ఈ వారం 'చిత్ర భారతం'

తమిళనాడు రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రజనీకాంత్, హైదరాబాద్‌లో కొత్త సంవత్సర ఉత్సాహం, ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఉత్సవం.. ఈ వారం ‘చిత్రభారతం’లో..

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ‘విశాఖ ఉత్సవం’ను సందడిగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ ప్రదర్శనతో అందరినీ కట్టిపడేశారీ కళాకారిణులు.

ఫొటో సోర్స్, Tirupati Rao

ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ‘విశాఖ ఉత్సవం’ను సందడిగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ ప్రదర్శనతో అందరినీ కట్టిపడేశారీ కళాకారిణులు.
ఆంగ్ల నూతన సంవత్సరాన్ని హైదరాబాద్‌లో వేడుకగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా జనవరి 1న మహిళలు తమ ఇళ్ల ముందు ముగ్గులు వేశారు.

ఫొటో సోర్స్, NOAH SEELAM/GettyImages

ఫొటో క్యాప్షన్, ఆంగ్ల నూతన సంవత్సరాన్ని హైదరాబాద్‌లో వేడుకగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా జనవరి 1న మహిళలు తమ ఇళ్ల ముందు ముగ్గులు వేశారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో సబర్మతీ రివర్‌ఫ్రంట్ వద్ద నిర్వహిస్తున్న పుష్ప ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన విరి సుందరి
ఫొటో క్యాప్షన్, గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో సబర్మతీ రివర్‌ఫ్రంట్ వద్ద నిర్వహిస్తున్న పుష్ప ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన విరి సుందరి.
పుణ్య స్నానాలు చేస్తున్న స్వామినారాయణ్ గురుకులానికి చెందిన విద్యార్థులు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వీరంతా అహ్మదాబాద్‌లోని స్వామినారాయణ్ గురుకులానికి చెందిన విద్యార్థులు. గురుకులంలో వేడినీటి సదుపాయం ఉన్నా కూడా చన్నీటితో పుణ్య స్నానాలు చేస్తున్నారు. వాతావరణాన్ని తట్టుకునేందుకు గాను వీరు ఏటా ఒక నెలపాటు ఇలా చేస్తారు.
సినీహీరో రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. అభిమానులతో వరుసగా సమావేశాలు నిర్వహించిన ఆయన వారి సమక్షంలోనే తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సినీహీరో రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. అభిమానులతో వరుసగా సమావేశాలు నిర్వహించిన ఆయన వారి సమక్షంలోనే తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేశారు.
మహారాష్ర్టలో భీమాకోరెగాం అల్లర్లలో కాలిపోయిన వాహనం

ఫొటో సోర్స్, Mayuresh Konnur / BBC

ఫొటో క్యాప్షన్, మహారాష్ర్టలో భీమాకోరెగాం అల్లర్లలో కాలిపోయిన వాహనం.
శీతాకాలంలో ఆకురాల్చిన పోప్లర్ చెట్లు. పంజాబ్‌లో విరివిగా కనిపించే ఈ చెట్లు సాధారణంగా నిండా ఆకులతో ఉంటాయి. చలికాలంలో ఇలా ఆకులు రాలి మోడుగా మారుతాయి.

ఫొటో సోర్స్, Khushal Lali

ఫొటో క్యాప్షన్, శీతాకాలంలో ఆకురాల్చిన పోప్లర్ చెట్లు. పంజాబ్‌లో విరివిగా కనిపించే ఈ చెట్లు సాధారణంగా నిండా ఆకులతో ఉంటాయి. చలికాలంలో ఇలా ఆకులు రాలి మోడుగా మారుతాయి.