న్యూటన్, డార్విన్‌ల సమాధుల పక్కనే హాకింగ్ సమాధి

ఇటీవల మరణించిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అస్థికలను వెస్ట్‌మిన్‌స్టర్ అబేలోని సర్ ఐజాక్ న్యూటన్ సమాధి పక్కనే ఖననం చేయనున్నారు.
హాకింగ్ ఈ నెల 14న కేంబ్రిడ్జిలోని తన నివాసంలో కన్నుమూశారు.
హాకింగ్ అంత్యక్రియలు యూనివర్సిటీలోని గ్రేట్ సెయింట్ మేరీస్ చర్చిలో జరుగుతాయని ఆయన కుటుంబం తెలిపింది.
ఈ చర్చి హాకింగ్ గత 50 ఏళ్లుగా పని చేస్తున్న గోన్‌విల్ అండ్ కీస్ కాలేజీకి దగ్గరలో ఉంది.
హాకింగ్ పిల్లలు, లూసీ, రాబర్ట్, టిమ్‌లు కాలేజీ వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.
''మా తండ్రి ఎంతగానో ప్రేమించిన నగరంలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించాము.'' అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Andrew Matthews/PA
1882లో మరణించిన ఛార్లెస్ డార్విన్ సమాధి కూడా హాకింగ్ సమాధికి దగ్గరలోనే ఉంది.
హాకింగ్ అస్థికలను ప్రఖ్యాత శాస్త్రవేత్తల సమాధులకు దగ్గరలోనే ఖననం చేయడమంటే ఆయనకు సముచిత గౌరవం ఇవ్వడమే అవుతుందని డీన్ ఆఫ్ వెస్ట్‌మిన్‌స్టర్ డాక్టర్ జాన్ హాల్ తెలిపారు.
సర్ ఐజాక్ న్యూటన్‌ను 1727లో అబేలో సమాధి చేయగా, చార్లెస్ డార్విన్‌ను 1882లో న్యూటన్ సమాధి పక్కనే ఖననం చేశారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








