#CWG2018: రైల్వే గుమాస్తాకి బంగారు పతకం

సతీశ్

ఫొటో సోర్స్, Getty Images

కామన్వెల్త్ క్రీడల వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం. సతీశ్ శివలింగం 317 కేజీల బరువు ఎత్తి బంగారు పతకం సాధించారు.

పురుషుల 77 కేజీల విభాగం వెయిట్ లిఫ్టింగ్‌లో తమిళనాడుకు చెందిన సతీశ్ కుమార్ ఈ రికార్డు నెలకొల్పాడు.

స్నాచ్‌లో 144 కిలోల బరువు ఎత్తిన సతీశ్.. క్లీన్ అండ్ జెర్క్‌లో 173 కిలోల బరువెత్తాడు.

మొత్తం 317 కిలోల బరువు ఎత్తడంతో ఇతనికి స్వర్ణం దక్కింది.

సతీశ్

ఫొటో సోర్స్, Getty Images

ఈ విజయంతో భారత్ పతకాల పట్టికలో మూడో స్థానంలోకి చేరింది.

మరోవైపు ఇంగ్లండ్‌కి చెందిన జాక్ ఆలివర్ ఈ పోటీలో రెండో స్థానంలో నిలిచాడు.

ఇతను చివరి లిఫ్ట్‌లో 312 కిలోల బరువు ఎత్తి రజతం సాధించాడు.

ఆస్ర్టేలియాకు చెందిన ఫ్రాంకోయిస్ ఎటౌండీ మొత్తం 305 కిలోల బరువెత్తి కాంస్యం సాధించాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

సతీశ్‌కి రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్ ట్విటర్లో అభినందనలు తెలిపారు.

భారత్ ఇప్పటికి మొత్తం 5 పతకాలు సాధించింది. ఇందులో మూడు స్వర్ణాలు ఒక రజతం.. ఒక కాంస్యం ఉన్నాయి.

సతీశ్ కుమార్ గత కామన్వెల్త్ క్రీడల్లోనూ అంటే 2014లోనూ స్వర్ణ పతకం సాధించాడు.

భారత్‌కు ఇప్పటి వరకూ మొత్తం 5 పతకాలు రాగా.. అన్నీ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లోనే రావడం విశేషం.

శివలింగం.. మీరాబాయ్.. సంజితా చానూ బంగారు పతకాలు సాధించగా.. గురురాజ, దీపక్ రజత, కాంస్య పతకాలు సాధించారు.

line
శివకుమార్

ఫొటో సోర్స్, Getty Images

ఇంతకీ సతీశ్ ఎవరు

ముద్దుపేరు : సత్తి, ఈయన అర్జున అవార్డీ

స్వస్థలం: తమిళనాడులోని వేలూరు

వ‌ృత్తి: భారతీయ రైల్వేలో క్లర్క్

విద్య: హిస్టరీలో డిగ్రీ

తెలిసిన భాషలు : తమిళ్, హిందీ, ఇంగ్లీష్

తండ్రి : శివలింగం, ఈయన కూడా వెయిట్ లిఫ్టరే

line

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)