Income Tax Returns: ఆదాయ పన్ను శాఖ కొత్త వెబ్‌సైట్‌ ఫీచర్స్ ఇవీ..

ఇన్‌కమ్ ట్యాక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) ప్రక్రియను సరళతరం చేయడమే లక్ష్యంగా కొత్త ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌ను కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆవిష్కరించింది.

కరోనా వ్యాప్తి నడుమ ఫామ్-16 తీసుకోవడం నుంచి ఐటీఆర్ దాఖలు వరకు అన్ని ప్రక్రియలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్థం, సరికొత్త ఆప్షన్లతో ఈ వెబ్‌సైట్ ( www.incometax.gov.in )ను తీర్చిదిద్దినట్లు కేంద్ర ప్రత్యక పన్నుల మండలి (సీబీడీటీ) ఓ ప్రకటన విడుదల చేసింది.

పన్ను చెల్లింపుదారులకు వేగంగా నిధులు వెనక్కి ఇచ్చేందుకు సత్వరమే ఐటీ రిటర్న్స్‌ను ప్రాసెస్ చేసేలా ఈ వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేశామని సీబీడీటీ పేర్కొంది.

‘‘కొత్త పోర్టల్ ఎప్పుడు వస్తుందా అని వినియోగదారులతోపాటు మేం కూడా ఎదురుచూస్తున్నాం. పోర్టల్ అభివృద్ధి చివరి దశలో ఉంది. త్వరలో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. దీని కోసం ఎదురుచూస్తున్నందుకు ధన్యవాదాలు’’అని ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన ప్రకటనతో తెలిపింది.

ప్రస్తుతం కొత్త వెబ్‌సైట్ లింక్ స్పందించడం లేదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

త్వరలో మొబైల్ యాప్ కూడా..

ఆదాయపు పన్ను చెల్లింపుదారుల కోసం త్వరలో ఒక మొబైల్ యాప్ కూడా ఆవిష్కరించబోతున్నట్లు సీబీడీటీ తెలిపింది.

‘‘కొత్త వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌లు, పెండింగ్ యాక్షన్‌లు.. ఇలా అన్ని ఒకే డ్యాష్ బోర్డుపై కనిపిస్తాయి. దీంతో ఫాలోఅప్ చేసుకోవడం తేలిక అవుతుంది’’అని ప్రకటనలో సీబీడీటీ పేర్కొంది.

అంటే దాఖలు చేసిన అప్లికేషన్ ఎంతవరకు వచ్చింది? తర్వాత ఏం చేయాలి? లాంటి విషయాలన్నీ ఇకపై ఒకే డ్యాష్‌బోర్డ్‌పై చూడొచ్చు.

‘‘ఐటీఆర్ –1, 4లను దాఖలు చేయడంలో తోడ్పడే ప్రశ్నలు-సమాధానాలతో ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా వెబ్‌సైట్‌తో అనుసంధానించాం. ఇవి ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లోనూ చూడొచ్చు. ఐటీఆర్-2 ఆఫ్‌లైన్‌లో మొదలుపెడుతున్నాం’’.

‘‘త్వరలో ఐటీఆర్ – 3, 5, 6, 7లకు కూడా ఇలాంటి సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తాం’’.

ఇన్‌కమ్ ట్యాక్స్

ఫొటో సోర్స్, Getty Images

తేలిగ్గా అప్‌డేట్ చేసుకోవచ్చు

కొత్త వెబ్‌సైట్‌లో వేతనం, ఉద్యోగం/వృత్తి, స్థిరస్తులు తదితర వివరాను అప్‌లోడ్‌చేసి ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. దీంతో తేలిగ్గా ఐటీఆర్ దాఖలు చేయొచ్చు. మీరు అప్‌లోడ్ చేసే సమాచారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దగ్గర భద్రంగా ఉంటుందని సీబీడీటీ పేర్కొంది.

మరోవైపు టీడీఎస్ సర్టిఫికేట్, ఎస్‌టీఎఫ్ స్టేట్‌మెంట్‌లను మీరు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తే చాలు. మిగతా వివరాలను వెబ్‌సైట్ ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది.

‘‘పన్ను చెల్లింపుదారులు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు కొత్త కాల్‌సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశాం. సవివర ప్రశ్నలు-సమాధానాలు, వీడియోలు, చాటింగ్ కోసం చాట్‌బోట్‌లు కొత్తగా సిద్ధంచేశాం’’.

‘‘వివరాలను ధ్రువీకరించే ప్రక్రియను కూడా సులభతరం చేశాం’’అని సీబీడీటీ ప్రకటనలో పేర్కొంది.

ఐటీఆర్ ఫైలింగ్

ఫొటో సోర్స్, Getty Images

అదనపు పన్ను చెల్లించాలంటే..

ఒకసారి రిటర్న్స్ దాఖలు చేసిన తర్వాత, దీనిలో మార్పులు చేయాలన్నా లేదా అదనంగా రిటర్న్స్ ఏమైనా దాఖలు చేయాలన్న ఇప్పుడు తేలికగా పని పూర్తవుతుందని సీబీడీటీ తెలిపింది.

ఆన్‌లైన్ పేమెంట్ల కోసం ప్రత్యేక సదుపాయం కూడా ఏర్పాటుచేశారు. అంటే ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ తదితర మార్గాల ద్వారా పేమెంట్లు చేయొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)