కాటలోనియా ఎన్నికలు: ‘ఇది స్పెయిన్ ఓటమి’

ఫొటో సోర్స్, Getty Images
కాటలోనియా ఎన్నికల్లో స్పెయిన్ ఓటమి పాలైందని బహిష్కృత ‘వేర్పాటువాద’ నాయకుడు కార్లెస్ పుజ్దెమాంట్ ప్రకటించారు.
బ్రస్సెల్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు ఫలితాలు ‘కాటలోనియా గణతంత్రానికి’ దక్కిన విజయం అని అభివర్ణించారు.
తాజా ఎన్నికల ఫలితాలతో కొత్త అసెంబ్లీలో వేర్పాటువాద పార్టీలకు స్వల్ప మెజార్టీ లభించింది. గతంతో పోలిస్తే మెజార్టీ తగ్గింది.
అయితే, స్పెయిన్‌లో ‘పాక్షిక స్వతంత్ర్య’ భాగంగా కాటలోనియా ఉండాలని కోరుకుంటున్న సిటిజన్స్ పార్టీకే అత్యధిక స్థానాలు లభించాయి.
ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరికి అవకాశం లభిస్తుందనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి.
మొత్తం 135 స్థానాలకు గాను 25.3 శాతం ఓట్లు.. 37 సీట్లు గెలుచుకున్న సిటిజెన్స్ పార్టీ నాయకురాలు ఐనెస్ అరిమదాస్ బీబీసీతో మాట్లాడుతూ.. తమకు విజయం దక్కిందని, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కష్టమే కానీ, తాము తప్పకుండా ప్రయత్నిస్తామని చెప్పారు.
స్పెయిన్‌లోని కాటలోనియాలో జరిగిన తాజా ఎన్నికల్లో వేర్పాటు వాద పార్టీలు మెజారిటీసీట్లను గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో వేర్పాటు వాద పోరు మరింత ఉద్ధృతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
స్థానిక కాలమానం ప్రకారం గురువారం కీలకమైన ప్రాంతీయ ఎన్నికలు జరిగాయి.
ఈ పరిణామంతో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం సిటిజన్స్ పార్టీకి వస్తుందా.. లేదా వేర్పాటు వాద పార్టీలకు వస్తాయా అన్నది తేలలేదు.

ఫొటో సోర్స్, Getty Images
కాటలోనియా స్వాతంత్ర్యంపై అక్టోబరు 1న నిర్వహించిన రెఫరెండం వివాదాస్పదమైంది. రెఫరెండంలో స్వాతంత్ర్యానికి అనుకూలంగా ఫలితం వచ్చింది.
అయితే రెఫరెండం చెల్లదని స్పెయిన్ ప్రకటించింది. స్వాతంత్ర్య ప్రకటనను చట్టవిరుద్ధమని తేల్చి.. కాటలోనియా పార్లమెంటును రద్దు చేసింది.
ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంత పార్లమెంటుకు స్పెయిన్ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
కాటలోనియాకు స్వాతంత్ర్యం కల్పించాలనేవారు ఎంత మంది, ఇప్పుడున్నట్లుగానే పాక్షిక స్వయంప్రతిపత్తితో ఈ ప్రాంతం స్పెయిన్‌లో భాగంగానే కొనసాగాలనేవారు ఎంత మంది అనేది ఈ ఎన్నికలో వెల్లడి కానుంది.
తాజా ఎన్నికలతో కూడా కాటలోనియా రాజకీయ సంక్షోభం పరిష్కారమవుతుందనే సూచనలు పెద్దగా లేవని బార్సిలోనాలోని బీబీసీ ప్రతినిధి కెవిన్ కనోలీ తెలిపారు.
పది లక్షల మంది ఓటర్లు ఎటూ నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్నారని, వారి నిర్ణయంపైనే గురువారం నాటి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుందని స్పానిష్ పత్రిక ఎల్ పాయిస్ అభిప్రాయపడింది.
కాటలోనియాలో దాదాపు 53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 80 శాతంపైగా పోలింగ్ నమోదైంది.

ఫొటో సోర్స్, EPA
'అత్యంత ముఖ్యమైన ఎన్నిక'
కాటలోనియా చరిత్రలో ఇది అత్యంత ముఖ్యమైన ఎన్నికని బార్సిలోనాలో అనా అనే విద్యార్థి వ్యాఖ్యానించినట్లు బీబీసీ ఐరోపా ప్రతినిధి గావిన్ లీ తెలిపారు.
కాటలోనియా స్వాతంత్ర్య అనుకూల పక్షం 'రిపబ్లికన్ లెఫ్ట్ ఆఫ్ కాటలోనియా(ఈఆర్‌సీ)' తొలి స్థానంలో నిలుస్తుందని, ఈ ప్రాంతం స్పెయిన్‌లోనే కొనసాగాలనే 'సిటిజన్స్' పార్టీపై ఈఆర్‌సీ స్వల్ప ఆధిక్యం సాధిస్తుందని స్పానిష్ పత్రిక ఎల్ పాయిస్‌లో కొద్ది రోజుల కిందట ప్రచురితమైన సర్వేలు సూచిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
కాటలోనియా పదవీచ్యుత అధ్యక్షుడు కార్లెస్ ప్యుగ్డిమాంట్‌కు చెందిన 'టుగెదర్ ఫర్ కాటలోనియా' పార్టీ మూడో స్థానంలో నిలవొచ్చని పేర్కొన్నాయి.
అయితే స్వాతంత్ర్యానికి అనుకూలంగా పార్లమెంటులో ఏ పార్టీకీ మెజారిటీ లభించకపోవచ్చని వెల్లడించాయి.
బలాన్ని చాటండి: ప్యుగ్డిమాంట్
గురువారం ఎన్నికలో కాటలోనియా ప్రజలు వారి తిరుగులేని బలాన్ని ప్రదర్శించాలని కాటలోనియా పదవీచ్యుత అధ్యక్షుడు కార్లెస్ ప్యుగ్డిమాంట్ 'ట్విటర్'లో పిలుపునిచ్చారు.
ఆయన ప్రస్తుతం బెల్జియంలో ప్రవాసంలో ఉన్నారు.
సంబంధిత కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









