ఈ వారం అద్భుత చిత్రాలు: 2017 డిసెంబర్ 30 - 2018 జనవరి 5

2017 డిసెంబర్ 30 నుంచి 2018 జనవరి 5 వరకు వారం రోజుల్లో అద్భుతంగా అనిపించిన కొన్ని చిత్రాలు.

తారు బకెట్లను నెత్తిన పెట్టుకుని భారీ ప్రదర్శన

ఫొటో సోర్స్, Nigel Roddis/ EPA

ఫొటో క్యాప్షన్, నెత్తిన పెద్ద బకెట్.. అందులో భగభగ మండుతున్న తారు.. చేతుల్లో కాగడాలతో ఇంగ్లాండ్‌లోని అల్లెండేల్ గ్రామంలో ఇలా భారీ ప్రదర్శన నిర్వహించారు. ఏటా నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఇక్కడ ఇలాగే సందడి చేస్తారు.
నీటిలోకి దూకుతున్న వ్యక్తి

ఫొటో సోర్స్, MASSIMO PERCOSSI/ EPA

ఫొటో క్యాప్షన్, ఇటలీలోని రోమ్: కొత్త సంవత్సర సంబరాల్లో భాగంగా 50 అడుగుల ఎత్తైన వంతెన నుంచి టైబర్ నదిలో పల్టీ కొడుతున్న ప్రముఖ డైవర్ మార్కో పోయిస్
మంచుతో రూపొందించిన ఖండాంతర క్షిపణి ఆకృతి

ఫొటో సోర్స్, Kyodo / REUTERS

ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో టయ్‌డాంగ్ నది వద్ద నూతన సంవత్సర వేడుకులు అట్టహాసంగా జరిగాయి. మంచుతో రూపొందించిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఆకృతి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
'కొచ్చిన్ కార్నివాల్‌'లో ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ఓ కళాకారుడు.

ఫొటో సోర్స్, Sivaram V / Reuters

ఫొటో క్యాప్షన్, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నిర్వహించే కేరళలోని 'కొచ్చిన్ కార్నివాల్‌'లో ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ఓ కళాకారుడు.
అట్లాంటిక్ సముద్రపు నీటిలో ఈతగాళ్లు

ఫొటో సోర్స్, Stefanie Keith/ Reuters

ఫొటో క్యాప్షన్, న్యూయార్క్‌: కొనీ ఐలాండ్‌లోని పోలార్ బియర్ క్లబ్‌లో అత్యంత చల్లని అట్లాంటిక్ సముద్రపు నీటిలో ఈతగాళ్లు ఇలా సందడి చేశారు.
యోగా చేస్తున్న విద్యార్థులు

ఫొటో సోర్స్, Amit Dave/ Reuters

ఫొటో క్యాప్షన్, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన యోగా క్యాంపు ముగింపు రోజు పాఠశాలల విధ్యార్థులంతా చక్కగా యోగాసనాలు వేశారు.
నయాగర జలపాతం సరికొత్త సొగబులు అద్దుకుంది.

ఫొటో సోర్స్, GEOFF ROBINS/ AFP

ఫొటో క్యాప్షన్, ఉత్తర అమెరికాలోని నయాగర జలపాతం సరికొత్త సొగబులు అద్దుకుంది. 2017 డిసెంబర్ ఆఖరి వారంలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో నీరు పాక్షికంగా గడ్డకట్టింది. 2014 జనవరిలో ఉష్ణోగ్రత -19Cకి చేరినప్పుడు ఈ జలపాతం పూర్తిగా గడ్డకట్టుకుపోయింది.
బాణాసంచా వెలుగులు

ఫొటో సోర్స్, Victoria Jones/ PA

ఫొటో క్యాప్షన్, నూతన సంవత్సరానికి స్వాగతం పలకుతూ సెంట్రల్ లండన్‌లో కాల్చిన బాణాసంచా వెలుగులు ఇలా కనువిందు చేశాయి.
సముద్రంలో తరుముకొస్తున్న భారీ అల. దానికంటే వేగంగా రివ్వున దూసుకెళ్తున్న ఓ సర్ఫర్.

ఫొటో సోర్స్, PATRICIA DE MELO MOREIRA / AFP

ఫొటో క్యాప్షన్, సముద్రంలో తరుముకొస్తున్న భారీ అల. దానికంటే వేగంగా రివ్వున దూసుకెళ్తున్న ఓ సర్ఫర్! ఈ ఫొటో పోర్చుగల్‌లోని నజారే తీర ప్రాంతంలో తీసింది. బ్రెజిల్‌కు చెందిన ఈ సర్ఫర్ పేరు లుకాస్ చుంబో.
అగ్నిప్రమాదంలో కాలిపోయిన కార్లు.

ఫొటో సోర్స్, Merseyside Fire and Rescue Service

ఫొటో క్యాప్షన్, ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్ ప్రాంతంలో ఉన్న ఓ మల్టీ లెవెల్ కారు పార్కింగ్‌ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అందులో ఉన్న 1,300 కార్లు కాలిబూడిదయ్యాయి.

ఈ చిత్రాలన్నీ కాపీరైట్ చేయబడ్డాయి.

ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)