‘అక్కడ స్పీడ్ లిమిట్ 40kmph.. సాయి ధరమ్ తేజ్ బండి వేగంగా వెళ్తోంది.. అందుకే కేసు పెట్టాం’ - మాదాపూర్ డీసీపీ

వీడియో క్యాప్షన్, ‘అక్కడ స్పీడ్ లిమిట్ 40kmph.. సాయి ధరమ్ తేజ్ బండి వేగంగా వెళ్తోంది.. అందుకే కేసు’

హైదరాబాద్‌లోని కేబుల్ వంతెనపై స్పీడ్ లిమిట్ ఎంత? సాయి ధరమ్ తేజ్ ఎంత వేగంగా వెళ్లారు?

ఈ ప్రశ్నలకు మాదాపూర్ జోన్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు సమాధానం ఇస్తూ.. హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జిపైన, ఐకియా ఫ్లై ఓవర్ పైన స్పీడ్ లిమిట్ గంటకు 40 కిలోమీటర్లు మాత్రమేనని చెప్పారు.

సాయి ధరమ్ తేజ్ ఐకియా ఫ్లై ఓవర్‌పైన ప్రయాణిస్తున్నప్పుడు రెండు కార్లను ఓవర్ టేక్ చేసినట్లు కనిపించింది.

అయితే, ప్రమాదం జరిగినప్పుడు.. ఒక ఆటోను ఓవర్ టేక్ చేయడానికి మూడు లైన్ల రోడ్డులో ఎడమవైపు చివరగా ఉన్న లైనులోకి సాయి ధరమ్ తేజ్ వచ్చాడు.

కానీ, పక్కనే కన్‌స్ట్రక్షన్ జరుగుతుండటం వల్ల రోడ్డుపైన కొంత ఇసుక చేరింది. స్పోర్ట్స్ బైక్ అదుపుతప్పి సాయి ధరమ్ తేజ్ కింద పడిపోయాడు.

స్పీడ్ లిమిట్ పట్టించుకోకుండా, దానికంటే వేగంగా నడిపినందుకు గాను సాయి ధరమ్ తేజ్‌పైన కేసు పెట్టామని, ఆయన కోలుకున్న తర్వాత విచారణ జరుపుతామని పోలీసులు చెప్పారు.

బీబీసీతో మాట్లాడుతూ మాదాపూర్ డీసీపీ ఇంకా ఏమన్నారో పై వీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)