శాంసంగ్ వాటర్ ప్రూఫ్ మొబైల్‌పై వివాదం.. కేసు వేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వ సంస్థ

ఫొటో సోర్స్, Reuters
శాంసంగ్ కంపెనీ తన ఫోన్లు వాటర్ రెసిస్టెంట్ (నీటిలో తడిచినా పాడవబోవు) అంటూ తప్పుదోవ పట్టించిందని ఆరోపిస్తూ ఆస్ట్రేలియా వినియోగదారుల సంస్థ ఒకటి సదరు కంపెనీ మీద కేసు వేసింది.
నీటిలో ఈత కొట్టేటపుడు, సముద్రపు అలలపై సర్ఫింగ్ చేసేటపుడు తమ ఫోన్లు వాడటం గురించి శాంసంగ్ ''తప్పుడు'' ప్రచారం చేసిందని ఆస్ట్రేలియన్ కాంపిటిషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్ (ఏసీసీసీ) ఆరోపిస్తోంది.
ఈ న్యాయపోరాటానికి దిగేముందు శాంసంగ్ కంపెనీ విడుదల చేసిన 300 వాణిజ్యప్రకటనలను తాము సమీక్షించామని ఏసీసీసీ పేర్కొంది.
శాంసంగ్ తమ వాణిజ్యప్రకటనలను సమర్థించుకుంది. కేసును ఎదుర్కొంటామని రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పింది.
లోతైన దర్యాప్తు
శాంసంగ్ తన ఫోన్లు సముద్ర జలాలు, ఈత కొలనుల్లో నీటిలో తడిస్తున్నట్లుగా అడ్వర్టైజ్‌మెంట్లలో చిత్రీకరించిందని.. అలా నీటిలో తడవటం వల్ల తమ ఫోన్ల మీద ఎలాంటి ప్రభావం చూపవని పేర్కొందని ఏసీసీసీ ఒక ప్రకటనలో చెప్పింది.
తమ ఫోన్లకు ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్ (నీటిని తట్టుకోవటం) ఉందని శాంసంగ్ వాణిజ్య ప్రకటనలు చెప్తున్నప్పటికీ.. ఈ రేటింగ్ పరిధిలోకి ఉప్పు నీరు, స్విమ్మింగ్ పూల్స్ నీరు రావని ఏసీసీసీ పేర్కొంది.
గెలాక్సీ ఎస్10 ఫోన్‌ను స్విమ్మింగ్ పూల్‌లో కానీ, బీచ్‌లో కానీ ఉపయోగించవద్దని శాంసంగ్ సొంత వెబ్‌సైట్ ప్రజలకు సలహా ఇస్తోందని కూడా ఆస్ట్రేలియా వినియోగదారుల సంస్థ తెలిపింది.
శాంసంగ్ కంపెనీ తన ఉత్పత్తుల మన్నికకు సంబంధించి ఈ వాణిజ్య ప్రకటనల్లో ఇలా చెప్పటానికి ముందు తగినంతగా పరీక్షించలేదని ఆరోపించింది.
''వినియోగదారులను ఆకర్షించటానికి గెలాక్సీ ఫోన్లను ఉపయోగించకూడని పరిస్థితుల్లో ఉపయోగించినట్లుగా శాంసంగ్ ఈ ప్రకటనల్లో చూపింది'' అని పేర్కొంది.
ఈ కేసులో వినియోగదారులను తప్పుదోవ పట్టించిన ఆరోపణల్లో శాంసంగ్ దోషిగా తేలితే ఆ సంస్థ భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సి రావచ్చు.
ఇవి కూడా చదవండి:
- అబ్ఖాజియా: ఇదో అజ్ఞాత దేశం.. దీనిని భారత్ ఇప్పటికీ గుర్తించలేదు
- పాకిస్తాన్‌కు కునుకు లేకుండా చేస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎలా పుట్టింది
- రిహార్సల్స్ చేయిస్తున్న ట్రైయినర్‌ను చంపేసిన సర్కస్ పులులు
- యునెస్కో వారసత్వ ప్రదేశాల జాబితాలో జైపూర్
- IND vs NZ: మాంచెస్టర్ మొగ్గు భారత్‌కా, న్యూజీలాండ్కా?
- ప్రపంచ కప్ 2019: సెమీస్ ఆడకుండానే టీమిండియా ఫైనల్ చేరుకోవచ్చా
- అమెజాన్ ఆదివాసి తెగ: బ్రెజిల్ ప్రభుత్వంతో పోరాడుతున్న ఈ తెగ జనాభా 120 మాత్రమే
- ఉత్తర కొరియా: విదేశీయులు ఈ దేశానికి ఎందుకు వెళతారు? ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








