జూన్ 12న సింగపూర్‌లో ట్రంప్ - కిమ్ భేటీ

Kim Jong-un and Donald Trump

ఫొటో సోర్స్, Reuters

ఉత్తర కొరియా పాలకుడు కిమ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ల భేటీ సింగపూర్‌లో జరుగనుంది. వీరు జూన్ 12న సమావేశం కానున్నారు. ఈ మేరకు ట్రంప్ వెల్లడించారు.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్‌లో ట్రంప్.. కిమ్‌తో భేటీకి ఆహ్వానాన్ని అంగీకరించి సంచలనం సృష్టించారు.

అంతకు ముందు ఈ నాయకులిద్దరూ పరస్పర ఆరోపణలు.. బెదిరింపులకు పాల్పడ్డారు.

ఇటీవల ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో ట్రంప్.. కిమ్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

వీడియో క్యాప్షన్, వీడియో: కిమ్-ట్రంప్ శత్రువులా.. ప్రియమైన శత్రువులా?

ఉత్తర కొరియా జైళ్లలో ఉన్న ముగ్గురు అమెరికన్లను ఆ దేశం విడిచి పెట్టిన నేపథ్యంలో ట్రంప్ తాజా ప్రకటన చేశారు.

గతంలోనూ అత్యున్నత స్థాయి దౌత్య సమావేశాలకు సింగపూర్‌నే ఎంచుకున్నారు.

2015లో చైనా, తైవాన్ నాయకులు కూడా ఇక్కడే చరిత్రాత్మక సమావేశాన్ని నిర్వహించారు.

మరోవైపు అమెరికా, సింగపూర్‌ల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. అలాగే ఉత్తర కొరియాతోనూ సింగపూర్ దౌత్య సంబంధాలను కొనసాగిస్తోంది.

వీడియో క్యాప్షన్, వీడియో: విలేకరులతో మాట్లాడుతున్న చున్

ఏప్రిల్లో ఏం జరిగింది??

అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న ఉద్రిక్తతలు తొలగిపోవడానికి మార్గం సుగమమైంది. చర్చలకు రావాలన్న ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించారు.

ఈ కీలక పరిణామాన్ని దక్షిణ కొరియా జాతీయ సలహాదారు చున్ యు యంగ్ వాషింగ్టన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ప్రకటించారు. కిమ్ జోంగ్ లేఖను ఈయనే ట్రంప్‌కు అందించారు.

అణ్వాయుధ పరీక్షల నిలిపివేతకు కిమ్ అంగీకరించారని, ‘అణు నిరాయుధీకరణకు కట్టుబడి ఉన్నా’నని కిమ్ స్పష్టం చేశారని కూడా ఆయన చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

కొన్ని నెలల పాటు సవాళ్లు, ప్రతిసవాళ్లు, హింస తర్వాత ఈ పరిణామం కీలక మలుపుగా కనిపిస్తోంది.

అంతకు ముందు దక్షిణ కొరియా ప్రతినిధి బృందం తొలిసారి ఉత్తర కొరియా పాలకుడు కిమ్‌తో ప్యాంగ్యాంగ్‌లో భేటీ అయింది. ఈ సందర్భంగా వారి మధ్య గతంలో ఎన్నడూ లేని విధంగా చర్చలు జరిగాయి.

ఉత్తర కొరియాతో చర్చలు జరపటంలో అర్థం లేదని ఒకప్పుడు చెప్పిన ట్రంప్.. తాజా పరిణామాలు ‘గొప్ప ముందడుగు’ అని అభివర్ణించారు.

అయితే, నిర్ధిష్టమైన అంగీకారానికి వచ్చే వరకూ ఉత్తర కొరియాపై ఆంక్షలు కొనసాగుతాయని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)