జుట్టు నెరవక ముందే దేశాధినేతలైపోయారు

ఫొటో సోర్స్, గెట్టీ
‘‘ప్రధానమంత్రి’’ అనగానే నెరిసిన జుట్టు, కళ్లజోడు, రాజకీయ అనుభవంతో పండిపోయిన ఓ ముసలి వ్యక్తి కళ్లముందు తారాడుతాడు. కానీ కాలం మారుతోంది.
ముసలివాళ్లు కాదు.. పరిగెత్తే పడుచువాళ్లు దేశాలకు ప్రధానులవుతున్నారు.
ఆస్ర్టియాలో 31 ఏళ్ల యువకుడు దేశానికి అధినేత కాబోతున్నాడు.
ఈ నేపథ్యంలో మరికొందరు అలాంటి యువనేతలు..
ఎమ్మాన్యుయెల్ మాక్రోన్

ఫొటో సోర్స్, Getty Images
ఎమ్మాన్యుయెల్ మ్యాక్రోన్, అత్యంత చిన్నవయస్సులోనే ఫ్రాన్స్ దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
2017లో అధ్యక్షుడిగా ఎన్నికైనపుడు ఆయన వయస్సు 39 సంవత్సరాలు. మ్యాక్రోస్ ఫ్రాన్స్‌లో ఓ సంచలనం.
తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లే. రచయితగానో లేక నటుడిగానో స్థిరపడాలనుకున్న మ్యాక్రోస్ చివరకు ఫ్రాన్స్ దేశాధ్యక్షుడయ్యారు.
2. లియో వారాద్కర్

ఫొటో సోర్స్, Getty Images
లియో వారాద్కర్, 2017లో ఐర్లాండ్ ప్రధానిగా ఎంపికయ్యారు.ఆయన వయస్సు 38.
లియో వారాద్కర్, భారత సంతతికి చెందినవారు. వారాద్కర్ 1979లో జన్మించారు.
వారాద్కర్ తండ్రి పేరు అశోక్. ఈయన ముంబైకు చెందిన డాక్టర్.
అశోక్, బెర్క్ షైర్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నపుడు మిరియమ్ అనే మహిళా నర్సును పెళ్లాడారు. వీరి సంతానమే లియో వారాద్కర్.
ఈయన 24 యేళ్ల వయసులో కౌన్సిలర్ అయ్యారు. 2007లో ఐరిష్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.
3.జిగ్మే కేసర్ నామ్జ్యిల్ వాన్గ్‌ఛక్

ఫొటో సోర్స్, Reuters
జిగ్మే కేసర్ నామ్జ్యిల్ వాన్గ్‌ఛక్ అత్యంత పిన్న వయస్సుకల రాజు. 2008లో భూటాన్‌కు రాజయ్యారు. అప్పుడు ఆయన వయసు కేవలం 31 సంవత్సరాలే.
ఈయన విద్యాభ్యాసం భారత్, అమెరికాల్లో సాగింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రం అభ్యసించారు.
వందేళ్ల భూటాన్ చరిత్రలో, జిగ్మే కేసర్ నామ్జ్యిల్ వాన్గ్‌ఛక్ ఐదవ రాజు.
4. షైక్ తమీమ్ బిన్ హామద్ అస్సానీ

ఫొటో సోర్స్, Reuters
2013లో ఖతర్‌కి అమిర్‌గా నియమితమైన షైక్ తమీమ్ వయస్సు కేవలం 33 సంవత్సరాలే. సాధారణంగా తాము చనిపోయేవరకూ పాలించడం ఈప్రాంత ఆచారం. కానీ, ఆచారానికి భిన్నంగా,తండ్రి బతికుండగానే షైక్ తమీమ్ బిన్ హామద్ అస్సానీ అధికారంలోకి వచ్చారు.
షైక్ తమీమ్ 1980లో జన్మించారు. ఇతను తన తల్లిదండ్రులకు నాల్గవ సంతానం. ఇతని విద్యాభ్యాసం బ్రిటన్‌లో సాగింది.
కిమ్ జాంగ్ ఉన్

ఫొటో సోర్స్, Getty Images
కిమ్ జాంగ్ ప్రస్తుతం ఓ సంచలనం. నిత్యమూ అమెరికాపై మాటల తూటాలు పేల్చుతూ వార్తల్లో నిలుస్తున్నాడు.
తండ్రి కిమ్ జాంగ్-II గత సంవత్సరం మరణించారు. ఆయన మరణానంతరం కిమ్ జాంగ్ అధికారంలోకి వచ్చారు.
ఈయన విద్యాభ్యాసంలో కొంతభాగం స్విట్జర్లాండ్‌లో సాగింది.
సెబాస్టియన్ ఖర్జ్

ప్రపంచంలోనే అత్యంత చిన్నవయస్సుకల దేశ నాయకుడిని ఆస్ట్రియా చూడబోతోంది.
తాజా ఎన్నికల్లో, కన్జర్వేటివ్ పీపుల్స్ పార్టీ గెలుపు దిశగా అడుగు వేస్తోంది.
ఈ పార్టీకి 31సంవత్సరాల సెబాస్టియన్ ఖర్జ్ నాయకత్వం వహిస్తున్నారు.
2013లో ఆస్ట్రియా విదేశాంగ మంత్రిగా ఖర్జ్ పనిచేశారు. అప్పటికి ఆయన వయసు 27 ఏళ్లే.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








