సిబాహ్లే జవానే : గణితంలో సరికొత్త సంచలనం దక్షిణాఫ్రికాలోని ఈ బాల మేధావి

దక్షిణాఫ్రికాలోని ఓ ఫార్మ్ స్కూల్‌లో చదువుతున్న ఓ పదేళ్ల బాలుడు గణితశాస్త్రంలో సరికొత్త సంచలనంగా మారాడు.
అతడి పేరు సిబాహ్లే జవానే. ఈ బుడతడు మానవ రూపంలోని ఒక కాలిక్యులేటర్ అంటే అతిశయోక్తి కాదు.
రోజర్ పిల్లే అనే ఒక స్థానిక పోలీసు ఒక వీడియో తీయడంతో జవానే గురించి ప్రపంచానికంతా తెలిసింది.

''తనకి సవాళ్లంటే ఎంతో ఇష్టం. ఎప్పుడూ పెద్ద పెద్ద కలలే కంటాడు. అన్నిటినీ సాకారం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను'' అని అతడి తల్లి అంటున్నారు.
ఇతడు ఒక అద్భుతమైన బహుమతి అని తేలింది. అయితే కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. తాను చాలా తొందరగా విసిగిపోతాడు. అందుకే తనకు పాఠాలు చెప్పడానికి విభిన్నమైన పద్ధతులు కావాలి.

విట్స్ యూనివర్సిటీలో మాథ్స్ ఒలింపిక్స్ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రొఫెసర్ బెలిండా హంట్లే.. ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులతో సిబాహ్లే పోటీపడాలని ఆశిస్తున్నారు.
''ఇప్పుడే అతనికి జ్ఞానం సమృద్ధిగా అందకపోతే అతడి ప్రతిభ నీరుగారిపోయి అందరిలాగే సాధారణ పాఠ్యాంశాలను చదువుకునే సామాన్య విద్యార్ధి అయిపోతాడు'' అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








