హఠాత్తుగా భేటీ అయిన ఉత్తరకొరియా, దక్షిణ కొరియాల అధినేతలు

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల అధ్యక్షులు శనివారం ఇరుదేశాల మధ్య ఉన్న డీ మిలిటరైజ్డ్ జోన్‌లో హఠాత్తుగా భేటీ అయ్యారు.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌ల మధ్య ఇలా భేటీ జరగడం ఇది రెండో సారి.
ఉత్తర కొరియా, అమెరికా శిఖరాగ్ర సదస్సు రద్దయిన నేపథ్యంలో.. దాన్ని మళ్లీ నిర్వహించేందుకు వీలుగా ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది.
జూన్ 12న సింగపూర్‌లో కిమ్, ట్రంప్‌ల మధ్య భేటీ ఉంటుందని ట్రంప్ తొలుత ప్రకటించారు. తర్వాత ఆ భేటీ జరగదని తెలిపిన ఆయన మళ్లీ ఇప్పుడు అది అవకాశాలున్నాయని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





