారం నాడు పాకిస్తాన్ భారత హైకమిషనర్‌ను దేశం నుంచి బహిష్కరించింది. దిల్లీలోని పాకిస్తాన్ హైకమిషర్‌ను కూడా వెనక్కు రప్పిస్తామని పాక్ విదేశాంగ మంత్రి షా మొహమ్మద్ ఖురేషీ చెప్పారు.

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన ఇస్లామాబాద్‌లో అత్యున్నత 'జాతీయ భద్రతా కమిటీ' సమావేశం జరిగింది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకొన్నారు.

ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో విదేవీ వ్యవహారాలశాఖ, రక్షణశాఖ, అంతర్గత వ్యవహారాల శాఖ, విద్యాశాఖ, మానవ హక్కుల శాఖ, కశ్మీర్ వ్యవహారాలు, గిల్గిత్-బాల్టిస్తాన్ శాఖ, న్యాయశాఖ మంత్రులతోపాటు అత్యున్నత సైనికాధికారులు, పౌర అధికారులు పాల్గొన్నారు.

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

ఈ అధికారుల్లో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్(సీజేసీఎస్‌సీ), పాకిస్తాన్ సైనిక ప్రధానాధికారి(సీవోఏఎస్), వైమానిక దళాధిపతి(సీఏఎస్), నౌకాదళాధిపతి(వీసీఎన్‌ఎస్), ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) డైరెక్టర్ జనరల్, పాకిస్తాన్ సైనిక బలగాల అధికార ప్రతినిధి, విదేశాంగ కార్యదర్శి, ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

కశ్మీర్‌లో భారత ప్రభుత్వం చేపట్టిన ఏకపక్ష, చట్టవిరుద్ద చర్యల కారణంగా ఏర్పడ్డ పరిస్థితులు, నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వెంబడి నెలకొన్న పరిస్థితులపై ఈ కమిటీ చర్చించి, వివిధ నిర్ణయాలు తీసుకొందని పాక్ ప్రభుత్వం తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఆ నిర్ణయాలు ఏమిటంటే-

1.భారత్‌తో దౌత్య సంబంధాల తగ్గింపు

2.భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యం నిలిపివేత

3.ద్వైపాక్షిక సంబంధాలను సమీక్ష

4.కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితికి, ఐరాస భద్రతా మండలికి నివేదించడం

5.ధైర్యశాలులైన కశ్మరీలకు, స్వయం నిర్ణయాధికార హక్కు కోసం వారు జరుపుతున్న పోరాటానికి పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 14న సంఘీభావం. ఆగస్టు 15న 'బ్లాక్ డే'గా నిరసన.

భారత జాత్యహంకార ప్రభుత్వాన్ని, భారత ప్రభుత్వ ఎత్తుగడలను, మానవ హక్కుల ఉల్లంఘనలను ప్రపంచ దేశాల ముందు దౌత్య మార్గంలో ఎండగట్టాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిర్దేశించారు.

అప్రమత్తంగా ఉండాలని సైనిక బలగాలను ఆయన ఆదేశించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

పాక్ పార్లమెంటులో చర్చ

పాకిస్తాన్ పార్లమెంటు ఉమ్మడి సెషన్లో కూడా కశ్మీర్ పరిస్థితిపై చర్చించారు

కశ్మీర్‌లో భారత్ చేస్తున్నవి 'కపట ప్రభుత్వ యుద్ధ నేరాల్లా' ఉన్నాయని పాకిస్తాన్ మానవ హక్కుల మంత్రి శిరీన్ మజారీ అన్నారు.

భారత్ చేస్తున్నవి చూస్తున్న పాక్ ప్రజలు భారత ప్రభుత్వాన్ని కపట ప్రభుత్వం అంటున్నారని చెప్పారు.

కశ్మీర్ వివాదాస్పద ప్రాంతంగా ప్రకటిస్తూ ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానాన్ని ఉల్లంఘించారని, "భారత్ చేస్తున్న ఈ హింస, స్పష్టంగా జతి నిర్మూలన, మారణహోమం" అని చెప్పారు.

ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకునే హక్కు ఏమైందని అంతర్జాతీయ సమాజం ప్రశ్నించాలని మంత్రి అన్నారు.

అటు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సెనేటర్ రాజా రబ్బానీ "కశ్మీర్ ఇప్పుడు ఉపఖండంలో గాజాస్ట్రిప్‌లా మారిందని" అన్నారు.

"దీన్ని సమగ్రంగా చూస్తే అమెరికా, ఇజ్రాయెల్, భారత్ ఒక్కటిగా కుమ్మక్కైనట్టుంది. దాన్ని మనం చూడలేకపోతున్నాం. ట్రంప్ మధ్యవర్తిత్వం చేసినపుడు గోలాన్ హైట్స్‌ను ఇజ్రాయెల్‌కు ఇవ్వడం మనం మర్చిపోయామా" అన్నారు.

నియంత్రణ రేఖ దగ్గర సైనికులు ఉండడం వల్ల శరణార్థులు పాకిస్తాన్‌లోకి వస్తారని ఎప్పుడూ యుద్ధం ప్రమాదం పొంచి ఉంటుందని రాజా రబ్బానీ అన్నారు.

ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

మరోవైపు, ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగం అధికార ప్రతినిధి కశ్మీర్ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

"భారత అధీనంలోని కశ్మీర్‌లో చేపట్టిన తాజా చర్యల వల్ల ఈ ప్రాంతంలో మానవహక్కుల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, ఆ ప్రాంతం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం బయటకు రాకపోవడమే తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఐక్యరాజ్యసమితి తన ట్వీట్‌లో పేర్కొంది.

అమెరికా విదేశాంగ శాఖ స్పందన

పత్రికలలో వచ్చిన కథనాలు భిన్నంగా, జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసే విషయమై భారతదేశం తమతో ముందుగా సంప్రతించలేదని అమెరికా విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. అమెరికా విదేశాంగ శాఖలోని దక్షిణ-మధ్య ఆసియా విభాగం ఆ మేరకు ట్వీట్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)