BBC Click ఎపిసోడ్ 5: డ్రైవర్ రహిత ట్రాక్టర్లు ఎలా పని చేస్తాయ్
టెక్నాలజీ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోంది. మరి, అన్నింటి కంటే ముఖ్యమైన వ్యవసాయ రంగంలో సాంకేతిక పురోభివృద్ధి ఎలా ఉంది?
ఇప్పటికే అనేక రంగాల్లో ఆటోమేషన్ ప్రవేశించింది. సమీప భవిష్యత్తులో వ్యవసాయంలోనూ యంత్రాలదే ఆధిపత్యం కానుందా?
అసలు కూలీలే లేకుండా పూర్తిగా యంత్రాలతోనే సేద్యం చేయించడం సాధ్యమేనా?... అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు.
డ్రైవర్ లేకుండానే నడిచే ట్రాక్టర్లను, పంట నూర్పిడి యంత్రాలను రూపొందించారు. దుక్కి దున్నడం, విత్తనాలు వేయడం నుంచి కోతల వరకు అన్ని పనులనూ మానవ రహిత యంత్రాలే చేసేస్తున్నాయి.
వ్యవసాయంలో యంత్రాల వినియోగం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునాతన ట్రాక్టర్లు డ్రైవర్లు లేకుండానే నడుస్తున్నాయి.
ఆ యంత్రాలు ఎలా పనిచేస్తున్నాయో మీరూ BBC Click ఎపిసోడ్ 5లో చూడవచ్చు.
ఇలాంటి అధునాతన సాంకేతికతలకు సంబంధించిన మరెన్నో ఆసక్తికర కథనాలను బీబీసీ క్లిక్ బులెటిన్‌లో చూసేయండి.
ఈ కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం రాత్రి 9.30 నుంచి 10 గంటల వరకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ చానళ్లలో చూడొచ్చు.
ఇవి కూడా చూడండి:
- BBC Click ఎపిసోడ్ 1: నేరం జరగకముందే కనిపెట్టే సాంకేతిక పరిజ్ఞానం.. దుబాయ్లో రోబో పోలీస్
- BBC Click ఎపిసోడ్ 2: మనిషి లక్షణాలను మించిన హ్యూమనాయిడ్స్ రాబోతున్నాయా
- BBC Click ఎపిసోడ్ 3: మహిళలు టెక్నాలజీ రంగంలో ఎందుకు వెనకబడిపోతున్నారు?
- BBC Click ఎపిసోడ్ 4: ప్రకృతి విపత్తుల నుంచి కాపాడే సరికొత్త టెక్నాలజీ... క్రికెట్లో 'పవర్ బ్యాట్'
- రోబోలతో ఉద్యోగాల్లో కోత పడుతుందా?
- ఇలా ఫుట్బాల్ ఆడే రోబోలను చూశారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









