పాక్ ఎన్నికలు: యువత మొబైల్ ఫోన్లలో పొలిటికల్ గేమ్స్
పాకిస్తాన్ ఎన్నికల ఓటింగ్ ముగిసి, ఫలితాలు వెలువడుతున్నా ఓటర్లలో ఆ వేడి మాత్రం ఇంకా తగ్గలేదు. దేశంలో కొత్తగా పాపులర్ అయిన మొబైల్ పొలిటికల్ గేమ్స్‌లో తమ అభిమాన పార్టీలను గెలిపించడంలో బిజీబిజీగా ఉన్నారు.
పాకిస్తాన్‌లో ఎన్నికల నేపథ్యంలో పాపులర్ అయిన ఈ మొబైల్ గేమ్స్‌లో రాజకీయ నాయకులు, ఫొటోలు, పాటలు, పార్టీ జెండాలతో ఒక టీమ్‌గా ఏర్పడి ఈ గేమ్ ఆడతారు.
క్యారమ్ బోర్టులా కనిపించే ఈ ఆటలో అభిమాన రాజకీయ నేతలతోపాటు ఏలియన్స్ కూడా ఉంటాయి. వాటిని ఓడించి తమ పార్టీని గెలిపించడంలో అంతా తలమునకలైపోతారు.
ఇలాంటి గేమ్స్ యువతలో సహనాన్ని పెంచుతాయని డెవలపర్స్ చెబుతున్నారు. సామరస్యంగా ఆలోచించేవారే తమ ఆటలు ఇష్టపడతారని అంటున్నారు.
మొబైల్ ఫోన్లలో పొలిటికల్ గేమ్ ఆడుతూనే.. చాలా మంది దేశంలోని ఆయా పార్టీలపై తమ అభిప్రాయాలను కూడా పంచుకుంటున్నారు.
ఇమ్రాన్ ఖాన్ భార్యలను మార్చినట్టు, రాజకీయాల్లో కూడా చేస్తారని కొందరు అంటే, భుట్టోది ఫ్యూడల్ మనస్తత్వం అంటారు మరికొందరు.
ఇంకొందరు మాత్రం గేమ్‌లో తమ పార్టీ లేనందుకు బాధపడిపోతారు.
ఓటింగ్ ముగిసినా బృందాలుగా ఏర్పడి మొబైల్‌లో ఈ గేమ్ ఆడుతున్న వారితో చాలా ప్రాంతాలు సందడిగా మారాయి.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









