కెన్యా: పుట్టగానే అమ్మాయి పెళ్లి నిశ్చయిస్తారు

కెన్యా పాప

భారత్‌లో ఒకప్పుడు బాల్య వివాహాలు మామూలే. బిడ్డ పుట్టగానే వాళ్ల పెళ్లి నిశ్చయించేవాళ్లూ ఉండేవారు. కానీ, కెన్యాలో ఇప్పటికీ ఆ సంప్రదాయం కొనసాగుతోంది.

అక్కడి ఒరోమో తెగ ప్రజలు ఆడపిల్ల పుట్టగానే ఆమె పెళ్లి ఎవరితో చేయాలో నిశ్చయిస్తారు. పెద్దయ్యాక ఎట్టి పరిస్థితుల్లో ఆ అబ్బాయే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి.

ఇబ్రహిం ఆబ్ది అనే వ్యక్తి కూడా తనకు కూతురు పుట్టగానే ఆమె పెళ్లిని ఓ అబ్బాయితో నిశ్చయించారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

‘నేను చనిపోయినా సరే, వేరే ఎవరూ ఆమెను పెళ్లి చేసుకోకూడదు. మేం నిశ్చయించిన అబ్బాయే వచ్చి ఆమెను పెళ్లి చేసుకోవాలి. అదే మా సంప్రదాయం’ అంటారాయన.

ఈ సంప్రదాయాన్ని దరారా అని పిలుస్తారు. అమ్మాయికి పెళ్లి నిశ్చయమైందని తెలియడం కోసం చిన్నప్పుడే అబ్బాయి తండ్రి 'దరారా'(ఒక రకమైన గడ్డి)ను అమ్మాయి చేతికి కడతాడు.

ఒకవేళ తమకు ఏదైనా జరిగినా, ఈ సంప్రదాయం ఫలితంగా తమ బిడ్డ భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండదని తల్లిదండ్రులు నమ్ముతారు. ఈ సంప్రదాయం వల్ల కుటుంబాల మధ్య

సంబంధాలు కూడా మెరుగవుతాయని వాళ్లు భావిస్తారు.

‘తండ్రి మాటను అమ్మాయి కాదనకూడదు. పిల్లలకు ఏది మంచిదో తండ్రికే కదా తెలుస్తుంది’ అంటారు ఇబ్రహిం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)