శ్రీలంక పార్లమెంటు రద్దుకు అధ్యక్షుడు అర్ధరాత్రి ఆదేశాలు

ఫొటో సోర్స్, AFP
శ్రీలంక రాజకీయాల్లో మరో మలుపు. ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పార్లమెంటును రద్దు చేయాలని ఆదేశించారు.
ఆయన శుక్రవారం అర్ధరాత్రి పార్లమెంటు రద్దుపై అధికారిక ప్రకటన జారీ చేశారు.
తక్షణం ఇది అమలవుతుందని తెలిపారు. దీంతో వచ్చే ఏడాది ప్రారంభంలోనే శ్రీలంకలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
అయితే, అదంత సులభం కూడా కాదు, ఎందుకంటే పార్లమెంటు రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది.
ఇటు ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించిన రణిల్ విక్రమ సింఘెకి చెందిన యునైటెడ్ నేషనల్ పార్టీ(యుఎన్‌పి) మాత్రం అధ్యక్షుడికి ఇలాంటి నిర్ణయం తీసుకునే అధికారం లేదని చెబుతోంది.
గత నెల అధ్యక్షుడు సిరిసేన మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే ను కొత్త ప్రధానమంత్రిగా చేశారు. ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘె, ఆయన మంత్రి మండలిని తొలగించారు.
విక్రమ సింఘె తన పదవిని వదలడానికి నిరాకరించారు. తనను ప్రధాని పదవి నుంచి తొలగించడం చట్టవిరుద్ధం అని ఆరోపించారు.
విక్రమ సింఘె పార్టీ యుఎన్‌పికి చెందిన ఎంపీ అజిత్ పెరీరా పార్లమెంటును రద్దు చేయాలనే చర్యలు చట్టవిరుద్ధం అని చెప్పారు.
ఈ ఆదేశాలు రద్దు అవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
"దేశంలో రక్తపాతం జరగకుండా శాంతిపూర్వకంగా ఈ అంశాన్ని పరిష్కరించాలని మేం ఎన్నికల సంఘాన్ని కోరుతాం" అని ఆయన బీబీసీతో అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అటు, రాజపక్సే సాధారణ ఎన్నికలను సమర్థిస్తూ ఒక ట్వీట్ చేశారు. "ఒక నేతగా శ్రీలంక భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకోడానికి సామాన్యులకు అవకాశం ఇవ్వాలి. ఈ ఎన్నికలు దేశాన్ని స్థిరత్వం వైపు తీసుకెళ్తాయి" అని అందులో తెలిపారు.
సిరిసేన-రాజపక్సే క్యాంప్ త్వరలో ఎన్నికలు కోరుకుంటోందని బీబీసీ సింహళ సర్వీస్ ప్రతినిధి అజమ్ అమీన్ చెప్పారు. ఎందుకంటే వారికి కొత్త ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమైనంత మెజారిటీ లేదన్నారు.
శ్రీలంకలో ఎన్నికల నిర్వహణపై యుఎన్‌పి పార్లమెంటులో ఓటింగ్ కోరుతుందని మా ప్రతినిధి తెలిపారు.

ఫొటో సోర్స్, EPA
ఇదంతా ఎందుకు జరిగింది?
2015లో సుదీర్ఘ కాలంగా అధ్యక్ష పదవిలో ఉన్న రాజపక్సేను సిరిసేన, విక్రమసింఘె కూటమి ఓడించింది.
ఈ కూటమిలో మొదటి నుంచీ చీలికలు ఉన్నాయి. చివరికి విక్రమసింఘెను పదవి నుంచి తొలగించిన సిరిసేన తర్వాత రాజపక్సేను ప్రధాని చేశారు.
భారత్‌కు ఒక ఓడరేవు లీజుకు ఇవ్వాలని శ్రీలంక ప్రభుత్వం భావించడంతో ఈ ఆ విషయంలో ఇద్దరి మధ్య వివాదం రాజుకున్నట్టు తెలుస్తోంది.
ఈ వివాదం తర్వాత రెండు పార్టీలు తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పాయి.
తొలగించిన ప్రధానమంత్రి విక్రమ సింఘె తన నివాసం వదలడానికి నిరాకరించారు.
అధ్యక్షుడి ఈ చర్యలు రాజ్యాంగవిరుద్ధం అన్నారు. దీనిపై పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి విశ్వాస పరీక్ష నుంచి గట్టెక్కాలని డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇటు, కొత్త మంత్రి మండలితో ప్రమాణ స్వీకారం చేసిన రాజపక్సే ఆర్థిక మంత్రి పదవి కూడా తీసుకున్నారు.
పార్లమెంటులో మద్దతు గెలుచుకునేందుకు నలుగురు ఎంపీలకు మంత్రి పదవులు కూడా ఇచ్చారు.
ఈ సంక్షోభం తర్వాత గత నెలలో హింస కూడా జరిగింది.
తొలగించిన చమురు శాఖ మంత్రి అంగరక్షకుడు ఆయన ఆఫీసు బయట ఆందోళన చేస్తున్న ప్రదర్శనకారులపై కాల్పులు జరిపాడు.
శ్రీలంక రాజకీయాలను పొరుగు దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.
చైనా రాజపక్సెకు శుభాకాంక్షలు తెలిపింది. ఇటు భారత్, యూరోపియన్ యూనియన్, అమెరికా రాజ్యాంగాన్ని గౌరవించాలని ఆ దేశానికి సూచించాయి.
ఇవి కూడా చదవండి:
- శ్రీలంక రాజకీయ సంక్షోభంలో చైనా పాత్ర ఉందా?
- శ్రీలంక: హిందూ ఆలయాల వద్ద జంతుబలిని నిషేధించనున్న ప్రభుత్వం
- శ్రీలంక: మహిళలు 'డ్రమ్ము'లా ఉండరాదన్న జిమ్.. వెల్లువెత్తిన నిరసనలు
- శ్రీలంక: కోలుకుంటున్న పర్యాటక స్వర్గధామం కండీ!
- చరిత్ర: మొదటి ప్రపంచ యుద్ధం ప్రపంచాన్ని ఎలా మార్చేసిందంటే..
- మొదటి ప్రపంచ యుద్ధానికి వందేళ్లు. ఆ యుద్ధంలో భారత సైనికుల త్యాగాలు తెలుసా
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేయలేని 5 పనులు
- "ఉద్యోగులతో మూత్రం తాగించి, బొద్దింకలు తినాలని ఒత్తిడి తెచ్చిన చైనా సంస్థ"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








