‘పోలీసులు బలవంతంగా నాతో మూత్రం తాగించారు’
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలంలోని రామోజీ తండా ఒక సాధారణ లంబాడ గిరిజన పల్లె.
ఈ తండాకు చెదిన గుగులోత్ వీరశేఖర్(23) అనే గిరిజన యువకుడిని దొంగతనం ఆరోపణల పై ఆత్మకూరు(ఎస్) పోలీసులు చితకబాదారు.
ఆ తర్వాత గిరిజన సంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు, హక్కుల సంఘాల ఆందోళనలకు దిగాయి.
పోలీసుల తీరు పై తీవ్ర విమర్శలు వచ్చాయి.
నవంబర్ 4న తన దుకాణంలో చోరీ జరిగిందని.. 40 క్వార్టర్ సీసాల మద్యం, 10 వేల నగదు ఎత్తుకెళ్లారని ఏపూర్ గ్రామానికి చెందిన షేక్ సైదులు ఆత్మకూర్(ఎస్) పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.
విచారణలో భాగంగా సీసీ ఫుటేజ్ ఆధారంగా రామోజీ తండాకు చెందిన 'బానోత్ నవీన్'ను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు.
ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా బుధవారం (నవంబర్ 10)న బానోత్ బుచ్యా, బానోత్ లాల్ సింగ్, గుగులోత్ వీరశేఖర్‌లను గ్రామం నుండి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి వీరశేఖర్‌ను వదిలేశారు.
మళ్లీ ఉదయాన్న మరోసారి విచారించాలని, స్టేషన్ కు రావాలని అడిగారు.
అయితే అప్పటికే తీవ్రంగా అస్వస్థతకు గురైన వీరశేఖర్‌ను ఏమైందంటూ కుటుంబ సభ్యులు ఆరా తీయగా... విచారణ పేరిట పోలీసులు తనను చిత్రహింసలకు గురిచేసినట్టు వెల్లడించాడు.
ఆగ్రహంతో గ్రామస్తులు, కుటుంబసభ్యులు కదల్లేని స్థితిలో ఉన్న వీరశేఖర్‌ను ట్రాక్టర్ లో తీసుకుని వెళ్లి ఆత్మకూరు(ఎస్) పోలీస్ స్టేషన్ ముట్టిడించి, అక్కడి పోలీస్ సిబ్బందిని నిలదీశారు.
ఇవి కూడా చదవండి:
- మహాత్మా గాంధీ: కరెన్సీ నోట్లు, అలంకార వస్తువులకే పరిమితం కానున్నారా?
- డెమిసెక్సువాలిటీ అంటే ఏమిటి? ఈ లైంగిక భావనను వివరించడం ఎందుకు క్లిష్టమైన విషయం?
- జుల్ఫికర్ అలీ భుట్టో: 47 ఏళ్ల కిందటి ఒక హత్య కేసు ఈ నేత మెడకు ఉరి తాడులా ఎలా చుట్టుకుంది?
- టీ20 ప్రపంచకప్ ఫైనల్: న్యూజీలాండ్, ఆస్ట్రేలియా జట్లలో ఎవరిది పైచేయి...
- బంగ్లాదేశ్ హిందువుల ఉపవాస దీక్ష, ఇజ్రాయెల్‌లో పెలికాన్ల సందడి, కొలంబోలో వరద బీభత్సం - ఈ వారం ప్రపంచ చిత్రాలు ఇవీ
- దిల్లీ కాలుష్యంపై సుప్రీం కోర్టు సీరియస్... అవసరమైతే లాక్డౌన్ విధించాలని సూచన
- టీ20 ప్రపంచకప్: వేడ్ క్యాచ్‌ను హసన్ అలీ వదిలేయడం వల్లే పాకిస్తాన్ సెమీస్‌లో ఓడిందా?
- ఆంధ్రప్రదేశ్: పీఆర్సీ కోసం ఉద్యోగుల పట్టు... ఎందుకీ జాప్యం? ప్రభుత్వం ఏమంటోంది?
- ఆనందం లేదా భయం కలిగినప్పుడు మనం గట్టిగా ఎందుకు అరుస్తాం?
- హిందుత్వను ఐసిస్, బోకోహరామ్లతో పోల్చిన సల్మాన్ ఖుర్షీద్... కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)