బంగ్లాదేశ్ హిందువుల ఉపవాస దీక్ష, ఇజ్రాయెల్‌లో పెలికాన్‌ల సందడి, కొలంబోలో వరద బీభత్సం - ఈ వారం ప్రపంచ చిత్రాలు ఇవీ

నవంబరు 6 నుంచి 12 మధ్య ప్రపంచవ్యాప్తంగా ఈ వారం తీసిన చిత్రాలలో కొన్ని..

SpaceX Falcon 9 rocket

ఫొటో సోర్స్, THOM BAUR / REUTERS

ఫొటో క్యాప్షన్, ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి దూసుకెళ్తున్న స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్
బెలరూస్, పోలండ్ సరిహద్దుల్లో గడ్డకట్టించే చలిలో నిరీక్షిస్తున్న వందలాది మంది వలస ప్రజలు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బెలారస్, పోలండ్ సరిహద్దుల్లో గడ్డకట్టించే చలిలో నిరీక్షిస్తున్న వందలాది మంది వలస ప్రజలు. ఎలాగైనా యూరోపియన్‌ యూనియన్ ప్రాంతంలోకి వెళ్లాలన్న ఆశతో వీరంతా నిరీక్షిస్తున్నారు.
People wait for relatives after the arrival of a British Airways flight at New York's JFK International Airport

ఫొటో సోర్స్, EDUARDO MUNOZ / REUTERS

ఫొటో క్యాప్షన్, న్యూయార్క్‌లోని జాన్‌.ఎఫ్.కెనడీ విమానాశ్రయానికి చేరుకున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో వచ్చిన తమ బంధువుల కోసం నిరీక్షిస్తున్నారు వీరంతా. 20 నెలల తరువాత విదేశీ ప్రయాణికులతో వచ్చిన విమానం అది.
ఇజ్రాయెల్‌లోని మిష్మార్ హష్రాన్ జలాశయం వద్ద పెద్దసంఖ్యలో చేరిన గ్రేట్ వైట్ పెలికాన్స్.

ఫొటో సోర్స్, AMIR COHEN / REUTERS

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్‌లోని మిష్మార్ హష్రాన్ జలాశయం వద్ద పెద్దసంఖ్యలో చేరిన గ్రేట్ వైట్ పెలికాన్స్.
A Sri Lankan boy walks his dog along a submerged road after heavy rainfall and flooding in a Colombo suburb

ఫొటో సోర్స్, CHAMILA KARUNARTHNE / EPA-EFA

ఫొటో క్యాప్షన్, శ్రీలంకలోని కొలంబో శివార్లలో జలమయమైన రహదారిపై తన పెంపుడు కుక్కతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న కుర్రాడు. భారీ వర్షాలకు వరదలు రావడంతో కొలంబో, పరిసర ప్రాంతాలు జలమయ్యాయి. వరదల కారణంగా 25 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వేలాది మంది ఇల్లూవాకిలి వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చింది.
People in Buenos Aires celebrated the city's 30th Pride Parade which, after the virtual edition of 2020, returned to the streets.

ఫొటో సోర్స్, JUAN IGNACIO / EPA-EFA

ఫొటో క్యాప్షన్, అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ ప్రజలు ఆ నగర 30వ ప్రైడ్ పరేడ్ నిర్వహించారు
A woman in costume poses for a photograph during the biannual Whitby Goth Weekend festival in northern England

ఫొటో సోర్స్, oli scarf/afg

ఫొటో క్యాప్షన్, ఉత్తర ఇంగ్లండ్‌లో ఆర్నెళ్లకోసారి నిర్వహించే విట్‌బై గోథ్ వీకెండ్ ఫెస్టివల్‌లో ఓ యువతి. ఈ వేడుకలకు యూకే నుంచే కాకుండా ఇతర దేశాల నుంచీ పెద్దసంఖ్యలో ప్రజలు వస్తారు.
బంగ్లాదేశ్‌లోని లోక్‌నాథ్ బ్రహ్మచారి ఆలయంలో ‘రఖేశ్ ఉపవాస్’ పండుగకు వచ్చిన భక్తులు

ఫొటో సోర్స్, MUNIR UZ ZAMAN / AFP

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్‌లోని నారాయణ్ గంజ్‌లో ఉన్న లోక్‌నాథ్ బ్రహ్మచారి ఆలయంలో ‘రఖేశ్ ఉపవాస్’ పండుగ సందర్భంగా పెద్దసంఖ్యలో చేరిన హిందూ భక్తులు
మొదటి ప్రపంచ యుద్ధానికి ముగింపు పలికి 103 ఏళ్లయిన సందర్భంగా నవంబరు 11న ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న ఒపెరా హౌస్ వద్ద ప్రదర్శనలు

ఫొటో సోర్స్, BRENDON THORNE / GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, మొదటి ప్రపంచ యుద్ధానికి ముగింపు పలికి 103 ఏళ్లయిన సందర్భంగా నవంబరు 11న ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న ఒపెరా హౌస్ వద్ద ప్రదర్శనలు
గ్లాస్గోలో కాప్26 సదస్సు ప్రాంగణం బయట నిరసన తెలుపుతున్న శిలాజ ఇంధన వ్యతిరేక ప్రదర్శనకారులు

ఫొటో సోర్స్, JEFF J MITCHELL / GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, గ్లాస్గోలో కాప్26 సదస్సు ప్రాంగణం బయట నిరసన తెలుపుతున్న శిలాజ ఇంధన వ్యతిరేక ప్రదర్శనకారులు